Somesekhar
రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ గొప్ప బ్యాటర్లే అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే కాస్త అది తగ్గించుకుని ఆడితే.. మంచిదని వారికి సూచించాడు టీమిండియా మాజీ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్.
రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ గొప్ప బ్యాటర్లే అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే కాస్త అది తగ్గించుకుని ఆడితే.. మంచిదని వారికి సూచించాడు టీమిండియా మాజీ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్.
Somesekhar
కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 18 రన్స్ తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో ముంబై బ్యాటర్లు చేసిన ఘోర తప్పిదాలే వారిని ఓడించాయని టీమిండియా మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. మరీ ముఖ్యంగా రోహిత్ శర్మ, కెప్టెన్ హార్దిక్ పాండ్యా అవుట్ అయిన తీరును తప్పుబట్టాడు. రోహిత్ గొప్ప బ్యాటరే అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ అహంకారంతో మాత్రం బ్యాటింగ్ చేయకూడదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇంకా వీరూ భాయ్ ఏమన్నాడంటే?
ఐపీఎల్ లో భాగంగా నిన్న జరిగిన కేకేఆర్-ఎంఐ మ్యాచ్ ను విశ్లేషిస్తూ.. టీమిండియా మాజీ డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. మరీ ముఖ్యంగా రోహిత్ శర్మ్, హార్దిక్ పాండ్యా అవుటైన తీరును తప్పుబట్టాడు. “బౌలర్ ను మీరు గౌరవించకపోయినా, కనీసం వారు వేసే బంతుల్ని అయినా గౌరవించాలి. లేకపోతే ఇలాగే ఔట్ అవుతారు. చెత్త బంతుల్ని మాత్రమే శిక్షించాలి. అలా కాదని అహంకారంతో బ్యాటింగ్ చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. రోహిత్, సూర్యలు వరల్డ్ క్లాస్ ప్లేయర్లు. అలా అని మేమే తోపులం అన్న విధంగా బ్యాటింగ్ చేస్తే.. ఇలాగే మ్యాచ్ లు ఓడిపోవాల్సి వస్తుంది” అంటూ వీరూ భాయ్ చెప్పుకొచ్చాడు.
రోహిత్, సూర్య క్రీజ్ లో కుదురుకుని ఉంటే.. ఈ మ్యాచ్ ఈజీగా గెలిచేదన్నాడు సెహ్వాగ్. చివర్లో వచ్చిన నమన్ ధీర్ రెండు సిక్సులు, ఓ ఫోర్ బాదాడు. ఇదే టైమ్ లో వారుంటే.. మిగిలిన ఐదు బాల్స్ ను బౌండరీలకు తరలించేవారని వీరూ పేర్కొన్నాడు. ఎంత గొప్ప ప్లేయర్లు అయినప్పటికీ.. మంచి బంతుల్ని గౌరవించాలి, ఈగోతో బ్యాటింగ్ చేయకూడదు. రోహిత్, సూర్యలు అయితే స్పెషలా? అహంకారం తగ్గించుకుని బ్యాటింగ్ చేస్తేనే బాగుంటుందని వారికి సూచించాడు. ఇక ఈ మ్యాచ్ లో చక్రవర్తి బౌలింగ్ లో రోహిత్, రస్సెల్ బౌలింగ్ లో సూర్యకుమార్ పెవిలియన్ చేరారు. మరి సెహ్వాగ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.