iDreamPost

ప్రయాణికులకి APS RTC శుభవార్త! సాధారణ ఛార్జీలతోనే..

ప్రయాణికులకి APS RTC శుభవార్త! సాధారణ ఛార్జీలతోనే..

ఎంతో మంది సొంత ఊర్లను వదలి..జాబ్ ల కోసం పట్టణాల్లో వచ్చి స్థిర పడుతుంటారు. అంతేకాక సంక్రాతి, దసరా, దీపావళి వంటి పండుగలకు ఊర్లకు వెళ్తుంటారు. ఇలా పట్టణాల నుంచి గ్రామాలకు వెళ్లే వారికి ఆర్టీసీ సంస్థలు కూడా ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తుంటాయి. ముఖ్యంగా ప్రతి ఏటా దసరా పండగక సందర్భంగా ఆర్టీసీ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అలానే దసరా పండగకు ఊర్లకు వెళ్లే వారి ఆర్టీసీ శుభవార్తలు చెబుతుంది. అలానే ఈ సారి కూడా ఏపీఎస్ ఆర్టీసీ.. ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎటువంటి ప్రత్యేక ఛార్జీలు లేకుండా ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలిపారు.

దసరా  పండగ నేపథ్యంలో పట్టణాల్లో ఉండే వారు తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే బస్సులు, రైళ్లు రిజర్వేషన్లు ఫుల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఏపీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకి శుభవార్త చెప్పింది.  ప్రయాణికుల సౌకర్యార్థం దసరా పండగ సందర్భంగా ప్రత్యేకం 5,500 సర్వీసులను నడపనున్నట్లు ప్రకటిచింది. అక్టోబర్ 13 నుంచి 26వ  తేదీ వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. అంతేకాక.. ప్రత్యేక సర్వీసులకు అదనపు ఛార్జీలు ఏమి ఉండవని, సాధారణ ఛార్జీలతోనే నడపనున్నట్లు ఆర్టీసీ స్పష్టం చేసింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి అంతరాష్ట్రాల నగరాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా  ఏపీఎస్ ఆర్టీసీ ఏర్పాటు చేస్తోంది.

13 నుంచి 22దాకా ..దసరా ముందు రోజుల్లో 2,700 బస్సుల్ని, అలాగే.. పండుగ రోజులైన 23 నుంచి 26 వరకు 2,800 బస్సుల్ని నడపనున్నట్లు తెలిపింది. హైదరాబాద్ నుంచి 2,050, బెంగుళూరు నుంచి 440, చెన్నై నుంచి 153 బస్సులు వివిధ పట్టణాలకు నడపబడతాయి. అంతేకాకుండా ఆన్ లైన్ పేమెంట్స్ తో ప్రయాణికులు ఏ బాధా లేకుండా ప్రయాణించొచ్చని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ప్రయాణికులు ఫోన్ పే, గూగుల్ పే కోడ్ స్కాన్ చేయడం, క్రెడిట్, డెబిట్ కార్డుల స్వైపింగ్ ద్వారా కూడా టిక్కెట్లు తీసుకుని ప్రయాణించే వీలు అవకాశం కల్పిస్తోంది. అడ్వాన్స్ రిజర్వేషన్ తో  ఛార్జిలో 10 శాతం రాయితీ సౌకర్యము ఉంటుందని తెలిపింది. మరి.. ఏపీఎస్ ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి