Somesekhar
గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో ధోని కొట్టిన వన్ హ్యాండెడ్ సిక్సులు మ్యాచ్ కే ప్రత్యేకంగా నిలిచాయి. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో ధోని కొట్టిన వన్ హ్యాండెడ్ సిక్సులు మ్యాచ్ కే ప్రత్యేకంగా నిలిచాయి. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Somesekhar
ఐపీఎల్ 2024లో నిన్న అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ 35 పరుగుల తేడాతో చెన్నైకి షాకిచ్చింది. దాంతో తన ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. భారీ స్కోర్లు నమోదు అయిన ఈ మ్యాచ్ లో గుజరాత్ ఓపెనర్లు సాయి సుదర్శన్-శుబ్ మన్ గిల్ సెంచరీలతో చెలరేగారు. దాంతో గుజరాత్ 3 వికెట్ల నష్టానికి 231 పరుగులు భారీ స్కోర్ చేసింది. అయితే ఈ మ్యాచ్ లో ధోని కొట్టిన వన్ హ్యాండెడ్ సిక్సులు మ్యాచ్ కే ప్రత్యేకంగా నిలిచాయి. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ కు ఊహించని షాకిచ్చారు గుజరాత్ ఓపెనర్లు. సాయి సుదర్శన్ 51 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సులతో 103 పరుగులతో శతకం బాదగా.. తానేమీ తక్కువ తినలేదు అన్నట్లుగా కెప్టెన్ శుబ్ మన్ గిల్ కూడా శతకంతో చెలరేగాడు. అతడు 55 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సులతో 104 పరుగులు చేశాడు. వీరిద్దరు చెన్నై బౌలర్లను చీల్చిచెండాడుతూ తొలి వికెట్ కు ఏకంగా 210 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో సన్ రైజర్స్ ఆల్ టైమ్ రికార్డ్(287) పరుగుల రికార్డ్ బద్దలు అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ చివర్లో పుంజుకున్న చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేశారు. దాంతో 20 ఓవర్లలో3 వికెట్లకు 231 పరుగులు సాధించింది గుజరాత్.
అనంతరం 232 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ కు ఆదిలోనే ఊహించని షాకిచ్చారు గుజరాత్ బౌలర్లు. దాంతో కేవలం 10 పరుగులకే 3 కీలక వికెట్లను కోల్పోయింది. ఈ దశలో క్రీజ్ లోకి వచ్చిన డార్లీ మిచెల్(63), మెుయిన్ అలీ(56) ఇద్దరు నాలుగో వికెట్ కు 109 పరుగులు జోడించి.. విజయంపై ఆశలు రేపారు. కానీ వీరిద్దరు అవుట్ అయిన తర్వాత మిగతా బ్యాటర్లు రాణించకపోవడంతో.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 196 రన్స్ కే పరిమితం అయ్యింది. అయితే 8వ నంబర్ లో బ్యాటింగ్ కు దిగిన ధోని 11 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సులతో 26 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. కాగా.. ఈ మ్యాచ్ లో ధోని ఒంటిచేత్తో కొట్టిన రెండు సిక్సులు హైలెట్ గా నిలిచాయి. రషీద్ ఖాన్ వేసిన ఆ ఓవర్లో తొలి రెండు బంతులను స్టాండ్స్ లోకి పంపించాడు మిస్టర్ కూల్. అందులో ఒకటి సింగిల్ హ్యాండ్ తో కొట్టిన సిక్స్ ఉంది. అంతకు ముందు మోహిత్ శర్మ వేసిన ఓవర్ లో కూడా ధోని ఒంటిచేత్తో సిక్స్ బాది, తనలో ఇంకా పసతగ్గలేదని నిరూపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ధోని సింగిల్ హ్యాండ్ సిక్సులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
2 one handed sixes and a helicopter shot from MS Dhoni. 🚁💥pic.twitter.com/KVhDQXMoeX
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 10, 2024