iDreamPost

డ్రైవర్ ని వరించిన అదృష్టం.. ఏకంగా రూ.34 కోట్లు!

డ్రైవర్ ని వరించిన అదృష్టం.. ఏకంగా రూ.34 కోట్లు!

ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది ధనం. అందుకే మన పెద్దవాళ్లు ధనం మూలం ఇదం జగత్ అంటారు. ప్రతిఒక్కరికీ డబ్బు సంపాదించి సుఖ సంతోషాలతో జీవించాలని ఆశ ఉంటుంది. డబ్బు సంపాదించేందుకు ఒక్కొక్కరు ఒక్కో మార్గం ఎన్నుకుంటారు. వ్యాపారం, ఉద్యోగం చేస్తూ సంపాదించడం అంటే కేవలం కలలో మాత్రమే సాధ్యం. కానీ లాటరీతో అదృష్ట లక్ష్మి ఇంటి తలుపు తడుతుంది. అందుకే చాలా మంది లాటరీ కొనుగోలు చేస్తుంటారు. లాటరీతో జాక్ పాక్ కొట్టి.. రాత్రికి రాత్రే లక్షాధికారులు, కోటీశ్వరులు అవుతుంటారు. తాజాగా అబుదాబీలో ఓ డ్రైవర్ లాటరీతో కోటీశ్వరుడయ్యాడు. వివరాల్లోకి వెళితే..

అబుదాబిలో నివసిస్తున్న ఓ ఎన్ఆర్ఐ జాక్ పాట్ కొట్టాడు. అబుదాబి బిగ్ టికెట్ రాఫెల్ లాటరీలో ఏకంగా 15 మిలియన్ దిర్హమ్ లు గెలుచుకున్నాడు. భారత కరెన్సీలో అక్షరాల రూ.34 కోట్లు. ఖతార్ లో ఉంటున్న భారతీయుడు ముజీబ్ తెక్కే మట్టియేరి ఈ అదృష్టాన్ని సొంతం చేసుకున్నాడు. ఇతడు స్వస్థలం కేరళ. సెప్టెంబర్ 27న ముజీబ్ ఆన్ లైన్ ద్వారా ఈ లాటరీ కొనుగోలు చేశాడు. సీరీస్ 256, లాటరీ టికెట్ నెం.098801 తో జాక్ పాట్ కొట్టాడు.

లాటరీ నిర్వహకులు ఈ సంతోషకరమైన విషయం అతడికి ఫోన్ ద్వారా తెలిపారు. కానీ అతను నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదని.. విజేతగా నిలిచిన విషయం అతడికి చేరే విధంగా ఇతర మార్గాల్లో ప్రయత్నిస్తున్నట్లు షో హూస్ట్ రిచర్డ్, బౌచ్ర అన్నారు. ముజీబ్ కాంటాక్ట్ కాగానే ఈ గ్రాండ్ ఫ్రైజ్ మనీ అందజేస్తామని రిచర్డ్ తెలిపారు. ముజీబ్ కి ఈ అదృష్టం వరించడంతో అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి