iDreamPost
android-app
ios-app

Jos Buttler: బట్లర్ ఊహించని సెంచరీ.. గేల్ రికార్డు బ్రేక్! నెక్ట్స్ కోహ్లీదే!

  • Published Apr 17, 2024 | 7:53 AM Updated Updated Apr 17, 2024 | 7:53 AM

కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్తాన్ స్టార్ ప్లేయర్ జోస్ బట్లర్ ఎవ్వరూ ఊహించని సెంచరీ చేశాడు. ఒంటి చేత్తో జట్టుకు విజయాన్ని అందించడమే కాకుండా.. క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టాడు. ఆ వివరాల్లోకి వెళితే..

కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్తాన్ స్టార్ ప్లేయర్ జోస్ బట్లర్ ఎవ్వరూ ఊహించని సెంచరీ చేశాడు. ఒంటి చేత్తో జట్టుకు విజయాన్ని అందించడమే కాకుండా.. క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టాడు. ఆ వివరాల్లోకి వెళితే..

Jos Buttler: బట్లర్ ఊహించని సెంచరీ.. గేల్ రికార్డు బ్రేక్! నెక్ట్స్ కోహ్లీదే!

రాజస్తాన్ ముందు 224 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది కోల్ కత్తా. అయితే 14 ఓవర్ల తర్వాత రాజస్తాన్ 128/6 స్కోర్ తో ఉంది. విజయానికి చివరి ఆరు ఓవర్లలో 96 రన్స్ కావాలి. చేతిలో 4 వికెట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో అందరూ రాజస్తాన్ ఓటమి ఖాయమని అనుకున్నారు. కానీ అప్పుడప్పుడు మన అంచనాలు తప్పు అని నిరూపించడానికి ఒకడు ఉంటాడు. అలా ఆర్ఆర్ టీమ్ లో ఒకడున్నాడు. అతడి పేరే జోస్ బట్లర్. అసాధారణ బ్యాటింగ్ తో ఓడిపోయింది అనుకున్న మ్యాచ్ ను గెలిపించిన తీరు అద్వితీయం, అమోఘం. చివరి బాల్ వరకు క్రీజ్ లో ఉండి అఖండ శతకంతో జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు బట్లర్. ఈ క్రమంలోనే విండీస్ వీరుడు క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టాడు.

జోస్ బట్లర్.. ఈ ఐపీఎల్ సీజన్ లో రెండో సెంచరీని నమోదు చేసి రికార్డు సృష్టించాడు. మెున్న ఆర్సీబీపై శతకంతో చెలరేగిన ఇతడు.. తాజాగా కేకేఆర్ బౌలర్లను చీల్చిచెండాడుతూ.. మరో రికార్డు సెంచరీని తన పేరిట లిఖించుకున్నాడు. 55 బంతుల్లో వంద మార్క్ ను చేరుకున్న బట్లర్ ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో 60 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, 6 సిక్సులతో 107 రన్స్ చేసి అజేయంగా నిలిచి టీమ్ ను ఒంటిచేత్తో గెలిపించాడు. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన కోల్ కత్తా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 223 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్ సునీల్ నరైన్ 56 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్సులతో 109 పరుగులు చేశాడు. కానీ బట్లర్ వీరోచిత శతకం ముందు నరైన్ సెంచరీ వృథా అయ్యింది.

Butler

224 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ ఒక దశలో 14 ఓవర్లు ముగిసే సరికి 128/6 స్కోర్ తో ఉంది. దీంతో చివరి 6 ఓవర్లకు 96 రన్స్ కావాలి. అప్పటికి బట్లర్ 42 రన్స్ తో క్రీజ్ లో ఉన్నాడు. అయితే అందరూ రాజస్తాన్ గెలవడం అసాధ్యం అనుకున్నారు. కానీ తన అసాధారణ బ్యాటింగ్ తో అసాధ్యం అనుకున్నదాన్ని సుసాధ్యం చేసి చూపాడు బట్లర్. 36 బంతుల్లో తొలి ఫిఫ్టీని పూర్తి చేసుకున్న అతడు.. ఆ తర్వాత ఫిఫ్టీని కేవలం 21 బంతుల్లోనే దంచికొట్టాడు. అర్ధశతకం తర్వాత మరింత రెచ్చిపోయిన బట్లర్ కేకేఆర్ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. బట్లర్ బాదుడుకు చివరి బాల్ కు విజయం సాధించి.. అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.

ఇదిలా ఉండగా.. ఈ సెంచరీతో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టాడు బట్లర్. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ప్లేయర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు. క్రిస్ గేల్ ఐపీఎల్ లో 6 సెంచరీలు సాధించాడు. ఈ శతకంతో దాన్ని బ్రేక్ చేశాడు బట్లర్. అదీకాక ఈ సీజన్ లో ఇది బట్లర్ కు రెండో సెంచరీ కావడం విశేషం. సెంచరీల జాబితాలో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ 8 శతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బట్లర్ తన ఫామ్ ను ఇలాగే కొనసాగిస్తే.. నెక్ట్స్ విరాట్ కోహ్లీ రికార్డ్ కూడా బ్రేక్ అవ్వడం ఖాయమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. బట్లర్ రికార్డ్ సెంచరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.