iDreamPost

టీమిండియాతో మ్యాచ్​కు తుది జట్టును ప్రకటించిన పాక్.. మరి షాహిన్ అఫ్రిది?

  • Author singhj Published - 08:41 AM, Sat - 2 September 23
  • Author singhj Published - 08:41 AM, Sat - 2 September 23
టీమిండియాతో మ్యాచ్​కు తుది జట్టును ప్రకటించిన పాక్.. మరి షాహిన్ అఫ్రిది?

క్రికెట్ అభిమానులు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న రోజు ఎట్టకేలకు రానే వచ్చింది. జెంటిల్మన్ గేమ్​లో అత్యుత్తమ సమరాల్లో ఒకటిగా చెప్పుకునే ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్​ ఇవాళ జరగనుంది. ఆసియా కప్-2023లో భాగంగా దాయాది జట్లు శనివారం అమీతుమీ తేల్చుకోనున్నాయి. నేపాల్​ను చిత్తుచేసి టోర్నీని ఘనంగా ఆరంభించిన పాక్.. భారత్​తో మ్యాచ్​కు సై అంటోంది. మరోవైపు టీమిండియా ఈ మ్యాచ్​తోనే తన పోరాటాన్ని మొదలుపెట్టబోతోంది. కీలకమైన ఈ మ్యాచ్​కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తమ తుది జట్టును ప్రకటించింది. నేపాల్​తో తలపడిన టీమ్​నే కొనసాగించనున్నట్లు ప్రకటించింది.

పసికూన నేపాల్​తో జరిగిన మ్యాచ్​లో పాకిస్థాన్ జట్టు 238 రన్స్ తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో గ్రూప్​-ఏలో పాక్ ముందంజలో ఉంది. అయితే ఈ మ్యాచ్​లో ఫెయిలైన ఓపెనర్లు ఫఖర్ జమాన్ (14), ఇమామ్ ఉల్ హక్ (5)లను భారత్​తో పోరులోనూ కొనసాగించేందుకు పాక్ మేనేజ్​మెంట్ మొగ్గు చూపింది. అదే విధంగా ఆడతాడో లేడోననే సందేహాలు తలెత్తుతున్న పేసర్ షాహిన్ అఫ్రిదికి కూడా తుది జట్టులో చోటు కల్పించింది. అతడు పూర్తి ఫిట్​గా ఉన్నట్లు వెల్లడించింది. టీమిండియాతో మ్యాచ్​కు షాహిన్, నసీం షా, హ్యారిస్ రవూఫ్ రూపంలో పేస్ త్రయం అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది పీసీబీ.

చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్​తో మ్యాచ్​కు ముందు తమ టీమ్ కాంబినేషన్ పై భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జస్​ప్రీత్ బుమ్రా ఫిట్​నెస్ సాధించి కమ్​బ్యాక్ ఇవ్వడం సంతోషంగా ఉందన్నాడు హిట్​మ్యాన్. తమకు అందుబాటులో చాలా కాంబినేషన్స్ ఉన్నాయని తెలిపాడు. బ్యాటింగ్ యూనిట్​లో అనుభవం కలిగిన ఆటగాళ్లు ఉన్నారని చెప్పాడు. ఈసారి ఆసియా కప్ ఫైనల్లో భారత్-పాక్ ఆడతాయని ఆశిస్తున్నట్లు రోహిత్ పేర్కొన్నాడు. పాకిస్థాన్​తో ఆడటం తమకు అతిపెద్ద సవాల్ అని.. ఈ మ్యాచ్​లో ఎవరు అత్యుత్తమ క్రికెట్ ఆడితే విజయం వారినే వరిస్తుందని భారత కెప్టెన్ వివరించాడు.

ఇదీ చదవండి: భారత జెర్సీలపై పాక్ పేరు లేకపోవడానికి కారణం!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి