iDreamPost
android-app
ios-app

KKR vs PBKS: వీడియో: నిన్న మ్యాచ్​లో కొడుకుతో షారుఖ్ చేసిన పని వైరల్! ఎవ్వరూ గమనించలేదు!

  • Published Apr 27, 2024 | 5:34 PM Updated Updated Apr 27, 2024 | 5:37 PM

కేకేఆర్-పంజాబ్ మ్యాచ్​కు కింగ్ ఖాన్ షారుఖ్ కూడా అటెండ్ అయ్యారు. అయితే మ్యాచ్ టైమ్​లో ఆయన తన కొడుకుతో చేసిన పని ఇప్పుడు వైరల్ అవుతోంది.

కేకేఆర్-పంజాబ్ మ్యాచ్​కు కింగ్ ఖాన్ షారుఖ్ కూడా అటెండ్ అయ్యారు. అయితే మ్యాచ్ టైమ్​లో ఆయన తన కొడుకుతో చేసిన పని ఇప్పుడు వైరల్ అవుతోంది.

  • Published Apr 27, 2024 | 5:34 PMUpdated Apr 27, 2024 | 5:37 PM
KKR vs PBKS: వీడియో: నిన్న మ్యాచ్​లో కొడుకుతో షారుఖ్ చేసిన పని వైరల్! ఎవ్వరూ గమనించలేదు!

ఐపీఎల్-2024 ఎన్నో సంచలనాలకు వేదికగా మారింది. నీళ్లు తాగినంత అలవోకగా ఈ సీజన్​లో టీమ్స్ భారీ స్కోర్లు బాదేస్తున్నాయి. రెండు వారాల గ్యాప్​లో 200 ప్లస్ స్కోర్లు పదిహేను సార్లు నమోదయ్యాయి. ఈ సీజన్​లో 250 ప్లస్ స్కోర్లు ఏడుసార్లు నమోదవడం గమనార్హం. ఇంత స్కోరు కొట్టడమే ఒకెత్తు అనుకుంటే దాన్ని ఈజీగా ఛేజ్ చేయడం మరొకెత్తు. నిన్న కోల్​కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్​లో ఇదే జరిగింది. ఈ రెండు టీమ్స్ తుదివరకు నువ్వానేనా? అంటూ తలపడ్డాయి. అయితే ఎట్టకేలకు విజయం పంజాబ్​నే వరించింది. కేకేఆర్ సంధించిన 261 పరుగుల టార్గెట్​ను పంజాబ్ ఇంకో 8 బంతులు ఉండగానే ఛేదించింది. అయితే ఈ మ్యాచ్​ టైమ్​లో కింగ్ ఖాన్ షారుఖ్ తన కొడుకుతో చేసిన పని ఇప్పుడు వైరల్ అవుతోంది.

కేకేఆర్ ఓనర్, బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఐపీఎల్ మ్యాచులకు తరచూ అటెండ్ అవుతుంటారు. ముఖ్యంగా తన టీమ్ హోమ్ మ్యాచ్​లను చూసేందుకు ఆయన పక్కా కోల్​కతా వస్తుంటారు. ఇదే క్రమంలో నిన్న ఈడెన్ గార్డెన్స్​కు వచ్చి తెగ సందడి చేశారు. అయితే ఈసారి తన చిన్న కొడుకు అబ్​రామ్​ను కూడా వెంట పెట్టుకొని వచ్చారు కింగ్ ఖాన్. మ్యాచ్ సమయంలో అబ్​రామ్ ఫుల్ ఎగ్జయిటెటడ్​గా కనిపించాడు. ముఖ్యంగా కేకేఆర్ బ్యాటింగ్ టైమ్​లో అతడు గట్టిగా అరుస్తూ టీమ్​ను ఎంకరేజ్ చేశాడు. చేతిలో విజిల్​తో హల్​చల్ చేశాడు. కోల్​కతా బ్యాటర్లు బౌండరీలు, సిక్సులు కొట్టిన ప్రతిసారి అబ్​రామ్ విజిల్ ఊదుతూ వాళ్లను మరింత ఉత్సాహపరిచాడు.

కేకేఆర్ బ్యాటర్లు విజృంభిస్తున్న కొద్దీ అబ్​రామ్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. తమ టీమ్ ఆటగాళ్లు బాగా ఆడుతుండటంతో అతడు ఎగిరి గంతేశాడు. పదే పదే విజిల్ గట్టిగా ఊదుతూ సంతోషంతో ఊగిపోయాడు. అయితే పక్కనే ఉన్న షారుఖ్ అతడ్ని కంట్రోల్ చేశాడు. ఇక చాలు.. అంటూ విజిల్స్ వేయొద్దని వారించాడు. సైలెంట్​గా ఉండమని ఆదేశించాడు. షారుఖ్ తన కొడుకును కంట్రోల్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. నిన్నటి మ్యాచ్​లో మిస్సయిన ఈ వీడియోను ఎవరో రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్.. ఎంత స్టార్ అయినా ఆయన కూడా ఓ తండ్రేనని, కుమారుడికి మంచి చెడు నేర్పించడం ఆయన బాధ్యత అని.. దాన్ని సక్రమంగా నెరవేరుస్తున్నారంటూ మెచ్చుకుంటున్నారు.

jojobet girişmarsbahiscasibomjojobet girişcasibomJojobet Giriş