iDreamPost

Team India: సౌతాఫ్రికాతో వన్డే సిరీస్​కు ముందు భారత్​కు బిగ్ షాక్.. ఆ ఇద్దరూ కూడా..!

  • Published Dec 16, 2023 | 1:05 PMUpdated Dec 16, 2023 | 1:05 PM

సౌతాఫ్రికాతో జరిగిన మూడు టీ20ల సిరీస్​ను సమం చేసి జోష్​లో ఉన్న టీమిండియాకు భారీ షాక్ తగిలింది. వన్డే, టెస్ట్ సిరీస్​లకు ముందు ఇది భారత్​కు గట్టి ఎదురుదెబ్బే అని చెప్పాలి.

సౌతాఫ్రికాతో జరిగిన మూడు టీ20ల సిరీస్​ను సమం చేసి జోష్​లో ఉన్న టీమిండియాకు భారీ షాక్ తగిలింది. వన్డే, టెస్ట్ సిరీస్​లకు ముందు ఇది భారత్​కు గట్టి ఎదురుదెబ్బే అని చెప్పాలి.

  • Published Dec 16, 2023 | 1:05 PMUpdated Dec 16, 2023 | 1:05 PM
Team India: సౌతాఫ్రికాతో వన్డే సిరీస్​కు ముందు భారత్​కు బిగ్ షాక్.. ఆ ఇద్దరూ కూడా..!

సౌతాఫ్రికా టూర్​ను పాజిటివ్​గా స్టార్ట్ చేసింది టీమిండియా. ప్రొటీస్​తో మూడు టీ20ల సిరీస్​ను 1-1తో సమం చేసి మంచి జోష్​లో ఉంది. మొదటి మ్యాచ్ వాన వల్ల రద్దవగా.. రెండో మ్యాచ్​లో పోరాడి ఓడింది భారత్. తప్పక నెగ్గాల్సిన ఆఖరి టీ20లో ఆతిథ్య టీమ్​ను 106 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ కలిగిన సౌతాఫ్రికాను కేవలం 95 రన్స్​కే ఆలౌట్ చేసింది. ఈ మ్యాచ్​లో విజయంతో ఊపు మీదున్న భారత్.. తుదపరి జరిగే మూడు వన్డేల సిరీస్​కు సన్నద్ధం అవుతోంది. ఈ రెండు టీమ్స్ మధ్య డిసెంబర్ 17 నుంచి వన్డే సిరీస్ మొదలు కానుంది. ఆ తర్వాత రెండు టెస్టు మ్యాచ్​లు కూడా జరగనున్నాయి. అయితే వన్డే, టెస్ట్ సిరీస్​కు ముందు భారత జట్టుకు గట్టి షాక్ తగిలింది. ఇద్దరు స్టార్ ప్లేయర్లు టీమ్​కు దూరమయ్యారు.

ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్​లో దుమ్మురేపిన వెటరన్ పేసర్ మహ్మద్ షమి సౌతాఫ్రికాతో టెస్టులకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని భారత క్రికెట్ బోర్డు శనివారం అధికారికంగా ధృవీకరించింది. మోకాలి గాయంతో ఇబ్బంది పడుతున్న షమి ఫిట్​నెస్​ మీద టీమ్ ఇంకా క్లియరెన్స్ ఇవ్వలేదని.. అందుకే అతడు సౌతాఫ్రికాకు వెళ్లడం లేదని ఓ ప్రకటనలో బీసీసీఐ వెల్లడించింది. షమీతో పాటు యంగ్ పేసర్ దీపక్ చాహర్ కూడా టీమ్​కు దూరమయ్యాడు. ప్రొటీస్​తో జరగనున్న వన్డే సిరీస్​ నుంచి అతడు తప్పుకున్నాడు. పర్సనల్ రీజన్స్ వల్ల సఫారీ టూర్​కు దూరంగా ఉండాలని చాహర్ డిసైడ్ అయ్యాడు. దీంతో అతడి స్థానంలో బెంగాల్ పేసర్ ఆకాశ్​ దీప్​ను సౌతాఫ్రికాకు పంపాలని బీసీసీఐ నిర్ణయించుకుంది. దీపక్ చాహర్ తండ్రి ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో ట్రీట్​మెంట్ తీసుకుంటున్నాడు. దీంతో అతడ్ని దగ్గర ఉండి చూసుకుంటున్న చాహర్.. వన్డే సిరీస్​ నుంచి వైదొలిగాడు.

వన్డే సిరీస్ మొదలయ్యే లోపు తన నాన్న కోలుకుంటే సౌతాఫ్రికాకు వెళ్లాలని చాహర్ అనుకున్నాడు. కానీ కుదరకపోవడంతో ఈ సిరీస్ నుంచి తప్పకున్నాడు. మోకాలి నొప్పితో బాధపడుతున్న షమి కూడా ఇటీవలే ముంబైలో ట్రీట్​మెంట్ తీసుకున్నాడు. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. టెస్ట్ సిరీస్​ స్టార్ట్ అయ్యే లోపు ఊరటగా అనిపిస్తే సౌతాఫ్రికాకు వెళ్లాలని అతడు అనుకున్నాడు. కానీ గాయం పూర్తిగా మానకపోవడంతో ఆగిపోయాడు. ఇది టీమిండియాకు బిగ్ షాక్ అనే చెప్పాలి. సౌతాఫ్రికాను వాళ్ల సొంత గడ్డ మీద టెస్టుల్లో ఆడించాలంటే షమి లాంటి ఎక్స్​పీరియెన్స్ ఉన్న బౌలర్ చాలా అసవరం. కానీ గాయం వల్ల అతడు అందుబాటులో లేకపోవడంతో ఈ లోటును భారత్ ఎలా భర్తీ చేస్తుందో చూడాలి. మరి.. షమి లేకపోయినా సఫారీలను టెస్టుల్లో టీమిండియా మట్టికరిపిస్తుందని మీరు భావిస్తున్నారా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Hardik Pandya: హార్దిక్​ను కెప్టెన్ చేయడంతో ముంబైకి షాకిచ్చిన ఫ్యాన్స్.. ఇది అస్సలు ఊహించి ఉండరు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి