iDreamPost
android-app
ios-app

Marcus Stoinis: చెన్నైపై విజయం తర్వాత స్టోయినిస్ మాటలకు హ్యాట్సాఫ్ అనాల్సిందే!

  • Published Apr 24, 2024 | 10:04 AM Updated Updated Apr 24, 2024 | 10:04 AM

చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం సాధించిన తర్వాత ఎమోషనల్ కామెంట్స్ చేశాడు లక్నో స్టార్ బ్యాటర్ మార్కస్ స్టోయినిస్. ఈ మాటలు వింటే హ్యాట్సాఫ్ అనాల్సిందే అంటున్నారు నెటిజన్లు.

చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం సాధించిన తర్వాత ఎమోషనల్ కామెంట్స్ చేశాడు లక్నో స్టార్ బ్యాటర్ మార్కస్ స్టోయినిస్. ఈ మాటలు వింటే హ్యాట్సాఫ్ అనాల్సిందే అంటున్నారు నెటిజన్లు.

Marcus Stoinis: చెన్నైపై విజయం తర్వాత స్టోయినిస్ మాటలకు హ్యాట్సాఫ్ అనాల్సిందే!

చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో సంచలన శతకంతో లక్నోకు తిరుగులేని విజయాన్ని అందించాడు ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్, లక్నో బ్యాటర్ మార్కస్ స్టోయినిస్. సీఎస్కే బౌలర్లకు దంచికొడుతూ 63 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్సులతో 124 పరుగులు చివరి వరకు క్రీజ్ లో నిలబడి జట్టును గెలిపించాడు. ఇక మ్యాచ్ అనంతరం స్టోయినిస్ కొన్ని భావోద్వేగపూరిత మాటలు మాట్లాడాడు. ఆ మాటలు వింటే హ్యాట్సాఫ్ అనాల్సిందే. ఇంతకీ అతడు ఏమన్నాడంటే?

చెన్నైతో జరిగిన మ్యాచ్ లో ఒంటిచేత్తో లక్నోకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు మార్కస్ స్టోయినిస్. గెలవదు అనుకున్న మ్యాచ్ ను ప్రత్యర్థి నుంచి లాగేసుకున్నాడు ఈ స్టార్ ప్లేయర్. ఇక ఈ ఇన్నింగ్స్ తో పలు రికార్డులు సైతం తన పేరిట లిఖించుకున్నాడు స్టోయినిస్. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్(124) సాధించిన తొలి ప్లేయర్ గా హిస్టరీ క్రియేట్ చేశాడు. తద్వారా 13 ఏళ్ల రికార్డును బ్రేక్ చేశాడు. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. మ్యాచ్ అనంతరం స్టోయినిస్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

Hats off to Stoinis!

స్టోయినిస్ మాట్లాడుతూ..”నాకు తెలుసు నేను ఆస్ట్రేలియా నేషనల్ సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ లో లేనని. కానీ సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే? నా ప్లేస్ లో వస్తున్న యంగ్ ప్లేయర్లు తమ సత్తా ఫ్రూవ్ చేసుకునేందుకు అవకాశం దక్కుతుంది. ప్రస్తుతం నేను నా ఆటను ఎంజాయ్ చేస్తున్నాను” అని చెప్పుకొచ్చాడు స్టోయినిస్. తనకు జట్టులో ప్లేస్ లేదని తెలిసినా.. తన తర్వాత వచ్చే యువ ప్లేయర్ల గురించి ఆలోచిస్తున్న అతడి గొప్ప మనసుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి మార్కస్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.