ఐపీఎల్ 2024 వేలంలో అత్యధిక ధర పలికే ఆటగాడు ఎవరు? ఇప్పుడు ఈ ప్రశ్న క్రికెట్ ప్రపంచంలో ఆసక్తిగా మారింది. అయితే ఈ వేలంలో అందరి చూపు అతడి వైపే ఉందని, అతడి కోసం ఏకంగా 20 కోట్లు పెట్టడానికి కూడా ఫ్రాంచైజీలు వెనకడుగు వేయవని తెలుస్తోంది. మరి ఆ ప్లేయర్ ఎవరు?
ఐపీఎల్ 2024 వేలంలో అత్యధిక ధర పలికే ఆటగాడు ఎవరు? ఇప్పుడు ఈ ప్రశ్న క్రికెట్ ప్రపంచంలో ఆసక్తిగా మారింది. అయితే ఈ వేలంలో అందరి చూపు అతడి వైపే ఉందని, అతడి కోసం ఏకంగా 20 కోట్లు పెట్టడానికి కూడా ఫ్రాంచైజీలు వెనకడుగు వేయవని తెలుస్తోంది. మరి ఆ ప్లేయర్ ఎవరు?
ఐపీఎల్ 2024.. మరికొన్ని రోజుల్లో క్రికెట్ లవర్స్ ను ఉర్రూతలూగించడానికి రెడీ అవుతోంది. ఇక ఇప్పటికే ఈ మెగాటోర్నీకి సంబంధించి క్యాష్ ఆన్ డీల్ విధానం ముగిసిన సంగతి తెలిసిందే. దీంతో అందరి చూపు డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా జరిగే ఐపీఎల్ వేలంపై పడింది. ఈ వేలం కోసం మెుత్తం 1166 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇక ఇప్పుడు అందరి మెదళ్లను తొలిచే ఒకే ఒక్క ప్రశ్న.. ఈ సీజన్ లో అత్యధిక ధర పలికే ఆటగాడు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం కోసమే చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అతడి కోసం రూ. 20 కోట్లైనా ఫ్రాంచైజీలు పెట్టడానికి సిద్దంగా ఉన్నాయట. ప్రస్తుతం ఆ ఒక్క ఆటగాడే అందరికి టార్గెట్ గా మారాడు. మరి ఆ ప్లేయర్ ఎవరు? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఐపీఎల్ 2024 వేలంలో అత్యధిక ధర పలికే ఆటగాడు ఎవరు? ఇప్పుడు ఈ ప్రశ్న క్రికెట్ ప్రపంచంలో ఆసక్తిగా మారింది. డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా ఐపీఎల్ 17వ ఎడిషన్ కు సంబంధించిన వేలం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో 1166 మంది ప్లేయర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. ప్రతీ సీజన్ కు రికార్డు ధర పలికే ఆటగాళ్లు ఎవరన్న దానిపై చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈసారి కూడా అదే చర్చ మెుదలైంది. ఈ వేలంలో అందరి చూపు ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ పై పడింది. అతడెవరో కాదు వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ సెంచరీ హీరో ట్రావిస్ హెడ్. ప్రస్తుతం ఈ వేలంలో ఇతడిని దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయట. ఇతడి కోసం ఏకంగా రూ. 20 కోట్లు పెట్టడానికైనా రెడీగా ఉన్నాయని తెలుస్తోంది. ఇదే జరిగితే ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక ధర పలికిన ప్లేయర్ గా ట్రావిస్ హెడ్ రికార్డుల్లోకి ఎక్కుతాడు.
ఇప్పటి వరకు ఈ మెగాటోర్నీ చరిత్రలో రూ.18.50 కోట్లకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించాడు ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ సామ్ కర్రన్. ప్రస్తుతం హెడ్ ఫామ్ ను చూసి అతడికి భారీ మెుత్తంలో పెట్టొచ్చని భావిస్తున్నాయట ఫ్రాంచైజీలు. కాగా.. ఈ వేలంలో గుజరాత్ దగ్గర అత్యధికంగా రూ. 38.15 కోట్లు ఉన్నాయి. దీంతో గుజరాత్ యాజమాన్యం అతడికి కొనుగోలుకు మెుగ్గుచూపొచ్చని భావిస్తున్నారు క్రీడా పండితులు. మిగిలిన జట్ల దగ్గర వరుసగా.. SRH దగ్గర రూ. 34 కోట్లు, కేకేఆర్ 32.7 కోట్లు, ఢిల్లీ 28.95 కోట్లు, పంజాబ్ 29 కోట్లు, బెంగళూరు 23.25 కోట్లతో ఉన్నాయి. మిగిలిన జట్లు రూ. 20 కోట్లలోపే డబ్బులు కలిగి ఉన్నాయి. మరి ఈ ఐపీఎల్ వేలంలో ఎవరు ఎక్కువ ధర పలుకుతారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.