iDreamPost

IND vs SA: టీమిండియా ఫ్యాన్స్​కు బ్యాడ్ న్యూస్.. ఫస్ట్ టీ20 జరగడం కష్టమే..!

  • Author singhj Updated - 08:32 PM, Sat - 9 December 23

టీమిండియా-సౌతాఫ్రికా మధ్య టీ20 సిరీస్​కు అంతా రెడీ అయింది. డర్బన్ వేదికగా డిసెంబర్ 10న ఫస్ట్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్​ జరగడం కష్టంగానే ఉంది.

టీమిండియా-సౌతాఫ్రికా మధ్య టీ20 సిరీస్​కు అంతా రెడీ అయింది. డర్బన్ వేదికగా డిసెంబర్ 10న ఫస్ట్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్​ జరగడం కష్టంగానే ఉంది.

  • Author singhj Updated - 08:32 PM, Sat - 9 December 23
IND vs SA: టీమిండియా ఫ్యాన్స్​కు బ్యాడ్ న్యూస్.. ఫస్ట్ టీ20 జరగడం కష్టమే..!

సౌతాఫ్రికా టూర్​కు అంతా రెడీ అయిపోయింది. సఫారీ గడ్డ మీద ఇప్పటికే ల్యాండ్ అయిపోయిన టీమిండియా ప్రాక్టీస్​లో మునిగిపోయింది. మూడు టీ20లు, మూడు వన్డేలతో పాటు రెండు టెస్టులు ఆడేందుకు సిద్ధమైపోయింది. సౌతాఫ్రికాను వాళ్ల దేశంలో ఓడించడం అంత ఈజీ కాదు. గత చరిత్ర కూడా అపోజిషన్ టీమ్​కే అనుకూలంగా ఉంది. వన్డే ఫార్మాట్​లో సౌతాఫ్రికాను సౌతాఫ్రికాలో భారత్ కేవలం ఒక్కసారే ఓడించింది. 2018లో జరిగిన ఆరు వన్డేల సిరీస్​లో ప్రొటీస్​ను 5-1 తేడాతో భారత్ చిత్తు చేసింది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని టీమ్ అన్ని విభాగాల్లోనూ రాణించి ప్రత్యర్థి జట్టును దాని సొంత గడ్డ మీదే చిత్తు చేసింది. టీ20ల్లోనూ మన టీమ్ పలుమార్లు ఆధిపత్యం చూపించింది.

2018లోనే సఫారీలతో మూడు మ్యాచుల సిరీస్​ను భారత్ 2-1 తేడాతో సొంతం చేసుకుంది. అంతకంటే ముందు 2006, 2011లో జరిగిన ఏకైక టీ20లో టీమిండియాదే పైచేయి అయింది. అయితే 2012లో జరిగిన ఒక టీ20లో మాత్రం మన టీమ్ ఓడిపోయింది. ఇక, సౌతాఫ్రికాలో టెస్ట్ సిరీస్ విక్టరీ అనేది భారత్​ను చాన్నాళ్లుగా ఊరిస్తూ వస్తోంది. ఇప్పటిదాకా సఫారీ గడ్డ మీద టీమిండియా 8 టెస్ట్ సిరీస్​లు ఆడింది. కానీ అందులో ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయింది. 2010-11లో మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో సిరీస్ గెలిచేందుకు టీమ్​కు మంచి ఛాన్స్ వచ్చింది. కానీ ఆఖరి టెస్టు డ్రా కావడంతో మూడు మ్యాచుల సిరీస్​ను టీమిండియా 1-1తో ముగించింది. ఈసారి కూడా ప్రొటీస్​తో భారత్​కు కఠిన పరీక్ష తప్పదు. మూడు ఫార్మాట్లలోనూ ఆ జట్టు పటిష్టంగా ఉంది. పలువురు విధ్వంసక ప్లేయర్లు, లోయరార్డర్ వరకు బ్యాటింగ్ చేసే సత్తా ఆ టీమ్​కు ఉంది. ముఖ్యంగా వన్డేల్లో సౌతాఫ్రికా దూకుడు మామూలుగా లేదు.

రెగ్యులర్ కెప్టెన్ అయిన తెంబా బవుమా రెస్ట్ తీసుకోవడంతో టీ20 కెప్టెన్ మార్​క్రమ్ వన్డేలకూ సారథిగా వ్యవహరించనునాడు. రీజా హెండ్రిక్స్, క్లాసెన్, స్టబ్స్, మిల్లర్, యాన్సన్, ఫెలుక్వాయో, కొయెట్జీ, కేశవ్ మహారాజ్, షంసీ లాంటి వారితో టీ20ల్లో పటిష్టంగా ఉంది సౌతాఫ్రికా. అయితే రీసెంట్​గా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్​ను 4-1 తేడాతో నెగ్గిన యంగ్ ఇండియా ఫుల్ జోష్​లో ఉంది. ఈ సిరీస్​లోనూ సత్తా చాటాలని యువ ఆటగాళ్లు అనుకుంటున్నారు. దీంతో టీ20 సిరీస్​ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. అయితే డర్బన్ వేదికగా జరగాల్సిన ఫస్ట్ టీ20కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఆదివారం షెడ్యూల్ చేసిన ఈ మ్యాచ్ జరగడం కష్టమేనని అంటున్నారు. మ్యాచ్ రోజు డర్బన్‌లో వాన కురుస్తుందని అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 10వ తేదీన ఈ ప్రాంతంలో వర్షం కురిసే ఛాన్స్ 45 శాతం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ వాన వల్ల మ్యాచ్ జరగకపోతే మాత్రం ఇరు టీమ్స్ ఫ్యాన్స్​కు ఇది నిరాశ కలిగించే విషయమే. మరి.. టీమిండియా-ప్రొటీస్ ఫైట్ కోసం మీరెంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: MS Dhoni: టీమ్​లోకి రావాలంటే 20 కిలోలు తగ్గాల్సిందే.. ధోని రూల్​కు షాకైన ఆఫ్ఘాన్ క్రికెటర్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి