iDreamPost

ఏపీ ప్రయాణికుల అలెర్ట్.. రైళ్ల కొత్త టైం టేబుల్.. వివరాలు ఇవే..!

ఏపీ ప్రయాణికుల అలెర్ట్.. రైళ్ల కొత్త టైం టేబుల్.. వివరాలు ఇవే..!

రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే డిపార్టమెంట్ అలర్ట్ చేసింది. రైళ్లు సమయం వేళల్లో మార్పులు చేశారు. రైల్వే మంత్రిత్వ శాఖ మార్పులు చేసిన రైల్వే కొత్త టైం టేబుల్ ను మంగళవారం విడుదల చేసింది. మార్పులు చేసిన రైల్వే కొత్త టైం టేబుల్ అక్టోబర్ 1న నుంచి అమల్లోకి రానుంది. 64 కొత్త వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లతో పాటుగా మరో 70 ఇతర రైళ్ల సేవలను చేర్చారు. వివిధ నగరాల మధ్య కనెక్టివిటీని పెంచడంతో పాటుగా ప్రయాణ సమయాన్ని తగ్గించేలా టైం టేబుల్‌ను రూపొందించినట్లు రైల్వేశాఖ తెలిపింది.  అదే విధంగా 90 రైళ్ల గమ్యస్థానాలను మార్చారు. అదే విదంగా 12 రైళ్లు నడిచే రోజులను కూడా పెంచారు. ఇదే సమయంలో 22 రైళ్లను సూపర్‌ఫాస్ట్‌లుగా నడుపుతున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. దీంతో రాకపోకల సమయాలను ప్రయాణికులు ముందుగా సరిచూసుకోవాలని అధికారులు సూచించారు.

రైల్వేశాఖ విడుదల చేసిన జాబితాలో ఆంధ్రప్రదేశ్ మీదుగా నడిచే రైళ్లు కూడా ఉన్నాయి. ఆ వివరాలను కూడా రైల్వేశాఖ తమ అధికారిక వెబ్‌సైట్‌లో పొందపరిచింది. గత నెలలోనే ఏపీ మీదుగా రెండు వందేభారత్ రైళ్లు కూడా ప్రారంభమైన సంగతి తెలిసిందే. అందులో కాచిగూడ-బెంగుళూరు, విజయవాడ-చెన్నై మధ్య ఆ రెండు రైళ్లు నడుస్తున్నాయి. ఆ రెండు రైళ్లను కూడా ఈ జాబితాలో చేర్చారు. ప్రయాణికులు ఈ కొత్త టైమ్ పట్టికను గమనించాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు. ఇటీవలే తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని స్టేషన్లలో కొత్తగా ఎక్స్‌ప్రెస్ రైళ్లకు స్టాపింగ్‌ కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా టైం టేబుల్‌లో కూడా వచ్చేసింది. మరి.. మారిన టైమ్ టైబుల్ వివరాలను తెలుసుకునేందుకు.. ఇక్కడ క్లిక్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి