iDreamPost
android-app
ios-app

టీమిండియాకి దొరికిన టాప్-5 చెత్త కెప్టెన్స్ వీరే! పరువు తీశారు!

  • Published Aug 14, 2023 | 4:22 PM Updated Updated Aug 14, 2023 | 4:22 PM
  • Published Aug 14, 2023 | 4:22 PMUpdated Aug 14, 2023 | 4:22 PM
టీమిండియాకి దొరికిన  టాప్-5 చెత్త కెప్టెన్స్ వీరే! పరువు తీశారు!

భారత క్రికెట్‌ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్లు ఎవరంటే.. కపిల్‌ దేవ్‌, సౌరవ్‌ గంగూలీ, మహేంద్రసింగ్‌ ధోని, విరాట్‌ కోహ్లీలా పేరు చెప్పుకుంటారు. వీరి హయాంలో టీమిండియా తిరుగులేని శక్తిగా కొనసాగింది. ఒక కొత్త టీమిండియాను వీరి కెప్టెన్సీలో ప్రపంచం చూసింది. అలాగే అరకొర మ్యాచ్‌లకు కెప్టెన్లుగా వ్యవహరించిన వారిని పక్కనపెడితే.. ఎక్కువ కాలం టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించి.. చెత్త కెప్టెన్లుగా కూడా కొంతమంది పేరు తెచ్చుకున్నారు. వారిలో ఓ టాప్‌ 5 కెప్టెన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

సునీల్‌ గవాస్కర్‌
ఒక ఆటగాడిగా సునీల్‌ గవాస్కర్‌ దిగ్గజ క్రికెటర్‌. ఇండియన్‌ క్రికెట్‌లో అతనో లిటిల్‌ మాస్టర్‌. అతను సాధించిన రికార్డులు ఎన్నో ఉన్నాయి. ఇండియన్‌ క్రికెట్‌లో బ్యాటర్‌గా గవాస్కర్‌ సాధించిన ఘనతల గురించి అప్పట్లో ఎంతో గొప్పగా చెప్పుకునే వారు. సచిన్‌ రాకతో గవాస్కర్‌ స్టార్‌డమ్‌ కాస్త తగ్గినా.. భారత క్రికెట్‌లో ఆటగాడికి వ్యక్తిగతంగా స్టార్‌డమ్‌ అనేది గవాస్కర్‌తోనే మొదలైంది. అయితే చాలా సార్లు గవాస్కర్‌ జట్టు కోసం కంటే కూడా తన వ్యక్తిగత రికార్డుల కోసమే ఆడేవాడనే ముద్ర ఒకటి ఆయనపై ఉంది. అలాగే గవాస్కర్‌ 1975 నుంచి 85 మధ్య కాలంలో 37 వన్డేలు, 47 టెస్టులకు టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించారు. 47 టెస్టుల్లో 9 విజయాలు, 37 వన్డేల్లో 14 విజయాలు, 21 పరాజయాలతో ఒక ఫెల్యూయిర్‌ కెప్టెన్‌గా గవాస్కర్‌ మిగిలిపోయారు.

బిషన్‌ సింగ్‌ బేడీ
భారత దిగ్గజ క్రికటెర్లలో ఒకరైన బిషన్‌ సింగ్‌ బేడీ.. 1966-78 మధ్య కాలంలో 22 టెస్టులు, 4 వన్డలేకు కెప్టెన్‌గా వ్యవహరించారు. 22 టెస్టుల్లో 6 విజయాలు, 11 ఓటములు. 4 వన్డేల్లో ఒక విజయం, 3 ఓటములతో ఈయన కూడా ఓ ఫెయిల్యూర్‌ కెప్టెన్‌గానే మిగిలిపోయారు.

అజహరుద్దీన్‌
టీమిండియా గొప్ప బ్యాటర్లలో ఒకరైన మొహమ్మద్‌ అజహరుద్దీన్‌ 1984 నుంచి 2000 సంవత్సరం వరకు టీమిండియాకు ఆడారు. అజహర్‌ కెప్టెన్సీలో టీమిండియా 47 టెస్టులు ఆడి 14 గెలిచి, 14 ఓడింది, 174 వన్డేల్లో 90 విజయాలు, 76 అజయాలు సాధించింది. ఈ గణాంకాలు చూస్తే.. అజహరుద్దీన్‌ ఫెయిల్యూర్‌ కెప్టెన్‌గా కనిపించకపోయినా.. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు ఆయనను ఓ చెత్త కెప్టెన్‌గా గుర్తుండిపోయేలా చేశాయి. కెప్టెన్‌గా విజయాలు సాధించినా.. ఫిక్సింగ్‌ కారణంగా టీమిండియాను అధమ స్థాయికి పడిపోయింది ఆయన కాలంలోనే కావడంతో ఆయనను భారత సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్లలో ఒకడిగా ఎవ్వరూ ఒప్పుకోరు.

