iDreamPost

Virender Sehwag: భారత్-మాల్దీవులు వివాదం.. షాకింగ్ కామెంట్స్ చేసిన వీరేంద్ర సెహ్వాగ్!

  • Published Jan 08, 2024 | 6:10 PMUpdated Jan 08, 2024 | 6:10 PM

భారత్-మాల్దీవుల మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

భారత్-మాల్దీవుల మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

  • Published Jan 08, 2024 | 6:10 PMUpdated Jan 08, 2024 | 6:10 PM
Virender Sehwag: భారత్-మాల్దీవులు వివాదం.. షాకింగ్ కామెంట్స్ చేసిన వీరేంద్ర సెహ్వాగ్!

భారతదేశం ఎవరి జోలికీ వెళ్లదు. అన్ని కంట్రీస్​తోనూ స్నేహపూర్వక సంబంధాలను కోరుకుంటుంది. కానీ ఎవరైనా మనతో పెట్టుకుంటే మాత్రం వాళ్లను అంత ఈజీగా వదలదు. ఇండియాతో పెట్టుకున్న మాల్దీవులు పరిస్థితి ఇప్పుడు ఇలాగే ఉంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మీద మాల్దీవులు మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై తీవ్ర దుమారం రేగుతోంది. వీటిపై దేశవ్యాప్తంగా భారీగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ నేతలతో సినీ, క్రీడా ప్రముఖులు కూడా ఈ కామెంట్స్​ను తీవ్రంగా ఖండిస్తున్నారు. కేంద్ర సర్కారు కూడా వీటి మీద తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చింది. ఈ వ్యాఖ్యలకు నిరసనగా వేలాది మంది ఇండియన్ టూరిస్టులు మాల్దీవులకు ప్లాన్ చేసుకున్న హాలీడే ట్రిప్స్​ను క్యాన్సిల్ చేసుకుంటున్నారు. తాజాగా ఈ కాంట్రవర్సీపై భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు.

ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాల్దీవులకు తగిన రీతిలో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నాడు సెహ్వాగ్. మాల్దీవులు మంత్రులు చేసిన కామెంట్స్​కు అతడు గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఇలాంటి చవకబారు కామెంట్స్ చేయడం తగదని చెబుతూ సోషల్ మీడియాలో పలు పోస్టులు పెట్టాడు వీరూ. ఉడిపిలోని అందమైన బీచ్​లు, పాండిలోని ప్యారడైజ్ బీచ్, అండమాన్​లోని నీల్, హేవ్​లాక్ లాంటి ఏరియాలు చాలా అద్భుతంగా ఉంటాయని.. వీటిని డెవలప్ చేయాలన్నాడు. ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తే టూరిస్టులను విశేషంగా ఆకర్షించొచ్చన్నాడు సెహ్వాగ్. ఆపదల నుంచి అవకాశాలు సృష్టించాల్సిన అవసరం ఉందన్నాడు.

మాల్దీవుల మంత్రుల కామెంట్స్​ను తిప్పికొట్టేలా ఇలాంటి ప్లేసెస్​లో మరిన్ని వసతులు సమకూర్చాలన్నాడు సెహ్వాగ్. దాని వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుందన్నాడు. వీరూతో పాటు ఇర్ఫాన్ పఠాన్, సురేష్ రైనా కూడా ఈ వివాదంపై స్పందించారు. భారత్​పై మాల్దీవుల మంత్రులు నెగెటివ్ కామెంట్స్ చేయడం బాధాకరమన్నాడు పఠాన్. తన మాతృభూమి ఆతిథ్యం ఎప్పుడూ గొప్పగా ఉంటుందన్నాడు. మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యలు ఇండియన్స్​ను బాధపెట్టేలా, వివక్ష చూపేలా ఉండటం బాధాకరమన్నాడు రైనా. తాను కూడా అక్కడ చాలా సార్లు పర్యటించానని.. అయితే ఇప్పుడు మన ఆత్మగౌరవానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం కీలకమన్నాడు.

you must have teach him a lesson

భారత్-మాల్దీవుల వివాదానికి వస్తే.. ప్రధాని నరేంద్ర మోడీ రీసెంట్​గా లక్షద్వీప్​లో పర్యటించారు. లక్షద్వీప్​ను మరింత డెవలప్ చేయాలని, పర్యాటక ధామంగా మార్చాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన షేర్ చేసిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్ వైరల్ అయ్యాయి. వీటిని చూసిన నెటిజన్స్ లక్షద్వీప్​ను మాల్దీవులతో కంపేర్ చేశారు. అయితే ఈ విషయంపై మాల్దీవుల మంత్రి షియునా వ్యంగ్యంగా స్పందించారు. మోడీని జోకర్​గా, తోలుబొమ్మగా పేర్కొంటూ ట్వీట్స్ చేశారు. దీంతో భారత్-మాల్దీవుల మధ్య కాంట్రవర్సీ మొదలైంది. మరి.. మాల్దీవులకు బుద్ధి చెప్పాలంటూ సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: Rohit Sharma: టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌కు కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ? బోర్డు నమ్మడానికి 3 కారణాలు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి