iDreamPost
android-app
ios-app

Rohit Sharma: వీడియో:  KKR డ్రెస్సింగ్ రూమ్ లో రోహిత్.. గంభీర్ అనుకున్నది సాధించాడు!

  • Published May 12, 2024 | 11:11 AM Updated Updated May 12, 2024 | 11:11 AM

ముంబై-కేకేఆర్ మధ్య తాజాగా జరిగిన మ్యాచ్ లో ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. బహుశా దీన్ని ఎవ్వరూ ఊహించి ఉండరు. రోహిత్ శర్మ కేకేఆర్ డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ముంబై-కేకేఆర్ మధ్య తాజాగా జరిగిన మ్యాచ్ లో ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. బహుశా దీన్ని ఎవ్వరూ ఊహించి ఉండరు. రోహిత్ శర్మ కేకేఆర్ డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Rohit Sharma: వీడియో:  KKR డ్రెస్సింగ్ రూమ్ లో రోహిత్.. గంభీర్ అనుకున్నది సాధించాడు!

రోహిత్ శర్మ.. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా ఐదు సార్లు ఐపీఎల్ టైటిళ్లు అందించాడు. అయినప్పటికీ నిర్దాక్షిణ్యంగా కెప్టెన్ పదవి నుంచి తీసేసి ఆ పగ్గాలను హార్దిక్ పాండ్యాకు అప్పగించింది ముంబై యాజమాన్యం. దాంతో రోహిత్ ఫ్యాన్స్ ముంబైపై పాండ్యాపై కోపంగా ఉన్న విషయం తెలియనిది కాదు. ఎప్పుడైతే తనను కెప్టెన్ గా తీసేశారో.. అప్పటి నుంచి రోహిత్ టీమ్ వ్యవహారాల్లో చురుగ్గా కనిపించడం లేదు. తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. ఈ నేపథ్యంలో నెక్ట్స్ ఐపీఎల్ సీజన్ కు ముంబైని వీడుతున్నాడని, కేకేఆర్ టీమ్ లోకి వస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ..కేకేఆర్ డ్రెస్సింగ్ రూమ్ లో కనిపించాడు హిట్ మ్యాన్. ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఐపీఎల్ 2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్ వర్సెస్ ముంబై మధ్య మ్యాచ్ జరిగింది. వర్షం కారణంగా 16 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో కేకేఆర్ 18 రన్స్ తో విజయం సాధించింది. అయితే మ్యాచ్ ప్రారంభానికంటే ముందే వర్షం రావడంతో.. ప్లేయర్లు సరదాగా గడిపారు. ఈ సమయంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై డ్రెస్సింగ్ రూమ్ లో ఉండకుండా.. కేకేఆర్ డ్రెస్సింగ్ రూమ్ లో దర్శనమిచ్చాడు. సాధారణంగా గ్రౌండ్ లో ఇతర టీమ్ ఆటగాళ్లలో ముచ్చటించడం వేరు.. ఇలా డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి మరీ మాట్లాడటం వేరు. రోహిత్ కేకేఆర్ టీమ్ తో ఇలా కనిపించడంతో.. అందరూ అనుకుంటున్న మాట నిజమేనా? అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.

కాగా.. ముంబై కెప్టెన్సీ నుంచి తనను తొలగించడంతో.. వచ్చే ఐపీఎల్ సీజన్ కు ముంబైని వీడి, వేరే ఫ్రాంచైజీలోకి రోహిత్ వస్తాడని జోరుగా ప్రచారం సాగుతుంది. అదీకాక కేకేఆర్ మెంటర్ గౌతమ్ గంభీర్ కు రోహిత్ కు మంచి బాండింగ్ కూడా ఉంది. కోహ్లీ, ధోని అంటే పడని గంభీర్ కు రోహిత్ అంటే ఎంతో ప్రేమ. అందుకే ఇతరులతో కోపంగా ఉన్నాగానీ.. హిట్ మ్యాన్ తో నవ్వుతూ మాట్లాడేవాడు. దాంతో గంభీర్ ప్లాన్ ప్రకారమే రోహిత్ ఇలా వచ్చి కూర్చున్నాడా? మెుత్తానికి గంభీర్ అనుకున్నది సాధించాడు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి నిజంగానే రోహిత్ నెక్ట్స్ సీజన్ లో కేకేఆర్ టీమ్ లోకి వెళ్తాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by وقار خان (@waquar_khan.5455)

Jojobet Girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet