iDreamPost
android-app
ios-app

Simarjeet Singh: కీలక మ్యాచ్​లో CSKని గెలిపించిన సిమర్జీత్ లైఫ్​లో కష్టాలు! ఇది ఓ ఫైటర్ కథ!

  • Published May 13, 2024 | 1:33 PM Updated Updated May 13, 2024 | 1:33 PM

ప్లేఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్​లో సీఎస్​కే ఘనవిజయం సాధించింది. ఆ టీమ్ సక్సెస్​లో కీలకపాత్ర పోషించిన సిమర్జీత్ సింగ్​ను ఇప్పుడు అందరూ మెచ్చుకుంటున్నారు.

ప్లేఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్​లో సీఎస్​కే ఘనవిజయం సాధించింది. ఆ టీమ్ సక్సెస్​లో కీలకపాత్ర పోషించిన సిమర్జీత్ సింగ్​ను ఇప్పుడు అందరూ మెచ్చుకుంటున్నారు.

  • Published May 13, 2024 | 1:33 PMUpdated May 13, 2024 | 1:33 PM
Simarjeet Singh: కీలక మ్యాచ్​లో CSKని గెలిపించిన సిమర్జీత్ లైఫ్​లో కష్టాలు! ఇది ఓ ఫైటర్ కథ!

ఒక్క​ అవకాశం కోసం ఏళ్ల పాటు ఎదురుచూశాడు. ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా తన ప్రయత్నాలు మాత్రం వదల్లేదు. తాను అనుకున్న ఒక రోజు వస్తుందని ఓపిగ్గా వేచి ఉన్నాడు. ఈ లోపు తన బలాబలాలను సమీక్షించుకున్నాడు. తన స్ట్రెంగ్త్​ను మరింత పెంచుకున్నాడు. వీక్​నెస్​ను కూడా స్ట్రెంగ్త్​గా మార్చుకున్నాడు. ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. దీంతో గ్రౌండ్​లోకి దిగి బెబ్బులిలా ఆడాడు. నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థుల పని పట్టాడు. నెట్ బౌలర్​గా ఎంట్రీ ఇచ్చినోడు.. ఇప్పుడు స్టార్ బౌలర్ రేంజ్​కు చేరుకున్నాడు. ప్లేఆఫ్స్​కు క్వాలిఫై అవ్వాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్​లో చెన్నై సూపర్ కింగ్స్​ను గెలిపించాడు. మనం మాట్లాడుకుంటోంది సీఎస్​కే యంగ్ పేసర్ సిమర్జీత్ సింగ్ గురించి. నిన్న రాజస్థాన్​ రాయల్స్​తో మ్యాచ్​లో చెన్నై గెలుపులో అతడితే ముఖ్య పాత్ర. 3 వికెట్లతో ఆర్ఆర్ వెన్ను విరిచాడతను. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్​ అవార్డుకు ఎంపికయ్యాడు.

రాజస్థాన్​తో మ్యాచ్​లో యశస్వి జైస్వాల్, జాస్ బట్లర్, సంజూ శాంసన్ లాంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్లను ఔట్ చేశాడు సిమర్జీత్. పదునైన వేగం, కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్, డేంజరస్ బౌన్సర్స్​తో ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను వణికించాడు. పేస్​తో పాటు తెలివితోనూ రాజస్థాన్ బ్యాటర్లను బోల్తా కొట్టించాడు. అతడి వల్లే అపోజిషన్ టీమ్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఆ తర్వాత ఆ స్కోరును ఛేజ్ చేసి ప్లేఆఫ్స్ ఆశల్ని కాపాడుకుంది సీఎస్​కే. ఇలా ఒక్క మ్యాచ్​తో చెన్నైకి హీరోగా మారాడు సిమర్జీత్. అయితే అతడి లైఫ్​లో చాలా కష్టాలు ఉన్నాయి. ఈ స్థాయికి చేరుకోవడానికి సిమర్జీత్ కఠోరంగా శ్రమించాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా తన టాలెంట్​ను నమ్ముకొని ఈ స్థాయికి చేరాడీ ఢిల్లీ కుర్రాడు.

2018 నుంచి వెలుగులోకి రావాలని ఎంతో ప్రయత్నించాడు సిమర్జీత్. నెట్ బౌలర్​గా ఉంటూ ఛాన్సుల కోసం ఎదురు చూశాడు. అవకాశం రాక 6 ఏళ్లు నరకం చూశాడు. ఇక తన కెరీర్ అయిపోయిందని, క్రికెట్​ను వదిలేద్దామని ఫిక్స్ అయ్యాడు. ఈ తరుణంలో సీఎస్​కే అతడ్ని టీమ్​లోకి తీసుకుంది. అంతేగాక కీలక సమయంలో ఛాన్స్ ఇచ్చింది. ప్లేఆఫ్స్​ క్వాలిఫికేషన్ టైమ్​ కాబట్టి గెలుపు ముఖ్యం. కావాలనుకుంటే ఇతర సీనియర్ ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవచ్చు. కానీ టాలెంటెడ్ సిమర్జీత్​కు అవకాశం ఇచ్చింది. అతడు దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. తన ప్రతిభను నిరూపించుకున్నాడు. 3 వికెట్లతో సత్తా చాటి టీమ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్-2022 నుంచి సీఎస్​కేతోనే ట్రావెల్ అవుతున్న సిమర్జీత్​కు ఇప్పుడు కరెక్ట్ ఆపర్చునిటీ వచ్చింది. మరి.. ఈ సీఎస్​కే పేసర్ బౌలింగ్​పై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.