iDreamPost
android-app
ios-app

Suryakumar Yadav: వీడియో: పేసర్ అర్ష్​దీప్​కు వార్నింగ్ ఇచ్చిన సూర్యకుమార్.. వేలు చూపిస్తూ..!

  • Published Dec 16, 2023 | 9:46 AM Updated Updated Dec 16, 2023 | 9:46 AM

టీమిండియా తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. బ్యాటింగ్, ఫీల్డింగ్ టైమ్​లో కూల్​గా కనిపించే మిస్టర్ 360.. పేసర్ అర్ష్​దీప్​ మీద సీరియస్ అయ్యాడు.

టీమిండియా తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. బ్యాటింగ్, ఫీల్డింగ్ టైమ్​లో కూల్​గా కనిపించే మిస్టర్ 360.. పేసర్ అర్ష్​దీప్​ మీద సీరియస్ అయ్యాడు.

  • Published Dec 16, 2023 | 9:46 AMUpdated Dec 16, 2023 | 9:46 AM
Suryakumar Yadav: వీడియో: పేసర్ అర్ష్​దీప్​కు వార్నింగ్ ఇచ్చిన సూర్యకుమార్.. వేలు చూపిస్తూ..!

సఫారీ టూర్​ను టీమిండియా పాజిటివ్​గా స్టార్ట్ చేసింది. ఈ పర్యటనలో భాగంగా మొదట జరిగిన మూడు టీ20ల సిరీస్​ను భారత్ 1-1తో సమం చేసింది. వర్షం కారణంగా ఫస్ట్ మ్యాచ్ రద్దవగా.. రెండో టీ20లో విజయం సౌతాఫ్రికానే వరించింది. దీంతో ఆఖరి మ్యాచ్​లో ఎట్టి పరిస్థితుల్లోనూ నెగ్గాల్సిన సిచ్యువేషన్​లో చెలరేగి ఆడింది భారత్. అన్ని విభాగాల్లోనూ అద్భుతంగా ఆడిన మన జట్టు ప్రొటీస్​ను 106 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది. వన్డే, టెస్ట్ సిరీస్​కు ముందు ఈ విక్టరీ భారత్ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుందనే చెప్పాలి. ఈ మ్యాచ్​లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సూపర్బ్ సెంచరీ (56 బంతుల్లో 100)తో ఆకట్టుకున్నాడు. అతడి నాక్ వల్లే టీమ్ భారీ విజయం సాధించింది. అయితే జట్టును గెలిపించిన సూర్య భాయ్.. యువ పేసర్ అర్ష్​దీప్ సింగ్ మీద సీరియస్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది.

సౌతాఫ్రికాతో చివరి టీ20 మ్యాచ్ ముగిసిన తర్వాత భారత జట్టు క్రికెటర్లు హోటల్​కు బయల్దేరారు. అయితే వాళ్లు ప్రయాణిస్తున్న బస్సులో బౌలర్ అర్ష్​దీప్ సింగ్​కు సూర్యకుమార్ యాదవ్ వార్నింగ్ ఇస్తూ కనిపించాడు. యంగ్ పేసర్​కు తన వేలిని చూపిస్తూ మిస్టర్ 360 గట్టిగా హెచ్చరించడం కనిపించింది. ఎప్పుడూ కూల్​గా ఉండే సూర్యకుమార్ హఠాత్తుగా ఇలా ఎందుకు సీరియస్ అయ్యాడనేది అర్థం కావడం లేదు. భారత కెప్టెన్ కోపానికి కారణం ఏంటనే వివరాలు తెలియాల్సి ఉంది. అర్ష్​దీప్​కు సూర్య వార్నింగ్ ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. టీమ్​లో ఏదైనా గొడవ అయిందా? లేదా అర్ష్​దీప్​ ఏదైనా సరదా ప​ని చేయడం వల్లే సూర్య ఇంత సీరియస్​గా రియాక్ట్ అయ్యాడా? అనే దాని మీద క్లారిటీ రావాల్సి ఉంది.

అర్ష్​దీప్​ పైనే కాదు.. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ టైమ్​లోనూ సూర్యకుమార్ కోపంగా కనిపించాడు. రవీంద్ర జడేజా బౌలింగ్​లో డేవిడ్ మిల్లర్ బ్యాట్ ఎడ్జ్​కు తగిలిన బంతిని కీపర్ పట్టుకున్నాడు. దీంతో మిల్లర్ ఔట్ అంటూ జడ్డూతో పాటు కీపర్ జితేష్ అప్పీల్ చేశారు. కానీ అంపైర్ ఔట్ ఇవ్వలేదు. డీఆర్ఎస్ తీసుకుందామంటే టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆ ఛాన్స్ కూడా లేకపోయింది. దీంతో డగౌట్​లో కూర్చున్న సూర్యకుమార్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. అసలు ఏం జరుగుతోందంటూ సీ​రియస్ అయ్యాడు. ఈ విషయంలో భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా సౌతాఫ్రికా బోర్డు మీద అసహనం వ్యక్తం చేశాడు. ఏదేమైనా అటు గ్రౌండ్​లో సీరియస్ అయిన సూర్య.. మ్యాచ్ తర్వాత అర్ష్​దీప్​కు వార్నింగ్ ఇస్తూ కనిపించడం చర్చనీయాంశంగా మారింది. మిస్టర్ 360 కోపానికి కారణం ఏంటో త్వరలో తెలుస్తుందేమో చూడాలి. మరి.. అర్ష్​దీప్​కు సూర్య వార్నింగ్ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Team India: టీ20ల్లో అతడు అవసరమా? యంగ్​స్టర్స్​కు ఛాన్స్ ఇవ్వాలంటున్న ఫ్యాన్స్!