iDreamPost

భారత్ లో అతి పొడవైన గ్లాస్ వంతెన.. ఆకాశంలో నడుస్తున్నట్టే!

ప్రకృతి అందాలను చూడాలని అనుకుని వారి ఆశలకు రూపం కల్పిస్తోంది ఓ గ్లాస్ బ్రిడ్జి. కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఈ గాజు వంతెనను ప్రారంభించారు. ఇప్పుడిది దేశంలోనే పొడవైన గాజు వంతెన. మరి...

ప్రకృతి అందాలను చూడాలని అనుకుని వారి ఆశలకు రూపం కల్పిస్తోంది ఓ గ్లాస్ బ్రిడ్జి. కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఈ గాజు వంతెనను ప్రారంభించారు. ఇప్పుడిది దేశంలోనే పొడవైన గాజు వంతెన. మరి...

భారత్ లో అతి పొడవైన గ్లాస్ వంతెన.. ఆకాశంలో నడుస్తున్నట్టే!

చాలా మందికి ప్రకృతి అందాలను వీక్షించడం అంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా ఎత్తైన కొండల మధ్య గాలిలో తేలియాడుతూ, సముద్రంపై చాలా ఎత్తుల్లో ఎగురుతూ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. అలానే పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రభుత్వంలో అనేక వింత, అద్భుతమైన కట్టడాలను నిర్మిస్తుంటాయి. తాజాగా ఎత్తైన ప్రదేశం నుంచి గాల్లో తేలియాడుతూ.. ప్రకృతి అందాలను చూడాలని అనుకుని వారి ఆశలకు రూపం కల్పిస్తోంది ఓ గ్లాస్ బ్రిడ్జి. కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఈ గాజు వంతెనను ప్రారంభించారు. ఇప్పుడిది దేశంలోనే పొడవైన గాజు వంతెన. మరి… ఈ వంతెన నిర్మాణానికి అయిన ఖర్చు, ఇతర ప్రత్యేకతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలో వగమాన్ ప్రాంతంలో  గాజు వంతెనను నిర్మించారు. సముద్ర మట్టానికి 3600 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ వంతెన కోసం రూ.3 కోట్లు ఖర్చు చేశారు. కేరళ సర్కార్ పీపీపీ భాగస్వామ్యంతో ఈ గాజు వంతెనను నిర్మించింది. ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న 35 టన్నుల స్టీల్ న ఉపయోగించారు. ఇక ఈ గాజు బ్రిడ్జిపైకి వెళ్లాలంటే.. ప్రవేశ రుసుము రూ. 500 చెల్లించాలి. దీంతో పాటు స్కై వింగ్‌,  స్కై సైక్లింగ్‌, స్కై రోలర్‌, రాకెట్‌ ఇంజెక్టర్‌, జెయింట్‌ స్వింగ్‌ లాంటి అడ్వెంచర్ లాంటివి కూడా ఏర్పాటు చేశారు.

వీటి కోసం వేరే ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాక అన్నీ కలిపి ప్రత్యేక ప్యాకేజీ కూడా ఉంది. టూరిస్ట్ లకు సరికొత్త అనుభూతిని పంచేందుకు అడ్వంచర్‌ టూరిజం పార్కును ప్రారంభించామని ఆ రాష్ట్ర పర్యాటక మంత్రి పి.ఎ. మహమ్మద్‌ రియాస్‌ తెలిపారు. బుధవారం ఈ వంతెనను ప్రారంభించారు. ఇక్క మరొ విశేషం ఏమిటంటే.. భారత దేశంలోనే అతిపొడవైన గాజు వంతెన ఇదే. ఈ గాజు వంతెన పొడవు 40 మీటర్లు ఉండగా.. ఏకకాలంలో 15 మందిని మాత్రమే అనుమతిస్తారు.

గాజు పలకల ఆధారంగా రూపొందించిన ఈ వంతెన దారిలో నడిచి.. పచ్చని ప్రకృతి రమణీయతను, సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు. అలాగే పొగ మంచుతో కప్పుకున్న కొండల అందాలు మరింత ఆకర్షణీయం. ఈ గ్లాస్ బ్రిడ్జిపై నడుస్తుంటే.. ఆకాశంలో నడుస్తున్నామన్న అనుభూతి కలుగుతుందని పర్యాటకులు చెబుతున్నారు. మరి.. ఇంకేందుకు ఆలస్యం మీరు కూడా కేరళ వెళ్లే.. ఈ అనుభూతిని ఆస్వాదించండి. మరి.. ఈ గాజు వంతెన గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి