iDreamPost
android-app
ios-app

Asia Cup: పాకిస్థాన్‌తో మ్యాచ్‌.. భారత ప్లేయింగ్‌ ఎలెవన్‌ ఇదే!

  • Published Aug 29, 2023 | 12:29 PM Updated Updated Sep 01, 2023 | 12:24 PM
  • Published Aug 29, 2023 | 12:29 PMUpdated Sep 01, 2023 | 12:24 PM
Asia Cup: పాకిస్థాన్‌తో మ్యాచ్‌.. భారత ప్లేయింగ్‌ ఎలెవన్‌ ఇదే!

మినీ వరల్డ్‌ కప్‌గా పిలువబడే ఆసియా కప్‌ 2023 ప్రారంభమైపోయింది. పాకిస్థాన్‌-నేపాల్‌ మధ్య​ ముల్తాన్‌ వేదికగా జరిగే మ్యాచ్‌తో ఆసియా కప్‌ సమరం షురువైంది. ఈ టోర్నీని పాకిస్థాన్‌-శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. అయితే… ఈ టోర్నీకే హైలెట్‌గా నిలిచే ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ శ్రీలంకలోని పల్లెకలె వేదికగా రేపు జరగనుంది. భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు ఉండే క్రేజ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. అది క్రికెట్‌ మ్యాచ్‌ మాత్రమే కాదు.. రెండు దేశాల భావోద్వేగాల మధ్య జరిగే వార్‌. ఈ మ్యాచ్‌ కోసం క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

ఈ మ్యాచ్‌ సెప్టెంబర్‌ 2న జరగనుంది. ఈ మ్యాచ్‌ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అసలు సిసలైన క్రికెట్‌ మజాను అందించేందుకు భారత్‌-పాక్‌ జట్లు సైతం సంసిద్ధంగా ఉన్నాయి. అయితే.. పాకిస్థాన్‌తో తలపడబోయే టీమిండియాలో ఆడే ఆ 11 మంది ఆటగాళ్లు ఎవరనే విషయంపై కూడా ఇండియన్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల బీసీసీఐ 18 మంది(ఒకరు స్టాండ్‌బై ప్లేయర్‌)తో కూడా ఆసియా కప్‌ స్క్వౌడ్‌ను ప్రకటించింది. రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా, హార్దిక్‌ పాండ్యా వైస్‌ కెప్టెన్‌గా పటిష్టమైన జట్టును ప్రకటించారు.

అయితే.. అందులోంచి ప్లేయింగ్‌ ఎలెవన్‌ను ఎంపిక చేయడం రోహిత్‌ శర్మకు పెద్ద తలనొప్పిగా మారింది. అయితే.. కచ్చితంగా 11 మందితోనే ఆడాలి కనుకా.. ఎంపిక చేయకతప్పదు.. ఓపెనర్లుగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు శుబ్‌మన్‌ గిల్‌ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక వన్‌ డౌన్‌లో కింగ్‌ కోహ్లీ ఉండనే ఉన్నాడు. నాలుగో స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌, వికెట్‌ కీపర్‌ కమ్‌ బ్యాటర్‌గా ఇషాన్‌ కిషన్‌ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. గాయం నుంచి పూర్తిగా కోలుకోని కేఎల్‌ రాహుల్‌ రెండు మ్యాచ్‌లకు దూరమైన విషయం తెలిసిందే. ఇక ఆరో స్థానంలో హార్డిక్‌ పాండ్యా, ఏడో స్థానంలో రవీంద్ర జడేజా ఉంటారు. ఇక బౌలింగ్‌ విభాగంలో జస్ప్రీత్‌ బుమ్రా, షమీ, సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌ బరిలోకి దిగనున్నారు. మరి పాకిస్థాన్‌తో ఈ ప్లేయింగ్‌ను దింపితే.. ఎలాంటి ఫలితం వస్తుందని మీరు భావిస్తున్నారో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

పాకిస్థాన్‌తో ఆడే భారత తుది జట్టు(అంచనా)
రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌ , హార్ధిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, బుమ్రా, సిరాజ్‌, షమీ.

ఇదీ చదవండి: జీవితంపై విరక్తి చెందిన సమయంలో యువీ అండగా నిలబడ్డాడు: రోహిత్‌ శర్మ