iDreamPost

Gautam Gambhir: పాక్ గాలి తీసేసిన గంభీర్.. ఒకవేళ టీమిండియాను ఓడిస్తే అంటూ..!

  • Published Jan 01, 2024 | 2:57 PMUpdated Jan 01, 2024 | 2:57 PM

ఎప్పుడూ కాంట్రవర్సీల్లో ఉండే టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ మరోమారు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. దాయాది పాకిస్థాన్ గాలి తీసేశాడు.

ఎప్పుడూ కాంట్రవర్సీల్లో ఉండే టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ మరోమారు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. దాయాది పాకిస్థాన్ గాలి తీసేశాడు.

  • Published Jan 01, 2024 | 2:57 PMUpdated Jan 01, 2024 | 2:57 PM
Gautam Gambhir: పాక్ గాలి తీసేసిన గంభీర్.. ఒకవేళ టీమిండియాను ఓడిస్తే అంటూ..!

ఏ గేమ్​లోనైనా కొన్ని టీమ్స్ తలపడుతుంటే చూడాలని ప్రేక్షకులు, అభిమానులు కోరుకుంటారు. క్రికెట్​లోనూ ఇది కామనే. ఆస్ట్రేలియా-ఇంగ్లండ్, ఆస్ట్రేలియా-న్యూజిలాండ్, సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్​లు చూసేందుకు ఆడియెన్స్ ఎక్కువ ఉత్సాహం చూపిస్తారు. ఆసీస్-ఇంగ్లీష్ టీమ్ నడుమ జరిగే యాషెస్ సిరీస్​ కోసం ఇరు జట్ల ఫ్యాన్స్​తో పాటు క్రికెట్ లవర్స్ అంతా ఎదురు చూస్తారు. కానీ వీటన్నింటి కంటే క్రికెట్​లో అసలైన పోరాటమేంటే అది భారత్-పాకిస్థాన్ మ్యాచే. ఈ దాయాది జట్లు గ్రౌండ్​లోకి దిగి నువ్వానేనా అంటూ తలపడుతుంటే చూసేందుకు రెండు కళ్లు చాలవు. దాదాపుగా ఈ టీమ్స్ మధ్య జరిగే మ్యాచ్​లన్నీ థ్రిల్లర్ మూవీస్​లాగే చివరి వరకు ఉత్కంఠగా సాగుతాయి. అయితే ఈ మధ్య దాయాది పోరుల్లో టీమిండియాదే డామినేషన్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. పాక్ గాలి తీసేశాడు గౌతీ.

ఒకప్పుడు పాకిస్థాన్-టీమిండియా మ్యాచ్ అంటే ఫుల్ టెన్షన్ ఉండేది. ఏ టీమ్ గెలుస్తుందో చెప్పలేని పరిస్థితి. మ్యాచ్ ఆఖరి బాల్ వరకు ఇరు జట్లూ హోరాహోరీగా పోరాడేవి. ఉత్కంఠను తట్టుకోలేక సీట్లలో నుంచి లేచి మరీ మ్యాచులు చూసేవారు ఆడియెన్స్. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. దాయాదితో మ్యాచుల్లో భారత్ ఆధిపత్యం నడుస్తోంది. దాదాపుగా చాలా మటుకు మ్యాచుల్లో మన జట్టు వన్​సైడ్​గా గెలుస్తోంది. దీనిపై గంభీర్ తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. పాకిస్థాన్ చాలా సార్లు భారత్​పై ఆధిపత్యం చూపించిందని.. కానీ ప్రస్తుతం మాత్రం పరిస్థితి పూర్తిగా వ్యతిరేకంగా ఉందన్నాడు. మూడు ఫార్మాట్లలోనూ రెండు జట్ల స్థాయిని బట్టి చూస్తే పాక్ కంటే భారత్ ఎన్నో రెట్లు మెరుగ్గా ఉందన్నాడు గంభీర్. ఒకవేళ టీమిండియాను పాకిస్థాన్ ఓడిస్తే అది పెద్ద విషయం అవుతుందన్నాడు. అదే భారత్​ దాయాది మీద గెలిస్తే అదేమంత పెద్ద మ్యాటర్ కాదన్నాడు.

ఇప్పుడు పాకిస్థాన్ మీద భారత్ గెలిస్తే పెద్ద విషయం కాదన్నాడు గంభీర్. అది తరచూ జరుగుతున్నదేనని చెప్పాడు. ప్రస్తుత క్రికెట్​లో ఇండియా-పాకిస్థాన్ శత్రుత్వానికి అంత ఇంపార్టెన్స్ లేదన్నాడు. కానీ భారత్-ఆస్ట్రేలియా రైవల్రీ కోసం మాత్రం అందరూ ఎదురు చూస్తున్నారని గంభీర్ తెలిపాడు. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్​ టాప్ ప్రయారిటీగా మారిందన్నాడు. ఏ క్రికెట్ అభిమానిని అడిగినా అతి పెద్ద రైవల్రీ ఏదంటే ఇండియా, ఆస్ట్రేలియా మధ్యేనని చెబుతారని గౌతీ పేర్కొన్నాడు. తనకు నచ్చింది తాను చెబుతానని స్పష్టం చేశాడు. గంభీర్ కామెంట్స్​తో సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్స్ ఏకీభవిస్తున్నారు. టీమిండియా ఒక టాప్ టీమ్ అని.. పాకిస్థాన్​ మనకు ఏ విషయంలోనూ దరిదాపుల్లో లేదని చెబుతున్నారు. మరి.. భారత్-పాక్ మ్యాచ్​లపై గంభీర్ చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Virat Kohli: అప్పుడు రోహిత్, ఇప్పుడు విరాట్.. భారత స్టార్లను అవమానిస్తున్న ఆసీస్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి