iDreamPost

IPL 2024 Auction: పాపం ప్రీతి జింటా! ఒకరికి బదులు ఇంకొకరిని కొనేసింది

IPL 2024 ఆక్షన్ లో ఓ కన్ఫ్యూజన్ సీన్ జరిగింది. ఒక ఆటగాడిని కొనుగోలు చేయబోయి.. మరో ప్లేయర్ ను కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్ యాజమాన్యం. ఆ వివరాల్లోకి వెళితే..

IPL 2024 ఆక్షన్ లో ఓ కన్ఫ్యూజన్ సీన్ జరిగింది. ఒక ఆటగాడిని కొనుగోలు చేయబోయి.. మరో ప్లేయర్ ను కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్ యాజమాన్యం. ఆ వివరాల్లోకి వెళితే..

IPL 2024 Auction: పాపం ప్రీతి జింటా! ఒకరికి బదులు ఇంకొకరిని కొనేసింది

ఐపీఎల్ 2024 వేలంలో సరికొత్త రికార్డులతో పాటు కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్ లు కూడా జరిగాయి. అవి కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఇక ఈ వేలంలో ప్లేయర్లు రికార్డు ధరలు సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఆసీస్ స్టార్ ప్లేయర్లపై కాసుల వర్షం కురిపించాయి ఫ్రాంచైజీలు. కంగారూ టీమ్ ప్లేయర్లు అయిన మిచెల్ స్టార్క్ ను ఏకంగా రూ.24.75 కోట్లకు దక్కించుకుంది కోల్ కత్తా నైట్ రైడర్స్ యాజమాన్యం. ఆ తర్వాత రెండో అత్యధిక ధరతో ప్యాట్ కమ్మిన్స్ ను రూ.20.50 కోట్లకు కొనుగోలు చేసుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్. అయితే ఈ ఆక్షన్ లో ఓ కన్ఫ్యూజన్ సీన్ జరిగింది. ఒక ఆటగాడిని కొనుగోలు చేయబోయి.. మరో ప్లేయర్ ను కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్ యాజమాన్యం. ఆ వివరాల్లోకి వెళితే..

ఐపీఎల్ 2024 వేలంలో పంజాబ్ కింగ్స్ కో-ఓనర్ ప్రతీ జింటా ఓ తప్పు చేసింది. ఈ పొరపాటు కారణంగా తాము అనుకున్న ప్లేయర్ ను కొనబోయి.. తికమకపడి మరో ప్లేయర్ ను కొనుగోలు చేసింది. అయితే ఆ వెంటనే తప్పును తెలుసుకుని సరిదిద్దుకునే ప్రయత్నం చేసింది. కానీ అంతలోపే టైమ్ అయిపోవడంతో, చేసేది ఏమీలేకపోయింది. ఇంతకీ ఏం జరిగిందంటే? తాజాగా జరిగిన ఐపీఎల్ 2024 వేలంలో ఛత్తీస్ ఘడ్ కు చెందిన 32 ఏళ్ల ఆల్ రౌండర్ శశాంక్ సింగ్ పేరు వేలానికి వచ్చింది. ఈ క్రమంలోనే పంజాబ్ కింగ్స్ ఓనర్స్ ప్రీతి జింటా, నెస్ వాడియాలతో కూడిన మేనేజ్ మెంట్ అతడిని రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది.

ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. తాము కొనాలనుకుంది మరో శశాంక్ సింగ్ ను, కానీ కొన్నది వేరే శశాంక్ ను. ఇతడి కోసం మరే ఇతర ఫ్రాంచైజీలు పోటీ పడలేదు. అయితే తమ తప్పు తెలుసుకున్న పంజాబ్ యాజమాన్యం దాన్ని సరిదిద్దుకున్నామని అనుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ సమయంలో పంజాబ్ కో ఓనర్ పడ్డ ఆందోళన నెట్టింట వైరల్ గా మారింది. కాగా.. పంజాబ్ సొంతం చేసుకున్న శశాంక్ సింగ్ ట్రాక్ రికార్డు మరీ అంత తక్కువేం లేదు. అతడు 55 టీ20ల్లో 724 రన్స్ చేయడమే కాకుండా.. 15 వికెట్లు కూడా పడగొట్టాడు. ఇక ఇలాంటి తప్పునే చేయబోయింది ఢిల్లీ క్యాపిటల్స్. ఒక ప్లేయర్ అని మరో ప్లేయర్ ని కొనుగోలు చేయబోయి, తప్పు తెలుసుకుని ఆగిపోయింది. మరి ప్రీతి జింటా చేసిన పొరపాటుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి