Nidhan
సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ క్రేజీ ఫీట్ నమోదు చేశాడు. ఇన్నేళ్ల టీ20 క్రికెట్ హిస్టరీలో ఈ ఘనతను అందుకున్న తొలి భారత బౌలర్‌గా నిలిచాడు.
సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ క్రేజీ ఫీట్ నమోదు చేశాడు. ఇన్నేళ్ల టీ20 క్రికెట్ హిస్టరీలో ఈ ఘనతను అందుకున్న తొలి భారత బౌలర్‌గా నిలిచాడు.
Nidhan
టేబుల్ టాపర్ రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొడుతోంది. సింగిల్స్, డబుల్స్ కాకుండా ఆ టీమ్ బ్యాటర్లు పూనకం వచ్చినట్లు బౌండరీలు, సిక్సులను బాదుతూ రెచ్చిపోతున్నారు. జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ (20 బంతుల్లో 50), అభిషేక్ పోరెల్ (36 బంతుల్లో 65), ట్రిస్టన్ స్టబ్స్ (20 బంతుల్లో 41) రాజస్థాన్ బౌలర్లను పిచ్చకొట్టుడు కొట్టారు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోరును అలవోకగా 200 దాటించారు. అయితే ఈ మ్యాచ్‌లో స్పిన్నర్లు రాణించారు. రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లతో సత్తా చాటాడు. మరో స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఈ మ్యాచ్‌తో చరిత్ర సృష్టించాడు.
డిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో చాహల్ క్రేజీ ఫీట్ నమోదు చేశాడు. ఇన్నేళ్ల టీ20 క్రికెట్ హిస్టరీలో ఏ భారత బౌలర్‌కు సాధ్యం కాని ఘనతను అతడు అందుకున్నాడు. డీసీ కెప్టెన్ రిషబ్ పంత్ (15)ను ఔట్ చేసిన చాహల్.. తద్వారా 350 వికెట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టాడు. టీ20 క్రికెట్ చరిత్రలో 350 వికెట్లు తీసిన తొలి టీమిండియా బౌలర్ చాహలే కావడం విశేషం. తోపు బౌలర్ అయిన జస్ప్రీత్ బుమ్రా, వెటరన్ స్పిన్నర్ అశ్విన్ వల్ల కూడా ఇది కాలేదు. కానీ చాహల్ దీన్ని సాధించి చూపించాడు. దీన్ని బట్టే పొట్టి ఫార్మాట్లో అతడి గొప్పతనం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక, ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఢిల్లీ అన్ని ఓవర్లు ఆడి 8 వికెట్లకు 221 పరుగులు చేసింది.
CHAHAL BECOMES THE FIRST INDIAN TO COMPLETE 350 WICKETS IN T20 HISTORY…!!!
– One of the greatest ever. 💪 pic.twitter.com/sqH4g2gLTw
— Johns. (@CricCrazyJohns) May 7, 2024