iDreamPost
android-app
ios-app

కోట్లు తీసుకునే స్టార్స్ కంటే వీళ్లే తోపు.. సింగిల్ హ్యాండ్​తో గెలిపిస్తున్న అన్​క్యాప్డ్ స్టార్స్!

  • Published Apr 05, 2024 | 1:42 PM Updated Updated Apr 05, 2024 | 1:42 PM

ఈసారి ఐపీఎల్​లో స్టార్ ప్లేయర్స్ కంటే కొందరు అన్​క్యాప్డ్ ఆటగాళ్లు ఎక్కువ హైలైట్ అవుతున్నారు. దీనికి కారణం వాళ్ల గేమ్ అనే చెప్పాలి. కోట్లు తీసుకునే స్టార్ల కంటే వీళ్ల ఆటతీరే తోపు లెవల్​లో ఉంది. ఎవరా ప్లేయర్లు అనేది ఇప్పుడు చూద్దాం..

ఈసారి ఐపీఎల్​లో స్టార్ ప్లేయర్స్ కంటే కొందరు అన్​క్యాప్డ్ ఆటగాళ్లు ఎక్కువ హైలైట్ అవుతున్నారు. దీనికి కారణం వాళ్ల గేమ్ అనే చెప్పాలి. కోట్లు తీసుకునే స్టార్ల కంటే వీళ్ల ఆటతీరే తోపు లెవల్​లో ఉంది. ఎవరా ప్లేయర్లు అనేది ఇప్పుడు చూద్దాం..

  • Published Apr 05, 2024 | 1:42 PMUpdated Apr 05, 2024 | 1:42 PM
కోట్లు తీసుకునే స్టార్స్ కంటే వీళ్లే తోపు.. సింగిల్ హ్యాండ్​తో గెలిపిస్తున్న అన్​క్యాప్డ్ స్టార్స్!

ఫ్రాంచైజీ క్రికెట్​లో స్టార్ ప్లేయర్లకు ఉండే డిమాండ్ గురించి సెపరేట్​గా చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ల కోసం టీమ్స్ ఎగబడతాయి. ఆక్షన్​లో కోట్లకు కోట్లు పోసి మరీ కొనుక్కుంటాయి. అభిమానులు కూడా ఇలాంటి ఆటగాళ్ల మీద బోలెడు ఎక్స్​పెక్టేషన్స్ పెట్టుకుంటారు. జట్టుకు కప్పు అందిస్తారని ఆశిస్తారు. అయితే డొమెస్టిక్ ప్లేయర్లను మాత్రం పెద్దగా ఎవరూ పట్టించుకోరు. వాళ్లు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇస్తే తప్ప ఫోకస్​లోకి రారు. అదే టైమ్​లో అన్​క్యాప్డ్ ఆటగాళ్లకు వచ్చే ఛాన్సులూ తక్కువే. అందుకే వారి మీద ఎవరికీ పెద్దగా అంచనాలు ఉండవు. అయితే అలాంటి ఆటగాళ్లే ఈసారి ఐపీఎల్​లో అదరగొడుతున్నారు. కోట్లు తీసుకునే స్టార్స్ కంటే వీళ్లే తోపులుగా మారారు. టీమ్స్​ను సింగిల్ హ్యాండ్​తో గెలిపిస్తున్న ఆ టాప్-5 డొమెస్టిక్ స్టార్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం..

రియాన్ పరాగ్

ఒకప్పుడు చెత్త ఆటతీరుతో ఓవరాక్షన్ స్టార్​గా పేరు తెచ్చుకున్నాడు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ రియాన్ పరాగ్. క్యాచ్ పట్టినా, సిక్స్ కొట్టినా గ్రౌండ్​లో డ్యాన్సులు వేస్తూ.. బిల్డప్ ఎక్కువ, బిజెనస్ తక్కువంటూ ట్రోలింగ్​కు గురయ్యాడు. అయితే తన బ్యాటింగ్​ మీద ఫోకస్ పెట్టిన రియాన్.. గత ఏడాది కాలంలో ఎంతో పరిణతి సాధించాడు. ఈ సీజన్​లో బ్యాట్​తో చెలరేగుతూ రాజస్థాన్ విజయాల్లో కీలకంగా మారాడు. ఆడిన మూడు మ్యాచుల్లో 2 ఫిఫ్టీలు బాదిన పరాగ్.. ఓవరాల్​గా 181 రన్స్​తో లీడింగ్ రన్ స్కోరర్ లిస్ట్​లో సెకండ్ ప్లేస్​లో నిలిచాడు.

