Nidhan
ఐపీఎల్ నయా సీజన్ మొదలయ్యేందుకు మరికొన్ని వారాల సమయమే మిగిలి ఉంది. దీంతో ఈ లీగ్ కోసం చాలా మంది ఆటగాళ్లు ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసేశారు. అయితే ఇంగ్లండ్ స్టార్ సీమర్ జోఫ్రా ఆర్చర్ ఈసారి క్యాష్ రిచ్ లీగ్‌కు దూరమయ్యాడు. దీనికి అసలైన కారణం ఏంటో ఇప్పడు బయటపడింది.
ఐపీఎల్ నయా సీజన్ మొదలయ్యేందుకు మరికొన్ని వారాల సమయమే మిగిలి ఉంది. దీంతో ఈ లీగ్ కోసం చాలా మంది ఆటగాళ్లు ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసేశారు. అయితే ఇంగ్లండ్ స్టార్ సీమర్ జోఫ్రా ఆర్చర్ ఈసారి క్యాష్ రిచ్ లీగ్‌కు దూరమయ్యాడు. దీనికి అసలైన కారణం ఏంటో ఇప్పడు బయటపడింది.
Nidhan
ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొత్త సీజన్ స్టార్ట్ అయ్యేందుకు మరికొన్ని వారాల టైమ్ మాత్రమే ఉంది. మార్చి మూడో వారంలో క్యాష్ రిచ్ లీగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో మెగా లీగ్‌లో ఆడే క్రికెటర్లు తమ ప్రిపరేషన్స్‌ను స్టార్ట్ చేస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని మళ్లీ బ్యాట్ పట్టి గ్రౌండ్లో జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. గాయాల నుంచి కోలుకున్న రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ కూడా సన్నాహకాలు మొదలుపెట్టారు. ఐపీఎల్ ప్రారంభమయ్యే సమయానికల్లా సిద్ధంగా ఉండాలని అనుకుంటున్నారు. అయితే ఒక స్టార్ ప్లేయర్ మాత్రం ఫిట్‌గా ఉన్నా ఐపీఎల్ పదిహేడో సీజన్లో మాత్రం ఆడటం లేదు. ఇటీవల జరిగిన మినీ వేలంలోనూ పాల్గొనలేదు. ఆ క్రికెటర్ మరెవరో కాదు.. జోఫ్రా ఆర్చర్. ఈ ఇంగ్లండ్ స్టార్ పేసర్ ఈసారి క్యాష్ రిచ్ లీగ్‌లో ఆడటం లేదు. అయితే దీనికి కారణం ఏంటనేది ఇప్పుడు బయటపడింది.
ఆర్చర్‌ను కావాలనే ఐపీఎల్లో ఆడించడం లేదని ఇంగ్లండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాబర్ట్ కీ తెలిపాడు. ఆర్చర్ ఆడతానని చెప్పినా తామే అతడ్ని దూరంగా ఉంచుతున్నామని అన్నాడు. ఈ ఏడాది జూన్‌లో టీ20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో మెగా టోర్నీపై మరింత ఫోకస్ పెట్టే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు. ‘ఐపీఎల్లో ఆడాలని అనుకుంటున్నానని ఆర్చర్ అన్నాడు. కానీ ఈ సీజన్‌కు ఆడొద్దని మేం చెప్పాం. అతడు మళ్లీ ఆడి గాయపడటం మాకు ఇష్టం లేదు. అతడు ఇప్పటికే చాలా క్రికెట్ మిస్సయ్యాడు. ఇప్పుడు అతడ్ని కాపాడుకుంటే కెరీర్‌ను పొడిగించుకోగలడు. అతడో రేర్ టాలెంట్. ఆర్చర్‌ను టీ20 వరల్డ్ కప్‌లో ఆడించడమే మా ప్లాన్. అందుకోసం మెళ్లిగా అతడ్ని సిద్ధం చేస్తున్నాం’ అని రాబర్ట్ కీ చెప్పుకొచ్చాడు. ఆర్చర్ బౌలింగ్ తాను చూశానని.. మంచి రిథమ్‌లో ఉన్నాడని పేర్కొన్నాడు.
కాగా, ఐపీఎల్-2022 సీజన్‌కు ముందు జరిగిన మెగా ఆక్షన్‌లో ముంబై ఇండియన్స్ ఆర్చర్‌ను సొంతం చేసుకుంది. ఇంజ్యురీతో బాధపడుతున్న అతడు ఆడే అవకాశం లేదని తెలిసినా రూ.8 కోట్లు పెట్టి మరీ దక్కించుకుంది. జస్ప్రీత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్ కలసి ఆడితే తమకు ఎదురు ఉండదని భావించింది. అయితే ఎంఐ ప్లాన్స్ తలకిందులయ్యాయి. ఐపీఎల్-2023కు అందుబాటులో ఉన్నా గాయాల కారణంగా చాలా మ్యాచులకు దూరమయ్యాడు. కేవలం ఐదు మ్యాచులు ఆడిన ఆర్చర్.. 2 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. రన్స్ కూడా ధారాళంగా ఇచ్చుకున్నాడు. దీంతో ఐపీఎల్-2024 మినీ ఆక్షన్‌కు ముందు అతడ్ని ముంబై రిలీజ్ చేసింది. అయితే 28 ఏళ్ల ఆర్చర్.. ఈసారి వేలంలో పాల్గొనాలని భావించాడు. కానీ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వద్దనడంతో ఆగిపోయాడు. ఈ విషయం మీదే ఈసీబీ ఎండీ రాబర్ట్ కీ తాజాగా క్లారిటీ ఇచ్చాడు. టీ20 ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకొనే అతడ్ని దూరం పెట్టామని చెప్పాడు. మరి.. ఐపీఎల్లో ఆర్చర్ ఆడాలనుకున్నా ఈసీబీ అడ్డుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: వీడియో: భారీ సిక్స్.. ఊహించని ఘటనతో వణికిపోయిన బాబర్ అజమ్!
🚨 England managing director Robert Key, shares that they’re being careful with Jofra Archer, putting more focus on the T20 World Cup instead of the IPL. pic.twitter.com/aIROFwpCeQ
— CricketGully (@thecricketgully) January 17, 2024