Somesekhar
పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో సీఎస్కే బౌలర్ రేర్ ఫీట్ ను సాధించాడు. అయితే అతడు వికెట్లు తీయడం ద్వారా ఈ ఘనత సాధించలేదు. పైగా ఐపీఎల్ చరిత్రలో ఈ రికార్డ్ నెలకొల్పిన రెండో ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో సీఎస్కే బౌలర్ రేర్ ఫీట్ ను సాధించాడు. అయితే అతడు వికెట్లు తీయడం ద్వారా ఈ ఘనత సాధించలేదు. పైగా ఐపీఎల్ చరిత్రలో ఈ రికార్డ్ నెలకొల్పిన రెండో ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Somesekhar
ఈ ఐపీఎల్ సీజన్ లో రికార్డుల మీద రికార్డులు బద్దలు అవుతున్నాయి. తాజాగా జరిగిన పంజాబ్ వర్సెస్ చెన్నై మ్యాచ్ లో కూడా పలు రికార్డులు బ్రేక్ అయ్యాయి. అందులో ఒకటి సీఎస్కే బౌలర్ నెలకొల్పిన అరుదైన ఘనత కూడా ఉంది. దాంతో ఐపీఎల్ చరిత్రలో రెండో ప్లేయర్ గా ఆ బౌలర్ నిలిచాడు. అయితే అతడు వికెట్లు తీసి ఈ రికార్డ్ సృష్టించలేదు. మరెలా ఈ రేర్ ఫీట్ ను సాధించాడు? పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇంగ్లండ్ వెటరన్ పేసర్, సీఎస్కే బౌలర్ రిచర్డ్ గ్లీసన్ అరుదైన ఘనతను సాధించాడు. 2014 తర్వాత ఐపీఎల్ లోకి డెబ్యూ చేసిన అత్యంత పెద్ద వయస్కుడిగా గ్లీసన్ చరిత్ర సృష్టించాడు. పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున డెబ్యూ చేశాడు ఈ సీనియర్ బౌలర్. దాంతో ఐపీఎల్ లో ఈ రికార్డ్ సాధించిన రెండో ప్లేయర్ గా రేరే ఫీట్ సాధించాడు. 36 ఏళ్ల 151 రోజుల వయస్సులో గ్లీసన్ ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ లిస్ట్ లో తొలి ప్లేస్ లో ఉన్నాడు జింబాబ్వే స్టార్ ఆల్ రౌండర్ సికిందర్ రజా. అతడు 36 ఏళ్ల 342 రోజుల వయస్సులో పంజాబ్ కింగ్స్ తరఫున డెబ్యూ చేశాడు.
కాగా.. గాయం కారణంగా డెవాన్ కాన్వే ఈ సీజన్ కు దూరం కావడంతో.. అతడి ప్లేస్ లో గ్లీసన్ ను తీసుకుంది చెన్నై. కానీ ఐపీఎల్ సీజన్ సగం ముగిశాక ఇప్పుడు అవకాశం వచ్చింది. స్టార్ బౌలర్ మతీష పతిరణ ఈ మ్యాచ్ కు దూరం కావడంతో.. అతడి ప్లేస్ లో గ్లీసన్ కు ఛాన్స్ దక్కింది. ఇక ఈ మ్యాచ్ లో 3.5 ఓవర్లు వేసిన గ్లీసన్ 30 పరుగులు ఇచ్చి ప్రబ్ సిమ్రన్ వికెట్ తీసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో పంజాబ్ విజయం సాధించింది. 163 రన్స్ టార్గెట్ ను 3 వికెట్లు కోల్పోయి 17.5 ఓవర్లలో ఛేదించింది పంజాబ్. మరి ఐపీఎల్ చరిత్రలో అరుదైన రికార్డ్ నెలకొల్పిన గ్లీసన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Making his IPL debut at the age of 36, Richard Gleeson makes the breakthrough for CSK 🔥
He certainly enjoyed that one 🙌#CSKvPBKS #IPL2024 pic.twitter.com/U2o6IUxYK5
— ESPNcricinfo (@ESPNcricinfo) May 1, 2024