iDreamPost
android-app
ios-app

భారత్-పాక్ మ్యాచ్​కు ముందు BCCIపై విమర్శలు!

  • Author singhj Published - 08:02 PM, Fri - 1 September 23
  • Author singhj Published - 08:02 PM, Fri - 1 September 23
భారత్-పాక్ మ్యాచ్​కు ముందు BCCIపై విమర్శలు!

క్రికెట్​లో కొన్ని మ్యాచులకు ఉండే హైప్ అంతా ఇంతా కాదు. కొన్ని జట్లు గ్రౌండ్​లో తలపడుతుంటే చూడాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటారు. అలా అత్యంత ఆసక్తిని రేకెత్తించే మ్యాచులుగా భారత్, పాకిస్థాన్​ మ్యాచులని చెప్పొచ్చు. ఈ రెండు జట్లు బరిలోకి దిగుతున్నాయంటే స్టేడియాలు నిండిపోవాల్సిందే. ఈ దాయాది జట్లు పోటీపడుతుంటే అది మ్యాచ్​లా కాకుండా ఒక యుద్ధాన్ని తలపిస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. టీమ్స్ మధ్యే కాదు మ్యాచ్​ను చూసే అభిమానులు కూడా దీన్ని వార్​లాగే చూస్తారు. గ్రౌండ్​లో ఇరు జట్ల అభిమానులు తమ దేశాల పేర్లు, ఇష్టమైన ప్లేయర్ల పేర్లు చెబుతూ స్టేడియాన్ని మోతెక్కిస్తారు. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్​లకు టీఆర్పీ రేటింగ్స్ కూడా ఒక రేంజ్​లో వస్తాయి.

ఓటీటీల్లోనూ భారత్-పాక్ మ్యాచ్​కు స్ట్రీమింగ్ కౌంట్ భారీ లెవల్లోనే ఉంటుంది. దీంతో ఈ మ్యాచ్​ల​కు యాడ్స్ ఇచ్చేందుకు ప్రముఖ బ్రాండ్లన్నీ పోటీపడతాయి. వ్యూస్ పరంగా, బిజినెస్ పరంగా, ఎంటర్​టైన్​మెంట్ పరంగా చూసుకున్నా భారత్, పాక్ మ్యాచ్​ ఎంతో కీలకం. అయితే ఈసారి మాత్రం ఈ మ్యాచ్ మీద అంతగా బజ్ కనిపించడం లేదు. ఆసియా కప్-2023లో తమ తొలి మ్యాచ్​లోనే పాక్​తో తలపడనుంది భారత్. ఈ మ్యాచ్​కు ఇంకా ఒక్క రోజే సమయం ఉంది. కానీ ఎందుకో మునుపటిలా దాయాదుల పోరుకు ముందు ఉండాల్సిన బజ్ కనిపించడం లేదు. రేపు భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఈ రోజు ఉండాల్సినంత బజ్ లేదు. బజ్ క్రియేట్ చేయడంలో బీసీసీఐ పూర్తిగా విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి.

ఈసారి ఆసియా కప్ నిర్వహణ పాక్, శ్రీలంక బోర్డులదే అయినప్పటికీ ఈ మ్యాచ్ కోసం బీసీసీఐ చేయాల్సిన ప్రయత్నాలు చేయట్లేదని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ కోసం బజ్ క్రియేట్ చేయడంలో మన బోర్డు ప్రయత్నాలు శూన్యం అని ఎక్స్​పర్ట్స్​తో పాటు ఫ్యాన్స్ కూడా అంటున్నారు. పాక్​తో మ్యాచ్​కు ముందు ఆ జట్టుతో మ్యాచ్​లు ఆడిన భారత మాజీ క్రికెటర్ల బైట్స్ గానీ.. పాత వీడియోలు గానీ పోస్ట్ చేయడం లేదు బీసీసీఐ. హై ఓల్టేజ్ మ్యాచ్​గా చెప్పుకునే ఇండో-పాక్ పోరుకు ఉండాల్సినంత హైప్ తీసుకురావడంలో బీసీసీఐ అన్ని విధాలా ఫెయిలైందనే కామెంట్స్ వస్తున్నాయి. మరి.. భారత్-పాక్ మ్యాచ్​ విషయంలో మిన్నకుండిపోయిన బీసీసీఐ తీరుపై మీరేం అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి:
దాదా నా మాట వినకుండా ఆ మ్యాచ్ ఆడించాడు: సెహ్వాగ్