రాహుల్‌ ద్రావిడ్‌
టీమిండియా చరిత్రలో అత్యుత్తమ బ్యాటర్ల జాబితే తీస్తే అందులో ముందు వరుసలో కచ్చితంగా ఉండే పేరు మిస్టర్‌ డిపెండబుల్‌, ది వాల్‌ రాహుల్‌ ద్రావిడ్‌ది. బ్యాటర్‌గా అత్యుత్తమ టెక్నిక్‌ ద్రావిడ్‌ సొంతం. ఎంతోమందికి ఆయన స్ఫూర్తి కానీ, ఇండియన్‌ క్రికెట్‌ ముఖచిత్రాన్ని మార్చిన కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ తర్వాత.. టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన ద్రావిడ్‌ ఓ ఫెయిల్యూర్‌ కప్టెన్‌గా మిగిలిపోయాడు. అతనిపై పెట్టుకున్న భారీ అంచనాలు కూడా ఇందుకు కారణం. ద్రావిడ్‌కు సీనియారిటీ, టెక్నికల్‌ స్కిల్స్‌, వ్యక్తిత్వం చూసి టీమిండియాకు ఒక గొప్ప కెప్టెన్‌ అవుతాడని అంతా భావించారు. కానీ, ద్రావిడ్‌ కెప్టెన్సీలో టీమిండియా ఘోర అవమానం జరిగింది. 2003 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ ఆడిన జట్టు.. 2007లో లీగ్‌ దశలో బంగ్లాదేశ్‌ చేతిలో ఓడి ఇంటి బాట పట్టింది. ఇది ఇండియన్‌ క్రికెట్‌ చరిత్రలో ఓ చీకటి ఘడియ. అయితే ఓవరాల్‌ గణాంకాల పరంగా చూస్తే ద్రావిడ్‌ రికార్డు పర్వాలేదు. 2000-07 మధ్య ద్రావిడ్‌ కెప్టెన్సీలో టీమిండియా 79 వన్డేలు ఆడితే 42 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అలాగే 25 టెస్టుల్లో 8 విజయాలు, 6 అపజయాలతో ఓకే అనిపించాడు.

హార్దిక్‌ పాండ్యా
ఇకపోతే ప్రస్తుతం టీమిండియాకు అనధికారికంగా టీ20 ఫార్మాట్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న హార్దిక్‌ పాండ్యా కూడా భారత క్రికెట్‌ చరిత్రలో ఒక ఫెయిల్యూర్‌ కెప్టెన్‌గా నిలుస్తున్నాడు. గణాంకాల పరంగా పాండ్యా రికార్డు బాగానే ఉన్నా.. ఒక కెప్టెన్‌గా అతన్ని ఫెయిల్యూర్‌గానే చూస్తున్నారు. నంబర్స్‌ కంటే కూడా కెప్టెన్‌గా జట్టుపై ఎంత ప్రభావం చూపాడనే విషయాన్ని ఇక్కడ ప్రాతిపదికగా తీసుకోవాలి. పాండ్యా కెప్టెన్సీలో టీమిండియా 16 మ్యాచ్‌లు ఆడితే 10 విజయాలు సాధించింది. అందులో ఐర్లాండ్‌, శ్రీలంక, వెస్టిండీస్‌ లాంటి దేశాలతో ఆడిన మ్యాచ్‌లే ఎక్కువ. నంబర్లను కాస్త పక్కనపెడితే.. ఆటగాళ్లను పరిస్థితులకు తగ్గట్లు ఉపయోగించుకోవడంలో పాండ్యా విఫలం అయ్యాడు. అలాగే బౌలింగ్‌ మార్పుల్లో, బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఛేంజెస్‌లో అతన్ని నిర్ణయాలన్ని బెడిసి కొడుతున్నాయి. ధోని నుంచి చాలా నేర్చుకున్నానని చెప్పే పాండ్యా.. ఆటలో మాత్రం ఏ కోసానా.. ధోనిని అనుకరించినట్లు కనిపించడు. ఏదో ఎవరూ దిక్కులేకపోతే పాండ్యాను కెప్టెన్‌గా చేసినట్లు ఉన్నారానే కానీ.. ప్రస్తుతం ఉన్న యువ టీమిండియాకు పాండ్యా సరైన కెప్టెన్‌ కాదని చాలా మంది క్రికెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: సొల్లు మాటలు ఆపండి! టీమిండియా ఓ సాధారణ జట్టు: భారత మాజీ క్రికెటర్‌