iDreamPost
android-app
ios-app

Piyush Chawla: SRHతో మ్యాచ్.. 35 ఏళ్ల వయసులో కుర్రాళ్లకు సవాల్ విసురుతున్న చావ్లా..

  • Published May 06, 2024 | 9:51 PM Updated Updated May 06, 2024 | 9:51 PM

SRHతో జరిగిన మ్యాచ్ లో తన స్పిన్ మ్యాజిక్ చూపించాడు టీమిండియా మాజీ స్పిన్నర్ పియూష్ చావ్లా. 35 ఏళ్ల ఏజ్ లో కూడా కుర్ర బౌలర్లకు ధీటుగా బౌలింగ్ చేస్తూ.. వారికి సవాల్ విసురుతున్నాడు ఈ సీనియర్.

SRHతో జరిగిన మ్యాచ్ లో తన స్పిన్ మ్యాజిక్ చూపించాడు టీమిండియా మాజీ స్పిన్నర్ పియూష్ చావ్లా. 35 ఏళ్ల ఏజ్ లో కూడా కుర్ర బౌలర్లకు ధీటుగా బౌలింగ్ చేస్తూ.. వారికి సవాల్ విసురుతున్నాడు ఈ సీనియర్.

Piyush Chawla: SRHతో మ్యాచ్.. 35 ఏళ్ల వయసులో కుర్రాళ్లకు సవాల్ విసురుతున్న చావ్లా..

క్రీడారంగంలో ఆటగాళ్లకు 30 సంవత్సరాలు దాటితే చాలు.. ఇక అతడి పనైపోయింది అనుకుంటారు చాలా మంది. కానీ ఏజ్ జస్ట్ ఏ నంబర్ అని నిరూపిస్తూ.. కుర్రాళ్ల కంటే అద్భుతంగా రాణిస్తుంటారు కొందరు ప్లేయర్లు. ఇలాంటి కోవలోకే వస్తాడు టీమిండియా మాజీ స్పిన్నర్ పియూష్ చావ్లా. 2006లో ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అడుగుపెట్టిన అతడు.. ఇప్పటికీ తన బౌలింగ్ తో క్రికెట్ ప్రేమికులను అలరిస్తున్నాడు. తాజాగా జరుగుతున్న ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు చావ్లా. ఇక మెున్న కోల్ కత్తాతో జరిగిన మ్యాచ్ లో రికార్డ్ క్రియేట్ చేసి.. తాజాగా సన్ రైజర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో అద్భుత బౌలింగ్ తో అబ్బురపరిచాడు. 35 ఏళ్ల వయసులో కుర్రాళ్లకు సవాల్ విసురుతూ.. ఔరా అనిపిస్తున్నాడు.

పియూష్ చావ్లా.. టీమిండియా లెగ్ స్పిన్నర్ గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. భారత్ తరఫున ఆడింది తక్కువ మ్యాచ్ లే అయినప్పటికీ.. తనదైన మార్క్ ను క్రియేట్ చేశాడు. ఇక ఐపీఎల్ లో అయితే తిరుగులేని రికార్డ్ ను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ గా చరిత్ర సృష్టించాడు ఈ 35 ఏళ్ల యంగ్ స్పిన్నర్. కుర్రాళ్లకు సైతం సాధ్యం కాని ఈ రికార్డ్ ను ఈ ఏజ్ లో సాధించి.. అబ్బురపరిచాడు. ఇక తాజాగా వాంఖడే వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో చెలరేగాడు ఈ సీనియర్ బౌలర్.

ఈ సీజన్ లో విధ్వంసకరమైన ఆటతో ప్రత్యర్థి బౌలర్లను వణికిస్తున్నాడు ట్రావిస్ హెడ్. ఈ మ్యాచ్ లో కూడా 30 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సుతో 48 పరుగులు చేసి ప్రమాదకరంగా మారుతున్న అతడిని అద్భుతమైన బంతితో పెవిలియన్ కు చేర్చాడు. తిలక్ వర్మ పట్టిన క్యాచ్ తో హెడ్ అవుట్ అయ్యాడు. దీంతో ముంబై ఇండియన్స్ కు ఊపిరిపోశాడు. ఇక ఆ వెంటనే వేసిన మరో ఓవర్లో ప్రమాదకర ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్(2)ను ఎక్కువ సేపు క్రీజ్ లో నిలబడనివ్వలేదు. ఓ అద్భుతమైన బంతితో క్లాసెన్ ను బౌల్డ్  చేసి.. ముంబైని తిరుగులేని స్టేజ్ లో నిలిపాడు చావ్లా. యంగ్ ప్లేయర్ అబ్దుల్ సమద్ ను సైతం పెవిలియన్ కు పంపి.. కుర్ర బౌలర్లకు తన ఏజ్ ఇంకా అవ్వలేదని సవాల్ విసిరాడు.

ఈ మ్యాచ్ లో 4 ఓవర్లు వేసి 33 రన్స్ ఇచ్చి 3 కీలక వికెట్లను పడగొట్టాడు చావ్లా. దీంతో ఈ ఏజ్ లో ఇలాంటి బౌలింగ్ ఏంటి సామి? అంటూ కామెంట్స్ చేస్తున్నారు క్రికెట్ లవర్స్. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. జట్టులో ట్రావిస్ హెడ్(48), కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ 17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 35 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. మరి 35 సంవత్సరాల ఏజ్ లో కూడా తనలో ఇంకా పస తగ్గలేదని నిరూపిస్తున్న పియూష్ చావ్లాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.