iDreamPost

ఉద్యోగులకు ఈ నెల 30 వరకే ఛాన్స్.. లేదంటే ఎక్కువ పన్ను చెల్లించాలి

ఉద్యోగులకు అలర్ట్. ఏప్రిల్ 30 లోపు ఈ పని చేయకపోతే అనవసరంగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా కంపెనీ యాజమాన్యానికి ఈ విషయం గురించి ఇన్ఫార్మ్ చేయాలి. లేదంటే నష్టం తప్పదు.

ఉద్యోగులకు అలర్ట్. ఏప్రిల్ 30 లోపు ఈ పని చేయకపోతే అనవసరంగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా కంపెనీ యాజమాన్యానికి ఈ విషయం గురించి ఇన్ఫార్మ్ చేయాలి. లేదంటే నష్టం తప్పదు.

ఉద్యోగులకు ఈ నెల 30 వరకే ఛాన్స్.. లేదంటే ఎక్కువ పన్ను చెల్లించాలి

2024 ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను చట్టంలో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో గత ఆర్థిక సంవత్సరంలో ఉన్న నిబంధనలే ఇప్పుడు కొనసాగుతున్నాయి. అయితే ఉద్యోగులకు ఏప్రిల్ నెల చాలా కీలకం. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటి నుంచే ట్యాక్స్ ప్లానింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ పన్ను విధానంలో కొనసాగాలి అని అనుకుంటున్నారో అనే విషయాన్ని తాము పని చేసే సంస్థ యాజమాన్యానికి చెప్పాల్సి ఉంటుంది. ఎంచుకునే పన్ను విధానం బట్టే ఎంత ట్యాక్స్ కట్ అవ్వాలి అనేది ఆధారపడి ఉంటుంది. అవగాహన లేకుండా ఏ ట్యాక్స్ విధానాన్ని పడితే దాన్ని ఎంచుకుంటే ఎక్కువ పన్ను కట్టాల్సి ఉంటుంది. దీని వల్ల అనవసరంగా డబ్బులు వృధా అవుతాయి.

ఉద్యోగులు కొనసాగించే పన్ను విధానం వల్ల వారి సేలరీపై ప్రభావం పడుతుంది. సంస్థ యాజమాన్యానికి ఈ విషయం గురించి చెప్పకపోతే బై డీఫాల్ట్ కొత్త పన్ను విధానం ఎంపిక అవుతుంది. ఈ విధానం ప్రకారమే కంపెనీ టీడీఎస్ కట్ చేసుకుంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలోని సెక్షన్ 192 కింద సెక్షన్ 115 BAC యాక్ట్ లోని సబ్ సెక్షన్ (IA) ప్రకారం కంపెనీ ఉద్యోగి ఆదాయం నుంచి టీడీఎస్ కట్ చేసుకుంటుంది. ఈ విషయంలో ఉద్యోగి తాను ఎంచుకునే పన్ను విధానం గురించి కంపెనీ యాజమాన్యానికి చెప్పకపోతే నష్టం వాటిల్లుతుంది. మామూలుగా ఉద్యోగులకు రెండు రకాల పన్ను విధానాలు ఉంటాయి. వీటి ద్వారా ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగులు తమ జీతాన్ని బట్టి ఏ పన్ను విధానం బాగుంటుంది అనేది ఎంచుకోవాల్సి ఉంటుంది. కొత్త పన్ను విధానంలో 50 వేల రూపాయల స్టాండర్డ్ డిడక్షన్ లభిస్తుంది. గతంలో పాత పన్ను విధానంలో కూడా ఈ మినహాయింపు ఉండేది.

సెక్షన్ 87 ప్రకారం.. రిఫండ్ అనేది లభిస్తుంది. పాత పన్ను విధానంలో 5 లక్షల వార్షిక ఆదాయం వరకూ రూ. 12,500 రిఫండ్ లభించేది. కొత్త పన్ను విధానంలో 7 లక్షల ఆదాయం వరకూ రూ. 25 వేలు రిఫండ్ అనేది లభిస్తుంది. అంటే పాత పన్ను విధానంలో 5 లక్షల వరకూ, కొత్త పన్ను విధానంలో 7 లక్షల వరకూ ఎలాంటి పన్ను కట్టాల్సిన అవసరం ఉండదు. కాబట్టి పాత పన్ను విధానంలో ఉండాలనుకుంటున్నారా? లేక కొత్త పన్ను విధానంలో ఉండాలనుకుంటున్నారా? అనే జీతాన్ని బట్టి కంపెనీకి తెలియజేయాలి. లేదంటే డీఫాల్ట్ గా పాత పన్ను విధానం కొనసాగుతుంది. దీని వల్ల రావాల్సిన డిస్కౌంట్ అనేది రాదు. ఉదాహరణకు మీ వార్షిక జీతం 9 లక్షలు అనుకుంటే పాత పన్ను విధానం ప్రకారం రెండున్నర లక్షల వరకూ మినహాయింపు లభిస్తుంది. అంటే ఆరున్నర లక్షలకు మాత్రమే 44,200 పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే కొత్త పన్ను విధానంలో అయితే 50 వేలు మినహాయింపు ఉంటుంది. అంటే 8.5 లక్షలకు 41,600 పన్ను పడుతుంది. కాబట్టి ఏ పన్ను విధానంలో కొనసాగితే మీకు లాభం ఉంటుందో అని ఆలోచించి కంపెనీకి తెలియజేయాలి. కాబట్టి ఉద్యోగులు ఏప్రిల్ 30 లోపు కంపెనీకి ఏ పన్ను విధానంలో కొనసాగాలనుకుంటున్నారో చెప్పాలి. 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి