Somesekhar
ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో కేఎల్ రాహుల్(5) మరోసారి నిరాశపరిచాడు. రాహుల్ అవుట్ అయినప్పుడు లక్నో ఓనర్ ఇచ్చిన రియాక్షన్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో కేఎల్ రాహుల్(5) మరోసారి నిరాశపరిచాడు. రాహుల్ అవుట్ అయినప్పుడు లక్నో ఓనర్ ఇచ్చిన రియాక్షన్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Somesekhar
ఐపీఎల్ 2024లో భాగంగా కొద్ది రోజుల క్రితం సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ఓడిపోవడంతో.. లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా కెప్టెన్ కేఎల్ రాహుల్ ను గ్రౌండ్ లోనే తిట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. గోయెంకాపై విమర్శలు గుప్పించారు మాజీ ప్లేయర్లు, నెటిజన్లు. కాగా.. తాజాగా నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో 19 పరుగుల తేడాతో లక్నో పరాజయం పాలైంది. అయితే ఈ మ్యాచ్ లో కేఎల్ రాహుల్(5) మరోసారి నిరాశపరిచాడు. రాహుల్ అవుట్ అయినప్పుడు లక్నో ఓనర్ ఇచ్చిన రియాక్షన్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా-కెప్టెన్ కేఎల్ రాహుల్ మధ్య జరిగిన సంఘటన గురించి మనకు తెలియనిది కాదు. సన్ రైజర్స్ తో మ్యాచ్ ఓడిపోవడంతో.. గ్రౌండ్ లోనే రాహుల్ ను తిట్టాడు గోయెంకా. దీంతో అతడిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే ఏమనుకున్నాడో ఏమో గానీ.. ఆ తర్వాత రాహుల్ ను ఇంటికి డిన్నర్ కి పిలిచి బుజ్జగించినట్లున్నాడు గోయెంకా. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. తాజాగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో రాహుల్ 5 పరుగులకే పెవిలియన్ చేరి తన పూర్ ఫామ్ ను కొనసాగించాడు.
ఇషాంత్ బౌలింగ్ లో తొలి ఓవర్ లోనే ఔట్ అయ్యాడు. రాహుల్ ఔట్ కాగానే లక్నో ఓనర్ చిరునవ్వులు చిందించాడు. ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. దాంతో సొంత టీమ్ కెప్టెన్ అవుట్ అయితే నవ్వడం ఏంటి? అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. దాంతో రాహుల్ పై గోయెంకాకు ఇంకా కోపం తగ్గలేదని తెలుస్తోంది అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. అభిషేక్ పోరెల్(58), ట్రిస్టన్ స్టబ్స్(57*) సంచలన ఇన్నింగ్స్ లు ఆడారు. వారికి తోడు షై హోప్(38), కెప్టెన్ పంత్(33) రన్స్ తో రాణించారు. అనంతరం 209 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన లక్నో 20 ఓవర్లకు 9 వికెట్లకు 189 రన్స్ చేసి 19 పరుగుల తేడాతో ఓడిపోయింది. మరి రాహుల్ అవుట్ పై లక్నో ఓనర్ స్పందించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.