iDreamPost
android-app
ios-app

MS Dhoni: చరిత్ర సృష్టించిన ధోని.. తొలి భారత క్రికెటర్ గా రికార్డు!

  • Published Apr 15, 2024 | 12:51 PM Updated Updated Apr 15, 2024 | 12:51 PM

ముంబై ఇండియన్స్ తో భాగంగా తాజాగా జరిగిన మ్యాచ్ లో చరిత్ర సృష్టించాడు చెన్నై మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని. దీంతో ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ ప్లేయర్ గా ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయాడు.

ముంబై ఇండియన్స్ తో భాగంగా తాజాగా జరిగిన మ్యాచ్ లో చరిత్ర సృష్టించాడు చెన్నై మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని. దీంతో ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ ప్లేయర్ గా ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయాడు.

MS Dhoni: చరిత్ర సృష్టించిన ధోని.. తొలి భారత క్రికెటర్ గా రికార్డు!

మహేంద్రసింగ్ ధోని.. ఐపీఎల్ 2024 సీజన్ ఆరంభానికి ముందు ఎన్నో ప్రశ్నలు ధోనిపై బయలుదేరాయి. మోకాలికి సర్జరీ కావడంతో.. ఈ సీజన్ ఆడతాడా? లేదా? అన్న సందేహాలు ఒకవైపు.. ఏజ్ పైబడుతుండటం మరోవైపు. ఈ రెండు కారణాలు ఫ్యాన్స్ ను టెన్షన్ కు గురిచేశాయి. కానీ వారి సందేహాలను పటాపంచలు చేస్తూ.. తనదైన స్టైల్లో ఈ సీజన్ లో చెలరేగిపోతున్నాడు మిస్టర్ కూల్. వికెట్ల వెనక మెరుపు ఫీల్డింగ్ తో పాటుగా కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కు సూచనలు ఇస్తూ.. చెన్నై టీమ్ ను టోర్నీలో ముందుకు తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో నయా రికార్డును నెలకొల్పాడు. ఆ వివరాల్లోకి వెళితే..

ఐపీఎల్ 2024లో భాగంగా తాజాగా ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగ్గా.. 20 పరుగుల తేడాతో చెన్నై టీమ్ విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో ఆఖరి ఓవర్ లో బ్యాటింగ్ కు వచ్చిన సీఎస్కే మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని సరికొత్త చరిత్ర నెలకొల్పాడు. తుఫాన్ బ్యాటింగ్ తో శివాలెత్తిపోయాడు. పాండ్యా వేసిన ఈ ఓవర్ లో హ్యాట్రిక్ సిక్సులు బాది టీమ్ స్కోర్ ను 200 దాటించి విజయాన్ని కట్టబెట్టాడు. ఈ క్రమంలోనే 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే ఎదుర్కొన్న తొలి మూడు బాల్స్ ను సిక్సర్లుగా బాదిన మెుట్టమెుదటి ఇండియన్ ప్లేయర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఓవరాల్ గా ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్ గా నిలిచాడు ధోని.

ఈ లిస్ట్ లో సునీల్ నరైన్, నికోలస్ పూరన్ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. పాండ్యా వేసిన చివరి ఓవర్ మ్యాచ్ ను మలుపుతిప్పిందనే చెప్పాలి. ఈ ఓవర్ లో ధోని దెబ్బకు ఏకంగా 26 పరుగులు వచ్చాయి. ఇక మిస్టర్ కూల్ నుంచి ఇలాంటి సునామీ ఇన్నింగ్స్ ను చూసిన ఫ్యాన్స్ ఎంతోషంతో గత్తులేస్తున్నారు. అదీకాక ధోని బ్యాటింగ్ కు వచ్చే సమయంలో స్టేడియం అతడి నామస్మరణంతో దద్దరిల్లిపోయింది. మరి ఐపీఎల్ చరిత్రలోనే సరికొత్త చరిత్ర సృష్టించి.. తొలి భారత ప్లేయర్ గా ధోని నిలవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.