SNP
SNP
వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను 1-0తో నెగ్గిన రోహిత్ సేన.. గురువారం ప్రారంభమైన వన్డే సిరీస్‌ను కూడా విజయంతోనే ఆరంభించింది. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. ఇలా సంఖ్యాపరంగా చూస్తే టీమిండియా బాగానే ఆడుతున్నట్లు కనిపిస్తున్నా.. పెద్ద పెద్ద లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. విజయం వాటిని కప్పేస్తున్నా.. కాస్త పరిశీలనగా చూస్తే మాత్రం టీమిండియాలోని డొల్లతనం స్పష్టంగా అర్థమవుతోంది.
గురువారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి.. కరేబియన్ టీమ్‌ను 114 పరుగులకే ఆలౌట్ చేశారు. ఈ టార్గెట్‌ను టీమిండియా లాంటి పెద్ద టీమ్ ఎంత సులువుగా ఛేదించాలి? పైగా పసలేని విండీస్ బౌలింగ్‌లో ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ టార్గెట్. కానీ, టీమిండియా 5 వికెట్లు కోల్పోయి, వెస్టిండీస్ ఆడినన్ని ఓవర్లు ఆడి గెలిచింది. వెస్టిండీస్.. బ్యాటింగ్‌లో మరో 40, 50 పరుగులు అదనంగా చేసినా? బౌలింగ్ మరో రెండు వికెట్లు వేగంగా తీసినా.. టీమిండియాకు గెలుపు కష్టంగానే మారేది. టీమిండియా యంగ్ టీమ్ అంతా ముందుగా బ్యాటింగ్‌కు దిగడమే ఈ ఓటమిలాంటి గెలుపుకు కారణమని నిపుణులు అంటున్నారు.
చాలా కాలంగా భారత జట్టు బ్యాటింగ్‌లో ఎక్కువగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మపై ఆధారపడుతోందనే మాట వినిపిస్తున్నా.. ఈ మ్యాచ్‌తో అది వందశాతం నిజమని తెలిసొచ్చింది. కేవలం 115 పరుగుల లక్ష్యమే కదా.. ఎలాగో విండీస్ బౌలింగ్ ఎటాక్ కూడా అంత పటిష్టంగా ఏం లేదు.. వన్డే వరల్డ్ కప్ కోసం టీమ్‌ను రెడీ చేసే ప్రాసెస్‌లో ఈ మ్యాచ్‌ను వాడుకుని, యువ క్రికెటర్లకు బ్యాటింగ్ ప్రాక్టిస్ చేయిద్దామని భావించిన కెప్టెన్ రోహిత్ శర్మ.. తన ఓపెనింగ్ ప్లేస్‌ను త్యాగం చేయడమే కాకుండా, విరాట్ కోహ్లీని కూడా వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దింపకుండా మిగతా బ్యాటర్లను ముందుగా బ్యాటింగ్‌కు పంపాడు.
రోహిత్ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీతో పర్వాలేదనిపించినా.. నిలకడలేమి అతని వీక్‌నెస్. ఇక శుబ్‌మన్ గిల్(7) తన పూర్‌ఫామ్‌ను కొనసాగించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన సూర్య కుమార్‌యాదవ్(25 బంతుల్లో 19) ఒకటీ అర షాట్లు తప్పితే మంచి ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా(5), ఆల్‌రౌండర్ శార్డుల్ ఠాకూర్(1) దారుణంగా విఫలం అయ్యారు. దీంతో భారత్ 97 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పరుగులు చేయకపోయినా, బ్యాటింగ్‌కు రాకపోయినా.. టీమిండియా పరిస్థితి ఇదీ అంటూ క్రికెట్ అభిమానులు, నిపుణులు ఎద్దేవా చేస్తున్నారు.
నిజానికి పరిస్థితి అలానే ఉంది. కాస్తో కూస్తో ఆల్‌రౌండర్ జడేజా పర్వాలేదు. రోహిత్, కోహ్లీ తర్వాత మరో నమ్మదగిన ఆటగాడిగా ఉన్నాడు. మిగిలిన వాళ్లు ఎప్పుడో ఒక మ్యాచ్‌లో మెరవడం తప్పా.. నిలకడ అనే పదానికి అర్థం తెలియకుండా ఆడుతున్నారు. పైగా వెస్టిండీస్ లాంటి బలహీనంగా ఉన్న జట్టు కాబట్టి సరిపోయింది.. 97 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశలో టీమిండియా ఉండి.. ప్రత్యర్థి ఏ ఆస్ట్రేలియానో, ఇంగ్లండో అయిఉంటే.. మనకు గెలుపు కష్టమే కదా. సో.. కోహ్లీ, రోహిత్ ఆడకుంటే టీమిండియాలో బలం లేదు అనేది స్పష్టం. ఇదే టీమ్‌తో భారత్ వరల్డ్ కప్‌లో అద్భుతాలు చేస్తుందంటే నమ్మడం కష్టంగానే ఉంది. మరి ఆ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Indian cricket team is nothing without Virat Kohli and Rohit Sharma. pic.twitter.com/UNFgLvD67N
— Ansh Shah (@asmemesss) July 27, 2023
ఇదీ చదవండి: వీడియో: ఇలాంటి క్యాచ్‌లు కోహ్లీకే సాధ్యం.. సింగిల్ హ్యాండ్ గణేష్!