iDreamPost

తన బిడ్డల కోసం పాక్ లో భారతీయ మహిళా పోరాటం! ఇది సినిమాని మించిన కథ!

Indian Woman In Pakistan: ఓ భారతీయ మహిళ పాకిస్థాన్ లో తన బిడ్డల కోసం పోరాటం చేస్తోంది. తన పిల్లలను తీసుకునే స్వదేశానికి వెళ్తానని, లేకుంటే వారి కోసమే పోరాడుతూనే ఉంటాని ఆమె తెలిపారు. సినిమాకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఆమె పోరాటం సాగుతోంది.

Indian Woman In Pakistan: ఓ భారతీయ మహిళ పాకిస్థాన్ లో తన బిడ్డల కోసం పోరాటం చేస్తోంది. తన పిల్లలను తీసుకునే స్వదేశానికి వెళ్తానని, లేకుంటే వారి కోసమే పోరాడుతూనే ఉంటాని ఆమె తెలిపారు. సినిమాకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఆమె పోరాటం సాగుతోంది.

తన బిడ్డల కోసం పాక్ లో భారతీయ మహిళా పోరాటం! ఇది సినిమాని మించిన కథ!

భూమి మీద వెలకట్టలేనిదంటూ ఉంది అంటే.. అది అమ్మ ప్రేమ మాత్రమే. బిడ్డల కోసం తల్లి ఎన్నో త్యాగాలు చేస్తుంది. వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ఎవరైన తన బిడ్డలకు ప్రమాదం తలపెట్టాలని చూస్తే.. ప్రాణాలు తీసుకునేందుకు, తీసేందుకు సైతం వెనుకాడదు. అలానే ఓ భారతీయ మహిళా తన పిల్లల కోసం పాకిస్థాన్ లో పోరాటం చేస్తుంది. ఇంతకీ ఆమె పిల్లలకు వచ్చిన కష్టం ఏమిటి?, ఆమె చేస్తున్న పోరాటం ఏమిటి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం..

భారతదేశంలోని ముంబైకి చెందిన ఫర్జానా బేగం..పాకిస్థాన్ పౌరుడిని వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఆమె తన పిల్లల సంరక్షణ కోసం పాకిస్థాన్ లో పోరాడుతోంది. తన పిల్లలకు న్యాయం జరిగే వరకు తన స్వదేశానికి వెళ్లేది లేదని ఆమె స్పష్టం చేసింది. ముంబైకి చెందిన ఫర్జానా బేగం 2015లో పాకిస్థాన్ పౌరుడు మీర్జా ముబీన్ ఇలాహీని పెళ్లాడింది. వీరి వివాహం అబుదాబిలో అతి తక్కువ మంది కుటుంబ సభ్యలు సమక్షంలో జరిగింది. ఇక వివాహ అనంతరం మూడేళ్ల పాటు అబుదాబిలో ఉన్న ఆ జంట ఆ తర్వాత ఈ జంట 2018లో పాకిస్థాన్‌కు వచ్చారు. ఈ దంపతులకు ఏడు, ఆరేళ్ల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు.

అయితే ఫర్జానా బేగంకి  భర్తతో విబేధాలు రావడంతో దూరంగా ఉంటుంది. ఇదే సమయంలో ఆమె తన భర్తపై అనేక ఆరోపణలు చేసింది. తన కొడుకులను అప్పగించే విషయంతో పాటు తన కుమారుల పేరిట ఉన్న కొన్ని ఆస్తులకు  విషయంలో తన భర్త తనను చిత్ర హింసలకు గురిచేస్తున్నట్లు ఫర్జానా ఆరోపించింది. అయితే ఫర్జానాకు తాను విడాకులు ఇచ్చినట్లు ఆమె భర్త తెలిపాడు. అయితే అతడి వాదనలను ఆమె తిరష్కరించింది.తనకు విడాకులు ఇచ్చినట్లయితే తప్పనిసరిగా కోర్టు నుంచి పొందిన విడాకుల పత్రం ఉండాలి కదా ఫర్జాన ప్రశ్నిస్తోంది.

ఆస్తి తగాదాల కారణంగా పాకిస్థాన్‌లో తనకు, తన పిల్లల ప్రాణాలకు ముప్పు ఉందని ఫర్జాన్ ఆరోపించారు. అందుకే తాను ప్రస్తుతం లాహోర్‌లోని తన ఇంట్లోనే ఉండిపోయాని ఆమె తెలిపింది. ఇక బయటకు వెళ్తే.. ప్రాణాలకు ముప్పు ఉండటంతో నరకం అనుభవిస్తున్నామని తెలిపింది.  ఈక్రమంలో తన  పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారని ఫర్జానా ఆవేదన వ్యక్తం చేసింది. ఫర్జానా బేగం మీర్జా ముబీన్ ఇలాహీకి రెండవ భార్య కావడం గమనార్హం. ఇలాహీకి ఇప్పటికే పెళ్లై.. భార్య, పిల్లలు ఉన్నారు. తనను బెదిరించి భారత్‌కు తిరిగి పంపించాలని తన భర్త కుట్ర పన్నుతున్నారని ఫర్జానా ఆరోపించింది.

తన కుమారులు లేకుండా, తనకు న్యాయం జరగకుండా స్వదేశానికి వెళ్లేది లేదని  స్పష్టం చేసింది.  ఆ ప్రతిపాదనను కూడా  ఫర్జానా నిరాకరించింది. ఈ కేసు  పరిష్కారం అయ్యే వరకు భద్రత కల్పించాలని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని ఆమె విజ్ఞప్తి చేసింది. ఇంక మరికొన్ని ఆసక్తికర విషయాలను ఫర్జాన్ వెల్లడించింది. లాహోర్ లో తన కుమారుల పేరిట కొన్ని ఆస్తులు ఉన్నాయని, అలానే తనది, తన పిల్లల పాస్‌పోర్టులు భర్త వద్ద ఉన్నాయని ఫర్జానా తెలిపింది.  మరి.. బిడ్డల కోసం పాకిస్థాన్ లో పోరాడుతున్న ఈ భారతీయ మహిళాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి