Somesekhar
గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో అన్ని విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన చెన్నై.. 63 రన్స్ తో సీజన్ లో రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. చెన్నై విజయానికి 5 ప్రధాన కారణాలు ఉన్నాయి. అవేంటో ఓసారి పరిశీలిద్దాం
గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో అన్ని విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన చెన్నై.. 63 రన్స్ తో సీజన్ లో రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. చెన్నై విజయానికి 5 ప్రధాన కారణాలు ఉన్నాయి. అవేంటో ఓసారి పరిశీలిద్దాం
Somesekhar
ఐపీఎల్ 2024లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తన జోరును కొనసాగిస్తోంది. ఈ సీజన్ తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ను చిత్తు చేసి.. రెండో మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ను మట్టికరిపించింది. మంగళవారం చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ పోరులో అన్ని విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన చెన్నై.. 63 రన్స్ తో సీజన్ లో రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. చెన్నై విజయానికి 5 ప్రధాన కారణాలు ఉన్నాయి. అవేంటో ఓసారి పరిశీలిద్దాం పదండి.
చెన్నై విజయానికి 5 ప్రధాన కారణాలు!
తొలి విజయంతో జోరు మీదున్న చెన్నై టీమ్ అదే జోరును గుజరాత్ పై కూడా చూపించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నై టీమ్ బ్యాటింగ్ లో దంచికొట్టింది. వచ్చిన బ్యాటర్లు వచ్చినట్లే తమ బ్యాట్లకు పనిచెప్పడంతో.. భారీ స్కోర్ సాధించింది. రుతురాజ్ గైక్వాడ్(46), రచిన్ రవీంద్ర(46), శివమ్ దూబే(51), డార్లీ మిచెల్(24*) పరుగులతో రాణించారు. పటిష్ట గుజరాత్ బౌలింగ్ ను ఓ ఆటాడుకున్నారు చెన్నై బ్యాటర్లు.
చెన్నై 206 పరుగుల భారీ స్కోర్ సాధించింది అంటే దానికి ప్రధాన కారణం.. ఆ టీమ్ కు లభించిన శుభారంభమే. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్-రచిన్ రవీంద్ర మెరుపు ఆరంభం అందించారు. ఉమేష్, రషీద్ ఖాన్, జాన్సన్ లాంటి పటిష్ట బౌలర్లను దంచికొడుతూ.. కేవలం 5.2 ఓవర్లలోనే 62 పరుగుల పార్ట్ నర్ షిఫ్ నెలకొల్పారు. వరల్డ్ కప్ నుంచి రెచ్చిపోయి ఆడుతున్న రచిన్ రచిన్ 20 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో మెరుపు వేగంతో 46 పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. అతడి స్ట్రైక్ రేట్ 230 ఉండటం విశేషం. సూపర్ స్టార్ట్ లభించడంతో.. మిగతా బ్యాటర్లపై ఎలాంటి ఒత్తిడి లేకుండా పోయింది. దీంతో తమ బ్యాట్లకు స్వేచ్చగా పనిచెప్పారు.
తొలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ను ఓడించిన గుజరాత్ రెండో మ్యాచ్ లో తడబడింది. చెన్నైతో జరిగిన మ్యాచ్ లో అన్ని విభాగాల్లో మూకుమ్మడిగా విఫలం అయ్యింది. బౌలింగ్, బ్యాటింగ్ లో దారుణంగా తేలిపోయింది. తొలుత బౌలింగ్ లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న గుజరాత్.. ఆ తర్వాత బ్యాటింగ్ లో కూడా విఫలం అయ్యింది. రషీద్ ఖాన్ 49, జాన్సన్ 35, మోహిత్ శర్మ 36 పరుగులు సమర్పించుకున్నారు. బ్యాటింగ్ లో సాయి సుదర్శన్ ఒక్కడే 37 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
చెన్నై సూపర్ కింగ్స్ .. ఐపీఎల్ లో టీమ్ ఎఫర్ట్ చూపించే జట్లలో ఒకటి. ఎంతటి టీమ్స్ నైనా.. ఓటమి అంచుల్లో ఉన్నా.. టీమ్ ఎఫర్ట్ చూపించి విజయాన్ని ప్రత్యర్థి నుంచి లాక్కోవడంలో చెన్నై మెుదటి ప్లేస్ లో నిలుస్తుంది. తాజాగా గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో జట్టు మెుత్తం అద్భుతంగా రాణించింది. తొలుత బ్యాటింగ్ లో ఆ తర్వాత బౌలింగ్ లో దుమ్మురేపారు చెన్నై ఆటగాళ్లు. ముందునుంచి వస్తున్న టీమ్ ఎఫర్టే గుజరాత్ ను చిత్తు చేసి చెన్నైకి రెండో విజయాన్ని అందించింది.
ధోని కెప్టెన్సీ పగ్గాలు వదులుకొని గైక్వాడ్ కు అప్పగించడంతో.. అందరూ అతడు ఎలా జట్టును నడిపిస్తాడో అని సందేహంగా చూశారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. కెప్టెన్సీలో దూసుకెళ్తున్నాడు గైక్వాడ్. తొలి మ్యాచ్ లో ఆర్సీబీని, ఇప్పుడు గుజరాత్ ను చిత్తు చేశాడు గైక్వాడ్. అద్భుతమైన కెప్టెన్సీతో ఆటగాళ్లను ఎలా, ఏ పరిస్థితుల్లో, ఎప్పుడు ఉపయోగించుకోవాలో అలా వాడుకుంటూ.. కెప్టెన్సీలో దూసుకెళ్తున్నాడు. అతడి నాయకత్వంలో చెన్నై జట్టు దూసుకెళ్తోంది.