iDreamPost

IPLలో బ్యాటర్లను భయపెట్టిస్తున్న రూల్.. మ్యాచ్ స్వరూపమే మారిపోతోంది!

  • Published Mar 27, 2024 | 4:59 PMUpdated Mar 27, 2024 | 4:59 PM

ఈసారి ఐపీఎల్​లో బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నారు బౌలర్లు. భారీ స్కోర్లు బాదకుండా ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. దీనికి కారణం ఓ కొత్త రూల్ అని చెప్పొచ్చు.

ఈసారి ఐపీఎల్​లో బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నారు బౌలర్లు. భారీ స్కోర్లు బాదకుండా ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. దీనికి కారణం ఓ కొత్త రూల్ అని చెప్పొచ్చు.

  • Published Mar 27, 2024 | 4:59 PMUpdated Mar 27, 2024 | 4:59 PM
IPLలో బ్యాటర్లను భయపెట్టిస్తున్న రూల్.. మ్యాచ్ స్వరూపమే మారిపోతోంది!

క్రికెట్​ చూసే ఆడియెన్స్​ ఎక్స్​పీరియెన్స్​ను మరింత బెటర్​ చేయడానికి అప్పుడప్పుడూ కొత్త రూల్స్ తీసుకొస్తుంటారు. ఆట మీద మరింత ఇంట్రెస్ట్ పెంచడానికి కూడా కొన్ని నిబంధనలు ఉపయోగపడతాయి. గేమ్ వన్ సైడ్ కాకుండా బ్యాటర్లు, బౌలర్లకు అవకాశాలు సమంగా ఉండేలా చేసేందుకు ఇవి హెల్ప్ అవుతాయి. అలా ఆటను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు ఐపీఎల్-2024లో ఓ కొత్త రూల్ తీసుకొచ్చారు. అది ఇప్పుడు బ్యాటర్లను తీవ్రంగా భయపెడుతోంది. టాప్ బ్యాట్స్​మెన్ కూడా ఈ నిబంధనను చూసి వణికిపోతున్నారు. బౌలర్ల పాలిట వరంగా మారిన ఈ కొత్త రూల్ వల్ల ఐపీఎల్​లో కొన్ని మ్యాచ్​ల స్వరూపమే మారిపోయింది. గెలవాల్సిన జట్లు ఓటమిని మూటగట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అసలు ఏంటా రూల్? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఐపీఎల్-2024లో ఓవర్​కు 2 బౌన్సర్ల రూల్​ను బీసీసీఐ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇంతకుముందు వరకు మెగా లీగ్​లో ఓవర్​లో ఒకే బౌన్సర్ సంధించడానికి బౌలర్లకు అనుమతి ఉండేది. కానీ ఇప్పుడు రెండు బౌన్సర్లు వేయొచ్చు. దీంతో బౌన్సర్​ను ఆయుధంగా చేసుకొని బ్యాటర్లను భయపెడుతున్నారు బౌలర్లు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో ఈ వెపన్​తో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతున్నారు. క్వాలిటీ పేస్​ లైనప్ కలిగిన టీమ్స్ బౌన్సర్లతో ప్రత్యర్థి జట్లను వణికిస్తున్నాయి. చివరి ఓవర్లలో రన్స్ కట్టడి చేయడంతో పాటు కీలక సమయాల్లో బ్రేక్ త్రూలు కావాలంటే బౌన్సర్లను ప్రయోగిస్తున్నారు బౌలర్లు. అందునా పేస్​కు సహకరించే పిచ్ దొరికిందంటే పండుగ చేసుకుంటున్నారు. దీనిపై చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ దీపక్ చాహర్ రియాక్ట్ అయ్యాడు.

గతంలో ఓవర్​లో మొదటి మూడు బంతుల్లో బౌన్సర్ వేస్తే.. మిగతా మూడు బంతులు లైన్ లెంగ్త్​తో వేసేవాళ్లమని చాహర్ చెప్పాడు. ఇప్పుడు కొత్త రూల్ వల్ల ఒకే ఓవర్​లో రెండు బౌన్సర్లు వేసే వెసులుబాటు దొరికిందన్నాడు. బ్యాటర్లపై పైచేయి సాధించేందుకు ఇది తమకు ఉపయోగపడుతోందని తెలిపాడు. బౌన్సీ పిచ్​లపై ఇది తమకు ప్రధాన ఆయుధంగా మారిందన్నాడు. ఇక, ఈ మధ్య కాలంలో టీ20లు, వన్డేలతో ఆడియెన్స్​ను మరింత​ ఎంటర్​టైన్ చేసేందుకు ఎక్కువగా ఫ్లాట్​పిచ్​లు తయారు చేస్తున్నారు. ఈ పిచ్​లపై బ్యాటర్లు పండుగ చేసుకుంటున్నారు. భారీ స్కోర్లు బాదుతూ ఎంటర్​టైన్ చేస్తున్నారు.

ఫ్లాట్​ పిచ్​లపై భారీ స్కోర్లు నమోదవుతుండటం, బౌలర్లకు ఎలాంటి హెల్ప్ లభించకపోవడంతో క్రికెట్ బ్యాట్స్​మెన్ గేమ్​గా మారిపోయిందనే విమర్శలు వచ్చాయి. మ్యాచుల్లో అస్సలు పస ఉండటం లేదనే కామెంట్స్ వినిపించాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఐపీఎల్​లో రెండు బౌన్సర్ల రూల్​ను తీసుకొచ్చారు. లీగ్​లో భారీ స్కోర్లు నమోదవుతున్నా.. కొత్త రూల్​ను ఉపయోగించుకొని బౌలర్లు గెలుపోటములను డిసైడ్ చేస్తున్నారు. దీంతో బీసీసీఐని అందరూ మెచ్చుకుంటున్నారు. గేమ్​లో బ్యాలెన్స్ తీసుకొచ్చేందుకు బోర్డు ప్రయత్నిస్తుండటం శుభపరిణామం అని అంటున్నారు. మరి.. రెండు బౌన్సర్ల రూల్​ మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: Virat Kohli: వీడియో: కోహ్లీ కాళ్లు మొక్కిన అభిమానిపై దాడి! గ్రౌండ్‌లోనే చావగొట్టేశారు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి