Nidhan
సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌ను గెలుచుకునేందుకు టీమిండియాకు ఇదే కరెక్ట్ ఛాన్స్. ఇవాళ నెగ్గితే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ భారత్ సొంతం అవుతుంది. ఈ నేపథ్యంలో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..
సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌ను గెలుచుకునేందుకు టీమిండియాకు ఇదే కరెక్ట్ ఛాన్స్. ఇవాళ నెగ్గితే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ భారత్ సొంతం అవుతుంది. ఈ నేపథ్యంలో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..
Nidhan
సఫారీ టూర్లో తొలి సిరీస్‌ను అందుకోవాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. మూడు టీ20ల సిరీస్‌లో తొలుత వెనుకబడినా ఆ తర్వాత పుంజుకొని 1-1తో సమం చేసింది. వన్డే సిరీస్‌ను కూడా గ్రాండ్‌గా స్టార్ట్ చేసింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన మొదటి మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో నెగ్గింది. మరో 200 బంతులు మిగిలి ఉండగానే సౌతాఫ్రికా నిర్దేశించిన టార్గెట్‌ను అందుకొని ఘనవిజయాన్ని నమోదు చేసింది. కీలకమైన రెండో వన్డే మంగళవారం జరగనుంది. మరో మ్యాచ్ ఉన్నప్పటికీ రెండో వన్డేలోనే సౌతాఫ్రికాను మట్టికరింపి సిరీస్‌ను పట్టేయాలని భారత్ అనుకుంటోంది. ఈ నేపథ్యంలో అసలు ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం.. రెండో వన్డేలో భారత్ మూడు మార్పులతో బరిలోకి దిగడం ఖాయంలా కనిపిస్తోంది.
వన్డే సిరీస్‌లోని మిగిలిన మ్యాచులకు స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ దూరం అయ్యాడు. టెస్ట్ సిరీస్‌కు రెడీ అయ్యేందుకు అతడు టీమ్‌ను వీడాడు. దీంతో అతడి ప్లేసులో ఈ మ్యాచ్‌లో నయా ఫినిషర్ రింకూ సింగ్ లేదా డొమెస్టిక్ క్రికెట్లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన రజత్ పటీదార్ల్లో ఒకరికి అవకాశం దక్కనుంది. టీ20ల్లో అదరగొడుతున్న రింకూకు ప్లేయింగ్ ఎలెవన్‌లో వచ్చే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. అయితే ప్రతి స్థానానికి బ్యాకప్‌ను రెడీ చేసుకోవాలనే ఉద్దేశంలో టీమిండియా ఉంది. ఈ నేపథ్యంలో అయ్యర్ నాలుగో స్థానంలో ఆడతాడు కాబట్టి అతడి ప్లేసులో పటీదార్‌ను బరిలోకి దించొచ్చు. ఒకవేళ రజత్, రింకూ ఇద్దర్నీ ఆడించాలంటే మాత్రం తిలక్ వర్మను తప్పించాల్సి ఉంటుంది. పేస్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు.. కాబట్టి ఆ యూనిట్ విషయంలో మార్పులు ఉండకపోవచ్చు. కానీ స్పిన్ విభాగంలో రెండు ఛేంజ్ చేయడం పక్కాగా కనిపిస్తోంది. టీ20 సిరీస్‌తో పాటు మొదటి వన్డేలో కూడా ఆడిన కుల్దీప్ యాదవ్‌ను తప్పించి అతడి స్థానంలో యుజ్వేంద్ర చాహల్‌ను టీమ్‌లోకి తీసుకురావొచ్చు.
చాహల్‌ను వన్డే సిరీస్‌కు మాత్రమే సెలక్ట్ చేశారు. కాబట్టి అతడ్ని ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే తిలక్ వర్మ స్థానంలో స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు ఛాన్స్ ఇవ్వొచ్చు. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లోనూ అతడికి జట్టులో చోటు దక్కలేదు. కాబట్టి ఈ మ్యాచ్‌లో అతడ్ని బరిలోకి దింపే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక, గతేడాది సఫారీ టూర్లో వన్డే సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా నెగ్గలేదు టీమిండియా. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్ లాంటి స్టార్లు టీమ్‌లో ఉన్నా గెలుపు రుచి చూడలేకపోయింది భారత్. అప్పుడు కూడా రాహులే కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే ఈసారి మాత్రం జట్టులో అంతా యంగ్‌స్టర్స్ ఉన్నా ఆల్‌రౌండ్ పెర్ఫార్మెన్స్తో ఫస్ట్ మ్యాచ్‌లో సౌతాఫ్రికాకు షాక్ ఇచ్చింది భారత్. ఇదే ఊపులో రెండో మ్యాచ్‌లోనూ నెగ్గి సిరీస్‌ను ఎగరేసుకుపోవాలని చూస్తోంది. మరి.. ఈ మ్యాచ్‌లో భారత జట్టులో ఇంకేమైనా మార్పులు జరుగుతాయని మీరు భావిస్తే కామెంట్ల రూపంలో తెలియజేయండి.
రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, సంజూ శాంసన్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), రింకూ సింగ్/రజత్ పాటిదార్, తిలక్ వర్మ/ వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, ముకేశ్ కుమార్, అవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్/యుజ్వేంద్ర చాహల్.
ఇదీ చదవండి: IPL 2024: ఐపీఎల్ షెడ్యూల్‌పై కీలక అప్డేట్.. నెక్స్ట్ సీజన్ ఎప్పుడు మొదలవుతుందంటే..?