సాయి సుదర్శన్

తమిళనాడు ప్రీమియర్ లీగ్ ద్వారా వెలుగులోకి వచ్చిన సాయి సుదర్శన్​.. ఈసారి గుజరాత్ టైటాన్స్​కు అతిపెద్ద బలంగా మారాడు. ఇతడ్ని వేలంలో రూ.20 లక్షల బేస్​ ప్రైజ్​కే దక్కించుకుంది జీటీ. ఈ సీజన్​లో బ్యాట్​తో రఫ్ఫాడిస్తున్న ఈ లెఫ్టాండర్ ఆడిన 4 మ్యాచుల్లో 160 పరుగులు చేశాడు. మిడిల్ ఓవర్లలో ఒకవైపు వికెట్ కాపాడుకుంటూనే వేగంగా పరుగులు చేస్తూ టీమ్ భారీ స్కోర్ చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు సాయి. ఈ సీజన్​లో లీడింగ్ రన్ స్కోరర్స్ జాబితాలో 5వ స్థానంలో ఉన్నాడతను.

మయాంక్ యాదవ్

ఒకే ఒక్క మ్యాచ్​తో ఓవర్​నైట్ స్టార్ అయిపోయాడు లక్నో ఎక్స్​ప్రెస్ మయాంక్ యాదవ్. ఇతడ్ని వేలంలో రూ.20 లక్షల బేస్​ ప్రైజ్​కే దక్కించుకుంది లక్నో. నిలకడగా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో అతడు వేస్తున్న బంతుల్ని ఎదుర్కొనేందుకు టాప్ బ్యాటర్స్ కూడా వణుకుతున్నారు. వరుసగా రెండు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్​లు అందుకున్నాడు మయాంక్. ఎల్​ఎస్​జీకి తురుపుముక్కగా మారిన ఈ పేసర్​.. 6 వికెట్లతో పర్పుల్ క్యాప్ లిస్ట్​లో 3వ ప్లేస్​లో ఉన్నాడు.

హర్షిత్ రాణా

కోల్​కతా నైట్ రైడర్స్​ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు హర్షిత్ రాణా. ఇతడ్ని వేలంలో రూ.20 లక్షల బేస్​ ప్రైజ్​కే దక్కించుకుంది కేకేఆర్. స్లో బౌన్సర్స్, కట్టర్స్, యార్కర్స్​తో బ్యాటర్లను ఎక్కడికక్కడ కట్టిపడేస్తున్నాడు రాణా. ఆడిన మూడు మ్యాచుల్లో 5 వికెట్లు తీశాడు. టీమ్​కు ఎప్పుడు బ్రేక్ త్రూ కావాలన్నా తాను ఉన్నానంటూ ముందుకొస్తున్నాడీ యంగ్​స్టర్.

అభిషేక్ శర్మ

యంగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ సన్​రైజర్స్ హైదరాబాద్ టీమ్​ బ్యాటింగ్​లో కీలకంగా మారాడు. ఫస్ట్ బాల్​ నుంచి హిట్టింగ్​ చేస్తూ అపోజిషన్ టీమ్స్​ను భయపెడుతున్నాడీ హార్డ్ హిట్టర్. లెజెండ్ యువరాజ్ శిష్యుడు అయిన అభిషేక్.. బౌలర్లను ఊచకోత కోస్తున్నాడు. మూడు మ్యాచుల్లో 124 రన్స్ చేశాడు. ముంబై ఇండియన్స్ మీద 18 బంతుల్లోనే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ బాదేశాడు.

Jojobet GirişMadridbetMadridbetholiganbetmatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetgrandpashabet