iDreamPost

వీడియో: పంత్ కళ్లు చెదిరే స్టంపింగ్.. ఇన్నాళ్లూ ఇదే మిస్ అయ్యాం సామి!

  • Published Mar 23, 2024 | 9:00 PMUpdated Mar 23, 2024 | 9:00 PM

రెండేళ్ల తర్వాత క్రికెట్​లోకి రీఎంట్రీ ఇచ్చిన స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ అదరగొట్టాడు. కళ్లు చెదిరే స్టంపింగ్​తో మ్యాజిక్ చేశాడు.

రెండేళ్ల తర్వాత క్రికెట్​లోకి రీఎంట్రీ ఇచ్చిన స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ అదరగొట్టాడు. కళ్లు చెదిరే స్టంపింగ్​తో మ్యాజిక్ చేశాడు.

  • Published Mar 23, 2024 | 9:00 PMUpdated Mar 23, 2024 | 9:00 PM
వీడియో: పంత్ కళ్లు చెదిరే స్టంపింగ్.. ఇన్నాళ్లూ ఇదే మిస్ అయ్యాం సామి!

టీమిండియా స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ రీఎంట్రీలో అదరగొట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్​కు కెప్టెన్​గా ఉన్న పంత్.. ఐపీఎల్​-2024లో ఆడిన తొలి మ్యాచ్​లో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్​లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో ఓడినప్పటికీ బ్యాటర్​గా, కీపర్​గా పంత్ సత్తా చాటాడు. ముఖ్యంగా కీపింగ్​లో అతడు తన మార్క్ ఏంటో చూపించాడు. పంజాబ్ బ్యాటర్ జితేష్ శర్మను పంత్ కళ్లు చెదిరే రీతిలో స్టంపౌట్ చేశాడు. అలాగే ఓ క్యాచ్ కూడా అందుకున్నాడు. స్టంపింగ్ విషయానికొస్తే.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్​లో ఆఫ్ సైడ్ పడిన బంతిని రివర్స్ స్వీప్​ కొట్టేందుకు ప్రయత్నించాడు జితేష్. కానీ బాల్​ను అతడు పూర్తిగా మిస్సయ్యాడు. జితేష్ బ్యాట్​ను దాటిన బంతి వెళ్లి పంత్ చేతుల్లో పడింది. దీంతో రెప్పపాటులో అతడు వికెట్లను గిరాటేశాడు.

రివర్స్ స్వీప్ కొట్టే ప్రయత్నంలో తిరిగి క్రీజులో కాలు పెట్టడంలో జితేష్ ఫెయిలయ్యాడు. దీన్ని గమనించిన పంత్ బాల్ అందుకోగానే వికెట్లను పడేశాడు. అప్పీల్ చేయగా  రీప్లేలో జితేష్ క్లియర్ ఔట్ అని తేలింది. తాను ఔట్ అనే విషయాన్ని జితేష్ నమ్మలేకపోయాడు. క్షణ కాలంలో వికెట్లను గిరాటేయడంతో అతడికి ఏమీ అర్థం కాలేదు. పంత్ స్టంపింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్.. పంత్ ఈజ్ బ్యాక్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ మ్యాజిక్​ను ఇన్నాళ్లుగా తాము మిస్ అయ్యాం సామి అని అంటున్నారు. ఇలాగే రఫ్ఫాడించు రిషబ్ అని చెబుతున్నారు. ఇక, పంజాబ్​తో మ్యాచ్​లో 13 బంతులు ఆడిన పంత్ 18 పరుగులు చేశాడు. ఇందులో రెండు బౌండరీలు ఉన్నాయి. మరి.. పంత్ సూపర్బ్ స్టంపింగ్​ మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: రోహితే అసలైన కెప్టెన్.. సురేష్ రైనా షాకింగ్ కామెంట్స్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి