iDreamPost

ట్రెక్కింగ్ చేస్తుండగా ప్రమాదం.. స్కాట్లాండ్‌లో తెలుగు విద్యార్థులు మృతి!

విదేశాల్లో విద్యనభ్యసించి ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తూ తల్లిందండ్రులను సంతోష పెట్టేందుకు ఎంతోమంది విద్యార్థులు భావిస్తుంటారు. ఇటీవల విదేశాలకు వెళ్లిన భారతీయ విద్యార్థులు వివిధ కారణాల వల్ల కన్నుమూస్తున్నారు.

విదేశాల్లో విద్యనభ్యసించి ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తూ తల్లిందండ్రులను సంతోష పెట్టేందుకు ఎంతోమంది విద్యార్థులు భావిస్తుంటారు. ఇటీవల విదేశాలకు వెళ్లిన భారతీయ విద్యార్థులు వివిధ కారణాల వల్ల కన్నుమూస్తున్నారు.

ట్రెక్కింగ్ చేస్తుండగా ప్రమాదం.. స్కాట్లాండ్‌లో తెలుగు విద్యార్థులు మృతి!

ఇటీవల విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించిన వారు పలు కారణాల వల్ల చనిపోవడం చూస్తూనే ఉన్నాం. ఎన్నో ఆశలతో విదేశాలకు వెళ్లి ఉన్నత విద్యనభ్యసించి మంచి ఉద్యోగాలు సంపాదించాలన కనే కలలు కల్లలై పోతున్నాయి. రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలు, దుండగుల కాల్పులు ఇలా ఎన్నో కారణాల విదేశాల్లో భారత తీయులు చనిపోవడం చూస్తూనే ఉన్నాం. దీంతో వారి కుటుంబ సభ్యులు తవ్ర విషాదంలో మునిగిపోతున్నారు. ఈ ఏడాది వరుసగా ఇలాంటి ఘటనలు జరగడంతో విదేశాల్లో ఉన్న తమ పిల్లల్ల క్షేమం గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.స్కాట్లాండ్‌ విషాద సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఏపీ కి చెందిన చాణక్య బొలిశెట్టి (22), జితేంద్రనాథ్ కరటూరి (27) బ్రిటన్ లోని డుండీ యూనివర్సిలో ఎంఎస్ చదువుతున్నారు. వీరిద్దరూ తమ స్నేహితులతో కలిసి తుమ్మెల్ జలపాతం వద్దకు వెళ్లారు. అప్పటి వరకు తమ స్నేహితులతో ఎంజాయ్ చేసిన బొలిశెట్టి, జితేంద్రనాథ్ టెక్కింగ్ చేద్దామని వెళ్లారు. ఈ క్రమంలోనే ట్రెక్కింగ్ చేస్తుండగా ప్రమాద వశాత్తు నీటిలో పడిపోయారు. అది గమనించిన స్నేహితులు వెంటనే అత్యవసర సేవలకు సమాచారం అందించారు. పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది, అంబులెన్స్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. నీళ్లలో పడి పోయిన ఇద్దరు స్నేహితుల మృతదేహాలను బయటకు తీశారు.

ఈ విషాద సంఘటన గురించి ఇరువురి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో జితేంద్రనాథ్, బొలిశెట్టి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.ఇరువురి మృతదేహాలను భారత్ కి రప్పించేందుకు భారత కన్సులేట్ అధికారులను మృతుల కుటుంబ సభ్యులు కలిశారు. డుండీ విశ్వవిద్యాలయం అధికారులు కుటుంబ సభ్యులకు పూర్తి సాయం అదిస్తామన్నారు. ప్రస్తుతం బొలిశెట్టి, జితేంద్రనాథ్ మృతదేహాలను భారత్ కి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి అన్నింటా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటూ చదువుల్లో బెస్ట్ అనుకున్న తమ కుమారులు విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించి గొప్ప పొజీషన్ లో ఉంటారనుకుంటే హఠాత్తుగా కన్నుమూయడం తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. వారి ఆవేదన అందరి హృదయాలను కలచి వేస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి