iDreamPost

ఎవరన్నారు విరాట్-రోహిత్ శత్రువులని? ఈ వీడియో చూడండి..!

  • Author singhj Published - 11:46 AM, Wed - 13 September 23
  • Author singhj Published - 11:46 AM, Wed - 13 September 23
ఎవరన్నారు విరాట్-రోహిత్ శత్రువులని? ఈ వీడియో చూడండి..!

ఆసియా కప్​-2023లో భారత జట్టు వరుస విజయాలతో ఫైనల్​కు దూసుకెళ్లింది. స్పిన్​కు అనుకూలంగా మారిన కొలంబో పిచ్​పై టీమిండియా బ్యాటర్లకు లంకేయులు గట్టి సవాలే విసిరారు. కెప్టెన్ రోహిత్ శర్మ (53) చెలరేగి మంచి ఓపెనింగ్ అందించడంతో భారత్ 300 పైచిలుకు స్కోరు చేసేలా కనిపించింది. కానీ యువ ఆల్​రౌండర్ వెల్లలాగె, పార్ట్​టైమ్ బౌలర్ అసలంక కొలంబో పిచ్​పై అద్భుతంగా బౌలింగ్ చేశారు. వాళ్ల ధాటికి భారత్ 213 రన్స్​కే పరిమితమైంది. భారత్ ఇన్నింగ్స్ సమయంలో స్పిన్​కు పూర్తిగా అనుకూలించిన కొలంబో పిచ్​పై లంక ఇన్నింగ్స్​లో మంచి టర్న్, బౌన్స్ కనిపించింది. అయితే రోహిత్ శర్మ మాత్రం పేసు గుర్రం జస్​ప్రీత్ బుమ్రా (2/30), మహ్మద్ సిరాజ్​ (1/17)తోనే బౌలింగ్ మొదలుపెట్టాడు. ఇది బాగా వర్కౌట్ అయింది.

మొదటి ముగ్గురు లంక బ్యాట్స్​మెన్​ను బుమ్రా, సిరాజ్ వెనక్కి పంపారు. అయితే లంక అంత తేలిగ్గా వదల్లేదు. బౌలింగ్​లో తన మ్యాజిక్ చూపించిన వెల్లలాగే (42 నాటౌట్) బ్యాటింగ్​లోనూ సత్తా చాటాడు. అతడితో పాటు ధనంజయ డిసిల్వా (41) కూడా రాణించడంతో మ్యాచ్​ లంక వైపు మొగ్గుతున్నట్లు కనిపించింది. కానీ కీలక సమయంలో గత మ్యాచ్ హీరో కుల్దీప్ యాదవ్ (4/43)​తో పాటు జడేజా (2/33) కూడా విజృంభించడంతో విజయం భారత్ సొంతమైంది. పాకిస్థాన్​తో మ్యాచ్ రెండ్రోజులు కొనసాగడంతో లంకతో మ్యాచ్​లో భారత ప్లేయర్లు కాస్త అలిసిపోయినట్లుగా కనిపించారు. బ్యాటింగ్​లో త్వరగా ఆలౌట్ అవడంతో వారిలో నిరాశ కూడా కనిపించింది. కానీ బుమ్రా, సిరాజ్, కుల్దీప్, జడేజా, హార్దిక్.. ఇలా బౌలర్లందరూ చెలరేగడంతో భారత జట్టు ఆటగాళ్లు జోష్​గా కనిపించారు.

ఒక్కో వికెట్ పడుతూ విజయానికి దగ్గరైన సమయంలో భారత ప్లేయర్లందరిలో ఉద్వేగం కనిపించింది. ఇదే క్రమంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రవీంద్ర జడేజా బౌలింగ్​లో షనక ఇచ్చిన క్యాచ్​ను స్లిప్​లో ఉన్న రోహిత్​ అద్భుతంగా డైవ్ చేసి పట్టుకున్నాడు. దీంతో సంతోషం పట్టలేక కోహ్లీ వచ్చి హిట్​మ్యాన్​ను హగ్ చేసుకున్నాడు. విరాట్-రోహిత్​కు పడదని చాలా మంది అనుకుంటారు. వీళ్లు శత్రువులనే భావన చాలా మందిలో ఉంది. కానీ లంకతో మ్యాచ్​లో రోహిత్-కోహ్లీలు హగ్ చేసుకోవడం, కలసి సెలబ్రేట్ చేసుకోవడం, హిట్​మ్యాన్​కు విరాట్ సూచనలు ఇవ్వడం చూస్తే వీళ్ల మధ్య బంధం ఎంత బలంగా ఉందో అర్థమవుతుందని చెప్పొచ్చు. లంకతో మ్యాచ్​లో వీళ్లిద్దరి మధ్య మ్యాజికల్ మూమెంట్స్​కు హేటర్స్ కుళ్లుకోక తప్పదని ఫ్యాన్స్ అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి