iDreamPost
android-app
ios-app

LSG vs PBKS.. లక్నో vs పంజాబ్.. గెలుపెవరిదంటే.. ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..!

  • Published Mar 29, 2024 | 6:55 PM Updated Updated Mar 29, 2024 | 6:55 PM

ఇంతవరకు గెలుపు రుచి చూడని ఒక జట్టుకు, బోణీ కొట్టాక పట్టా తప్పిన మరో టీమ్​కు మధ్య మ్యాచ్​కు అంతా రెడీ అయింది. ఆ టీమ్సే లక్నో, పంజాబ్. వీళ్ల మధ్య పోరులో ఎవరు గెలవనున్నారు? బలాబలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

ఇంతవరకు గెలుపు రుచి చూడని ఒక జట్టుకు, బోణీ కొట్టాక పట్టా తప్పిన మరో టీమ్​కు మధ్య మ్యాచ్​కు అంతా రెడీ అయింది. ఆ టీమ్సే లక్నో, పంజాబ్. వీళ్ల మధ్య పోరులో ఎవరు గెలవనున్నారు? బలాబలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 29, 2024 | 6:55 PMUpdated Mar 29, 2024 | 6:55 PM
LSG vs PBKS.. లక్నో vs పంజాబ్.. గెలుపెవరిదంటే.. ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..!

ఇంతవరకు గెలుపు రుచి చూడని ఒక జట్టుకు, బోణీ కొట్టాక పట్టా తప్పిన మరో టీమ్​కు మధ్య మ్యాచ్​కు అంతా రెడీ అయింది. ఆ రెండు జట్లే లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్. ఈ సీజన్​లో లక్నో ఇంకా ఒక్క విజయం కూడా సాధించలేదు. పంజాబ్ తొలి మ్యాచ్​లో నెగ్గినా, రెండో మ్యాచ్​లో చతికిలపడింది. మొదటి విజయాన్ని నమోదు చేయాలని లక్నో, తిరిగి సక్సెస్ బాట పట్టాలని పంజాబ్ పట్టుదలతో ఉన్నాయి. దీంతో ఈ రెండు జట్ల శనివారం జరగబోయే ఫైట్ ఆసక్తికరంగా మారింది. మరి.. వీళ్లలో ఎవరు గెలవనున్నారు? ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..

లక్నో సూపర్ జెయింట్స్

ఈ సీజన్​ ఫస్ట్ మ్యాచ్​లో రాజస్థాన్​ రాయల్స్​తో తలపడింది లక్నో. అయితే ఆ మ్యాచ్​లో 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కెప్టెన్ కేఎల్ రాహుల్, నికోలస్ పూరన్, దీపక్ హుడా రాణించినా టీమ్​ను విజయతీరాలకు చేర్చలేకపోయారు. దీంతో ఎలాగైనా బోణీ కొట్టాలని ఆ టీమ్ చూస్తోంది. కెప్టెన్ కేఎల్​తో పాటు పూరన్, హుడా, డికాక్, పడిక్కల్​తో కూడిన లక్నో బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్​గా ఉంది. అయితే తొలి మ్యాచ్​లో ఓపెనర్ డికాక్, సెకండ్ డౌన్​లో వచ్చిన పడిక్కల్ ఫెయిలయ్యారు. వీళ్లు టీమ్​కు బిగ్ మైనస్​గా తయారయ్యారు. బౌలింగ్​లో రవి బిష్ణోయ్, నవీనుల్ హక్, కృనాల్ పాండ్యా ఉన్నా ఎవరూ సత్తా మేరకు రాణించడం లేదు. నవీన్, మోసిన్, బిష్ణోయ్ భారీగా పరుగులు ఇచ్చుకోవడం ఇంకో మైనస్​గా చెప్పొచ్చు.

పంజాబ్ కింగ్స్

సామ్ కరన్, లియామ్ లివింగ్​స్టన్, అర్ష్​దీప్ రాణించడంతో ఫస్ట్ మ్యాచ్​లో నెగ్గింది పంజాబ్. అయితే సెకండ్ మ్యాచ్​లో బ్యాటింగ్ ఫెయిల్యూర్, సేమ్ టైమ్ ఆర్సీబీ బ్యాటర్ దినేష్ కార్తీక్ విధ్వంసక ఇన్నింగ్స్ వల్ల ఓటమి మూటగట్టుకుంది పంజాబ్. బ్యాటింగ్​లో ధావన్ తప్ప ఎవరూ కన్​సిస్టెంట్​గా రన్స్ చేయడం లేదు. బౌలింగ్​లో కూడా రబాడ, హర్​ప్రీత్ బ్రార్ తప్ప మిగిలిన వాళ్లు తేలిపోతున్నారు. అర్ష్​దీప్, హర్షల్ పటేల్ భారీగా పరుగులు ఇచ్చుకోవడం టీమ్​కు మైనస్​గా మారిది.

ప్రిడిక్షన్

ఈ రెండు జట్లు ఇప్పటివరకు 3 మ్యాచుల్లో తలపడ్డాయి. అందులో లక్నో రెండింట్లో నెగ్గగా.. పంజాబ్​ను ఒకసారి విజయం వరించింది. అయితే రేపు జరగబోయే మ్యాచ్​లో లక్నో నెగ్గడం ఖాయం. ఆ టీమ్ బ్యాటింగ్​లో బలంగా ఉండటం, హోమ్ కండీషన్స్​లో ఆడుతుండటంతో రాహుల్ సేనను ఆపడం పంజాబ్​కు కష్టమే.

ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా)

లక్నో:
క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), ప్రేరక్ మన్కడ్, ఆయుష్ బదోనీ, దీపక్ హుడా, నికోలస్ పూరన్, మార్కస్ స్టొయినిస్, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, మోసిన్ ఖాన్, యష్ ఠాకూర్.

పంజాబ్:
శిఖర్ ధావన్, జానీ బెయిర్​స్టో, ప్రభుసిమ్రన్ సింగ్, లియామ్ లివింగ్​స్టన్, సామ్ కర్రన్, జితేష్ శర్మ, శశాంక్ సింగ్, హర్​ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, రాహుల్ చాహర్.