iDreamPost

AP బీజేపీలో అంత‌ర్గ‌త ఫైట్? రెండు వర్గాలుగా మారిన నేతలు!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో బీజేపీ రాష్ట్ర చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన దగ్గుబాటి పురంధేశ్వరి అందరిని కలుపుకునిపోవడంలో విఫలమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. అంతేకాక పురంధేశ్వరి ప్రవర్తన ఆ పార్టీలోనే కొందరు నేతలకు నచ్చట్లేదనే వాదనలు వినిపిస్తోన్నాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన కొందరు ఆమెపై ఓపెన్ గానే ఫిర్యాదులు చేస్తున్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో బీజేపీ రాష్ట్ర చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన దగ్గుబాటి పురంధేశ్వరి అందరిని కలుపుకునిపోవడంలో విఫలమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. అంతేకాక పురంధేశ్వరి ప్రవర్తన ఆ పార్టీలోనే కొందరు నేతలకు నచ్చట్లేదనే వాదనలు వినిపిస్తోన్నాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన కొందరు ఆమెపై ఓపెన్ గానే ఫిర్యాదులు చేస్తున్నారు.

AP బీజేపీలో అంత‌ర్గ‌త ఫైట్? రెండు వర్గాలుగా మారిన నేతలు!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో బీజేపీ రాష్ట్ర చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన దగ్గుబాటి పురంధేశ్వరి అందరిని కలుపుకునిపోవడంలో విఫలమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. పార్టీ పగ్గాలు చేపట్టిన తరువాత ప్రభుత్వంపై వరుసగా ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అయితే పురంధేశ్వరి కంటే ముందు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు పనిచేసిన టైమ్ లో అధికార పార్టీతో పాటు  టీడీపీపైన విమర్శలు చేసేవారు. కానీ పురందేశ్వరి మొదటి నుంచీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. అంతేకాక పురంధేశ్వరి ప్రవర్తన ఆ పార్టీలోనే కొందరు నేతలకు నచ్చట్లేదని టాక్ వినిపిస్తోంది. అంతేకాక  ఆ పార్టీకి చెందిన కొందరు ఆమెపై ఓపెన్ గానే ఫిర్యాదులు చేస్తున్నారు.

దగ్గుబాటి పురంధేశ్వరి రాష్ట్ర ప్రభుత్వంపై పలు అంశాల్లో కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం పై ఆమె దూకుడుగా ముందుకెళ్తున్నారు. ప్రభుత్వంపై ఆరోణపలు చేయడానికి చూపే శ్రద్ద.. పార్టీ కార్యక్రమాలపై సారించలేదనే వాదనలు వినిపిస్తోన్నాయి. ఇలా ఉన్న ఏపీ బీజేపీలో ఇటీవల చంద్రబాబు అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాలతో ముసలం పుట్టినట్లు తెలుస్తుంది. తమ అధ్యక్షురాలు పార్టీ బలోపేతానికి కాకుండా చంద్రబాబు కోసం పరోక్షంగా సహకరిస్తున్నారని కొంత మంది నేతకు కోపంగా ఉన్నారని తెలుస్తోంది. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పురందేశ్వరి లేఖ రాయడంతో బీజేపీ నాయకులు బహిరంగానే ఆరోపణలకు దిగుతున్నారు. దీంతో ఒక్కసారిగా బీజేపీలో ఉన్న వర్గ విభేదాలు బయటపడినట్లైంది.

ఒకవైపు పురందేశ్వరి పై వైఎస్సార్ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ లతో తీవ్ర ఆరోపణలు చేస్తుండగా.. మరోవైపు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సుబ్బారెడ్డి మరింత తీవ్రంగా ఆమెపై వ్యాఖ్యలు చేశారు. అసలు పురందేశ్వరి బీజేపీ కోసం కాకుండా తన మరిది చంద్రబాబు కోసం, టీడీపీని కాపాడటానికి పని చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సొంత పార్టీలో కీలక నాయకుడు ఇలాంటి ఆరోపణలు చేయడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. స్వప్రయోజనాల కోసం పురందేశ్వరి పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని సుబ్బారెడ్డి మండిపడ్డారు. టీడీపీతో పొత్తు కోసం పురందేశ్వరి ప్రయత్నిస్తున్నారని సుబ్బారెడ్డి అంటున్నారు.

ఒకవేళ్ల బీజేపీకి టీడీపీతో పొత్తు ఓకే అయితే.. ఎంపీగా పోటీ చేయాలని ఆశతో ఆమె ఉన్నట్లు సుబ్బారెడ్డి ఆరోపించారు. ఇప్పటి వరకు లోలోపల ఉన్న పార్టీ విబేధాలు.. సుబ్బారెడ్డి ఆరోపణలతో ఒక్కసారిగా బయట పడ్డాయని పొలిటికల్ టాక్ నడుస్తోంది. అయితే పురందేశ్వరి మాత్రం ఇవేవీ పట్టించుకోవడం లేదు. గతంలో కూడా ఇలాంటి ఆరోపణలకు స్పందించాల్సిన అవసరం లేదని ఆమె స్వయంగా తెలిపారు. మరి.. ఏపీ రాష్ట్ర బీజేపీలో కుమ్ములాటలు జరుగుతున్నాయని సోషల్ మీడీయాలో వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి