iDreamPost

వీళ్లను నమ్ముకుంటే.. టీమిండియా మరో వెస్టిండీస్‌ అవుతుందా?

  • Published Aug 07, 2023 | 12:20 PMUpdated Aug 07, 2023 | 1:50 PM
  • Published Aug 07, 2023 | 12:20 PMUpdated Aug 07, 2023 | 1:50 PM
వీళ్లను నమ్ముకుంటే.. టీమిండియా మరో వెస్టిండీస్‌ అవుతుందా?

ప్రస్తుతం టీమిండియా పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. వరల్డ్‌ కప్‌ ఫేవరేట్స్‌గా ఉన్న టీమ్‌.. వరల్డ్‌ కప్‌ టోర్నీకి క్వాలిఫై కానీ జట్టు చేతులో వరుసగా రెండు మ్యాచుల్లో చిత్తు చిత్తుగా ఓడింది. దీంతో టీమిండియాపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ లేకుంటే టీమిండియా బ్యాటింగ్‌ మరీ ఇంత దారుణంగా ఉంటుందా? అంటూ క్రికెట్‌ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అలాగే బుమ్రా, సిరాజ్‌, జడేజా లేకుంటే.. టీమిండియా బౌలింగ్‌ యూనిట్‌లో పసే లేదని అంటున్నారు. అయితే.. కొంత కాలం క్రితం ఐపీఎల్‌లో వీళ్ల ఆట చూసి వీళ్లే టీమిండియా భవిష్యత్తు అని, కోహ్లీ, రోహిత్‌ తర్వాత భారత క్రికెట్‌ జట్టు వీళ్ల చేతుల్లోనే ఉంటుందని ప్రతి క్రికెట్‌ అభిమాని కలలు కన్నాడు. కానీ.. ఇప్పుడు వీళ్లను చూస్తే.. టీమిండియా ఫ్యూచర్‌ వీళ్లా? అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

వీరిలో ముఖ్యంగా హార్దిక్‌ పాండ్యా, సూర్యకుమార్‌ యాదవ్‌, సంజు శాంసన్‌, శుబ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌, అర్షదీప్‌ సింగ్‌ పేర్లు బాగా వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు క్రికెట్‌ అభిమానులు.. గిల్‌ను మరో విరాట్‌ కోహ్లీ అనుకున్నారు. కానీ.. ఇప్పుడు అతను అత్యంత దారుణమైన ఫామ్‌లో ఉన్నాడు. వెస్టిండీస్‌ టూర్‌లో ఘోరంగా విఫలం అవుతున్నాడు. అతనిపై పెట్టుకున్న అంచనాలను తలకిందులు చేస్తున్నాడంటూ అభిమానులు అంటున్నారు. వెస్టిండీస్‌ టూర్‌లో రెండు టెస్టులు, మూడు వన్టేలు, రెండు టీ20లు కలుపుకుని గిల్‌.. ఎనిమిది ఇన్నింగ్స్‌లు ఆడితే, అందులో.. 6, 10, 29, 7, 34, 85, 3, 7 పరుగులు మాత్రమే చేశాడు. అందులో కేవలం ఒకే ఒక హాఫ్‌ సెంచరీ ఉంది. నాలుగు సింగిల్‌ డిజిట్‌ స్కోర్లు ఉండటం గమనార్హం.

ఇక సూర్యకుమార్‌ యాదవ్‌.. మిస్టర్‌ 360గా, వరల్డ్‌ నంబర్‌ వన్‌ టీ20 బ్యాటర్‌గా ఉన్న సూర్య తన స్థాయి తగ్గట్లు చాలా కాలం అయింది. సూర్యను వన్డేలకు కూడా ఆడిద్దామని ఎంత పుష్‌ చేస్తున్నా.. అతను దారుణం నిరాశపరుస్తున్నారు. ప్రస్తుతం సూర్య వయసు కూడా మూడు పదులు దాటేసింది. ఇలాంటి క్రికెటర్‌పై ఎక్కువగా ఆశలు పెట్టుకోవడం సరికాదు. నెక్ట్స్‌ సంజు శాంసన్‌.. టాలెంట్‌ ఉందనే తప్ప.. ఎప్పుడూ దాన్ని చూపించిన దాఖాలు లేవు. అయినా ఈ యువ క్రికెటర్‌కు భారీ క్రేజ్‌ ఉంది. ఇతనికి టీమిండియాలో అవకాశం ఇవ్వాలని భారీ డిమాండ్‌ వినిపిస్తూ ఉంటుంది. కానీ, ఛాన్స్‌ ఇచ్చిన ప్రతీసారి ఫెయిల్‌ అవుతున్నాడు. ఐపీఎల్‌లో ఆడుతున్నా జాతీయ జట్టుకు వచ్చేసరికి నిరాశపరుస్తున్నారు.

ఇక హార్దిక్‌ పాండ్యా, ఇషాన్‌ కిషన్‌లు ఏదో ఫ్లోలో ఆడుతున్నట్లు కనిపిస్తున్నారు కానీ, భవిష్యత్తులో టీమిండియా భారాన్ని భుజాన మోసేలా కనిపించడం లేదు. ఇప్పటికే పాండ్యా టీ20 కెప్టెన్‌గా ఉన్నా.. ఇలానే ఓటములు ఎదురైతే అతనిపై వేటు పడే అవకాశం ఉంది. ఇక బౌలింగ్‌లో అర్షదీప్‌ సింగ్‌ అలా మెరిసి ఇలా తుస్సు మన్నాడు. మళ్లీ ఇప్పుడు అవకాశాలు ఇస్తున్న అంచనాలను అందుకోలేకపోతున్నాడు. వీళ్లంతా.. టీమిండియా భవిష్యత్తు అని ఎవరైనా అంటే.. భారత్‌ మరో వెస్టిండీస్‌ అవుతుందని కచ్చితంగా చెప్పవచ్చు.

ఎందుకు కంటే ఇప్పుడంటే వెస్టిండీస్‌ మనపై రెండు వరుస టీ20లు గెలిచింది కానీ, నిజానికి ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో విండీస్‌ ఓ పసికూన జట్టు. కనీసం వన్డే వరల్డ్‌ కప్‌ క్వాలిఫై కాలేకపోయింది. గతమెంత ఘనం అన్న చందంగా ఉన్న వెస్టిండీస్‌ పరిస్థితి భవిష్యత్తులో టీమిండియాకు కూడా వచ్చే ప్రమాదం లేకపోలేదు. అందుకు బీసీసీఐ త్వరగా మెల్కోని.. యువ క్రికెటర్లను మరింత స్ట్రాంగ్‌ చేయాల్సి ఉంది. కేవలం ఐపీఎల్‌ మెరుపులే కాకుండా.. దేశవాళీ క్రికెట్‌ను కూడా పరిగణంలోకి తీసుకోవాలని క్రికెట్‌ అభిమానులు, నిపుణులు అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: అందరూ పాండ్యాను తిడుతున్నారు! కానీ.. అతనో గొప్ప రికార్డు సాధించాడు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి