iDreamPost

Shamar Joseph: డెబ్యూ మ్యాచ్ లోనే గబ్బా హీరో చెత్త రికార్డు.. ఒక్క బంతికి ఎన్ని రన్స్ ఇచ్చాడో తెలుసా?

తన డెబ్యూ మ్యాచ్ లోనే ఐపీఎల్ చరిత్రలో వరస్ట్ రికార్డును నెలకొల్పాడు విండీస్ నయా సంచలనం, లక్నో ఫాస్ట్ బౌలర్ షమర్ జోసెఫ్. మరి ఇంతకీ ఆ చెత్త రికార్డు ఏంటంటే?

తన డెబ్యూ మ్యాచ్ లోనే ఐపీఎల్ చరిత్రలో వరస్ట్ రికార్డును నెలకొల్పాడు విండీస్ నయా సంచలనం, లక్నో ఫాస్ట్ బౌలర్ షమర్ జోసెఫ్. మరి ఇంతకీ ఆ చెత్త రికార్డు ఏంటంటే?

Shamar Joseph: డెబ్యూ మ్యాచ్ లోనే గబ్బా హీరో చెత్త రికార్డు.. ఒక్క బంతికి ఎన్ని రన్స్ ఇచ్చాడో తెలుసా?

షమర్ జోసెఫ్.. వెస్టిండీస్ నయా సంచలనంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరిగిన టెస్ట్ లో 7 వికెట్ల సంచలన ప్రదర్శనతో విండీస్ కు 27 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై తొలి విజయాన్ని అందించాడు. ఈ ప్రదర్శనతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చాడు షమర్. దీంతో ఐపీఎల్ ప్రాంఛైజీలు ఇతడిపై ఓ కన్నేశాయి. చివరికి మినీ వేలంలో రూ. 3 కోట్లకు లక్నో ఇతడిని దక్కించుకుంది. ఇక నిన్న(ఆదివారం, ఏప్రిల్ 14) కోల్ కత్త నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ ద్వారా ఐపీఎల్ అరంగేట్రం చేశాడు జోసెఫ్. అయితే తన తొలి మ్యాచ్ లోనే చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు గబ్బా హీరో.

విండీస్ ఫాస్ట్ బౌలర్ షమర్ జోసెఫ్ తన ఐపీఎల్ కెరీర్ ను పేవలంగా ప్రారంభించాడు. ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ ద్వారా ఐపీఎల్ డెబ్యూచేశాడు ఈ సంచలన బౌలర్. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన షమర్.. తొలి మ్యాచ్ లోనే అత్యంత చెత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో కేకేఆర్ బ్యాటర్లు ఇతడి బౌలింగ్ ను చీల్చిచెండాడారు. తన 4 ఓవర్ల కోటాలో ఏకంగా 47 పరుగులు సమర్పించుకుని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. కాగా.. వేసిన తొలి ఓవర్ లోనే ఏకంగా 22 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే ఈ ఓవర్ లో ఏకంగా 10 బంతులు వేశాడు ఈ విండీస్ పేసర్.

అయితే తొలి ఐదు బంతుల్లో 7 పరుగులు ఇచ్చి మంచి టచ్ లోనే ఉన్నాడనుకునే లోపలే.. ఆఖరి బంతికి నోబాల్ వేశాడు. ఇక ఇక్కడి నుంచి ఒత్తిడికి లోనైన జోసెఫ్ ఆ తర్వాత వరుసగా రెండు వైడ్లు వేశాడు. అందులో ఒకటి బౌండరీ వెళ్లింది. ఆ తర్వాత మళ్లీ నో బాల్ వేశాడు. ఆఖరికి ఫ్రీహిట్ బంతిని సాల్ట్ సిక్సుగా బాదాడు. దీంతో చివరి బంతికి ఏకంగా 14 పరుగులు ఇచ్చుకోవడమే కాకుండా.. ఈ ఓవర్లో 10 బంతులు వేశాడు. ఈ క్రమంలోనే తన పేరిట ఓ చెత్త రికార్డును తొలి మ్యాచ్ తోనే లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో తొలి ఓవర్ లో అత్యధిక పరుగులు ఇచ్చుకున్న 6వ బౌలర్ గా ఈ విండీస్ పేసర్ నిలిచాడు. దీంతో పాటుగా ఒక్క బంతికి 14 ఇచ్చి మరో చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. మరి తొలి మ్యాచ్ తోనే గబ్బా హీరో ఇలాంటి చెత్త రికార్డును నెలకొల్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి