iDreamPost

Postal Department: 10 పాసైతే చాలు.. పరీక్ష లేకుండానే పోస్టాఫీసులో ఉద్యోగాలు..

  • Published Apr 24, 2024 | 2:57 PMUpdated Apr 24, 2024 | 2:57 PM

మీరు పదో తరగతి పాస్ అయ్యారా.. ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నారా.. అయితే మీకో శుభవార్త. పరీక్ష లేకుండా పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం పొందే అవకాశం కల్పిస్తోంది. ఆ వివరాలు..

మీరు పదో తరగతి పాస్ అయ్యారా.. ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నారా.. అయితే మీకో శుభవార్త. పరీక్ష లేకుండా పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం పొందే అవకాశం కల్పిస్తోంది. ఆ వివరాలు..

  • Published Apr 24, 2024 | 2:57 PMUpdated Apr 24, 2024 | 2:57 PM
Postal Department: 10 పాసైతే చాలు.. పరీక్ష లేకుండానే పోస్టాఫీసులో ఉద్యోగాలు..

మంచి జీతం రావాలి.. ఉద్యోగ భద్రత ఉండాలి అనగానే అందరికి గుర్తుకు వచ్చేది గవర్నమెంట్‌ జాబే. అవును చిన్నదో పెద్దదో ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు.. లైఫ్‌ సెటిల్‌ అయిపోద్ది అని భావించే వారు ఎందరో ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగంలో ప్రారంభంలో జీతం తక్కువైనా.. సౌకర్యాలు ఎక్కువ. పోను పోను వేతనం కూడా భారీగా పెరుగుతుంది. అన్నింటికి మించి ఎప్పుడు ఎవరు ఉద్యోగం నుంచి తొలగిస్తారో అనే భయం ఉండదు. అందుకే చాలా మంది యువత ప్రభుత్వ ఉద్యోగం సంపాదించే ప్రయత్నాల్లో ఉంటారు. ఏళ్ల తరబడి కష్టపడి చదువుతుంటారు.

అయితే అందరికి గవర్నమెంట్‌ జాబ్‌ అంటే కష్టం. హార్డ్‌వర్క్‌తో పాటు కాస్తో కూస్తో లక్కు కూడా ఉండాలి. ఇక నేటి కాలంలో ప్రభుత్వ ఉద్యోగం అంటే కచ్చితంగా పరీక్షలో మెరిట్‌ సాధించాలి. అయితే ఇప్పటికి కూడా కొన్ని ప్రభుత్వ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలకు సెలక్ట్‌ చేస్తారు. ఈ తరహా జాబ్‌లు ఎక్కువగా పోస్టల్‌ శాఖలో ఉంటాయి. అలాంటి ఓ జాబ్‌ గురించే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం.

ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూసే యువతకు ఇండియన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్ శుభవార్త చెప్పింది. స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వీటి భర్తీకి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అయితే ఈ పోస్టులకు ఆఫ్‌లైన్‌లోనే అప్లై చేసుకోవాలి. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 27 స్టాఫ్ కార్ డ్రైవర్ ఖాళీలను భర్తీ చేస్తారు. అయితే ఈ ఖాళీలన్నీ కర్ణాటక ప్రాంతానికి చెందినవి. 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్‌ డేట్‌ మే 14, 2024.

నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఇండియా పోస్ట్ ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ 2024 ద్వారా మొత్తం 27 స్టాఫ్ కార్ డ్రైవర్ ఖాళీలు భర్తీ చేస్తారు. ఏ ఏరియాలో ఎన్ని పోస్టులు ఉన్నాయో చూడండి.

పోస్టుల వివరాలు

  • చిక్కోడి-1
  • కలబురగి – 1
  • హావేరి-1
  • కార్వార్ – 1
  • బీజీ ప్రధాన కార్యాలయ ప్రాంతం
  • ఎంఎంఎస్‌, బెంగళూరు – 15
  • మాండ్య – 1
  • ఎంఎంఎస్‌, మైసూర్- 3
  • పుత్తూరు-1
  • శివమొగ్గ-1
  • ఉడిపి – 1
  • కోలార్-1
  • చదువు – అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణుడై ఉండాలి.
  • ఏజ్‌ లిమిట్‌ – అప్లై చేసుకునే వ్యక్తి వయస్సు 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇందులో ఎస్సీ, ఎస్టీ బీసీ అభ్యర్థులకు ఆయా వర్గాల వారిగా రిలాక్సేషన్‌ లభిస్తుంది.
  • జీతం – ఇండియా పోస్ట్‌లో డ్రైవర్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెలా రూ.19,900 నుండి రూ.63,200 వరకు జీతం ఇవ్వబడుతుంది. దీంతో పాటు ఎంపికైన అభ్యర్థులకు ఇతర సౌకర్యాలు కూడా కల్పించనున్నారు.
  • ఎంపిక ప్రక్రియ – దరఖాస్తుదారు థియరీ టెస్ట్/డ్రైవింగ్ టెస్ట్, మోటార్ మెకానిజం టెస్ట్‌కు హాజరు కావాలి. డ్రైవింగ్ పరీక్షలో పాస్‌ అయిన అభ్యర్థులకు మాత్రమే పోస్టింగ్ ఇవ్వబడుతుంది.
  • ఎలా అప్లై చేయాలి – అభ్యర్థులు అవసరమైన అన్ని పత్రాలతో పాటు దరఖాస్తు ఫామ్‌ను నింపి స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా ఈ చిరునామాకు పంపాలి. మేనేజర్, మెయిల్ మోటార్ సర్వీస్, బెంగళూరు – 560001″. ఇతర సమాచారం కోసం, మీరు ఈ లింక్ క్లిక్ చేసి అధికారిక నోటిఫికేషన్‌ను చెక్ చేయవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి