iDreamPost

వీడియో: చిరంజీవికి విషెస్ చెబుతూ లీక్స్ చేసిన కల్కీ టీమ్!

వీడియో: చిరంజీవికి విషెస్ చెబుతూ లీక్స్ చేసిన కల్కీ టీమ్!

ప్రభాస్ నుంచి వస్తున్న ప్రాజెక్టుల్లో కల్కీ 2898AD మీద ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అంచనాలు ఉన్నాయి. కమిక్ కాన్ లో ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్, ఫస్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేసి వరల్డ్ వైడ్ గా ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశారు. హాలీవుడ్ ని మించిపోయే రేంజ్ లో ఉన్న ఈ సినిమా స్టోరీ, టేకింగ్, ప్రొడక్షన్ వ్యాల్సూ చూసి వరల్డ్ వైడ్ గా ఉన్న ఫిల్మ్ మేకర్స్ ఆశ్చర్యపోయారు. ఈ సినిమాకి సంబంధించి ఏ చిన్న అప్ డేట్ వస్తుందా అని కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. మొత్తం సినిమా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికోసం ఇది చాలా పెద్ద సర్ ప్రైజ్ అనే చెప్పాలి. ఎందుకంటే కల్కీ సినిమా నుంచి ఒక వీడియో లీక్ అయింది.

వీడియో లీక్ అనగానే.. పైరసీ, ఎవరో బయటివాళ్లు చేశారు అనుకోకండి. ఈ లీక్ ని కల్కీ సినిమా టీమే చేసింది. సాధారణంగా టాలీవుడ్ లో మూవీ లీక్స్ అనగానే అందరికీ మెగాస్టార్ చిరంజీవి పేరే గుర్తొస్తుంది. ఆయన చేస్తున్న సినిమాకి సంబంధించి మాత్రమే కాదు.. ఏ ప్రాజెక్టుకు సంబంధించి ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఏదొక ఆడియో ఫంక్షన్, ప్రీరిలీజ్ ఈవెంట్ వంటి చోట్ల లీక్ చేసేవాళ్లు. ఇప్పుడు నేరుగా సోషల్ మీడియాలోనే లీక్స్ మొదలు పెట్టేశారు. తాజాగా తీసిన భోళా శంకర్ సినిమాకి సంబంధించిన కీ పాయింట్స్ ని ముందే తన సోషల్ మీడియా అకౌంట్స్ లో లీక్ చేయడం చూశాం. ఇప్పుడు అదే దారిలో కల్కీ టీమ్ కూడా వీడియో లీక్ చేసింది.

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు విషెస్ చెప్పేందుకు వైజయంతీ మూవీస్ కొత్త దారిని ఎంచుకుంది. అందరూ మెగాస్టార్ పోస్టర్స్ క్రియేట్ చేయడం, ఆయన చేస్తున్న సినిమాలకు సంబంధించిన విషయాలను వెల్లడిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. కానీ, వైజయంతీ మూవీస్ మాత్రం వరల్డ్ వైడ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ అయిన కల్కీ మూవీ నుంచి ప్రభాస్ సీన్ ని డైరెక్ట్ ఎడిటింగ్ రూమ్ నుంచే లీక్ చేశారు. అందులో ప్రభాస్ ఉన్న ఒక చిన్న 5 సెకన్ల సన్నివేశాన్ని లీక్ చేశారు. అయితే అంత చిన్న దానికి ఇంత హడావుడి అవసరమా? అనేయకండి. ఎందుకంటే కల్కీ సినిమాపై ఉన్న అంచనాలు, ఎదురుచూపులతో పోలిస్తే.. ఒక్క చిన్న ఫొటో వచ్చిన ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటారు. అలాంటిది ఒక వీడియో లీక్ చేయగానే వాళ్ల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. మరి.. ప్రభాస్ కల్కీ మూవీ లీక్డ్ వీడియో మీరూ చూసేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి