iDreamPost

Rohit Sharma: టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌కు కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ? బోర్డు నమ్మడానికి 3 కారణాలు!

  • Published Jan 08, 2024 | 5:13 PMUpdated Jan 09, 2024 | 2:07 PM

రోహిత్‌ శర్మను ఆఫ్ఘనిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్‌కు కెప్టెన్‌గా నియమించి.. రాబోయే టీ20 వరల్డ్‌ కప్‌కు కూడా రోహితే కెప్టెన్‌ అని బీసీసీఐ హింట్‌ ఇచ్చేసింది. అయితే.. రోహిత్‌పై బీసీసీఐ అంతా నమ్మకం ఎందుకు పెట్టుకుందో ఇప్పుడు చూద్దాం..

రోహిత్‌ శర్మను ఆఫ్ఘనిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్‌కు కెప్టెన్‌గా నియమించి.. రాబోయే టీ20 వరల్డ్‌ కప్‌కు కూడా రోహితే కెప్టెన్‌ అని బీసీసీఐ హింట్‌ ఇచ్చేసింది. అయితే.. రోహిత్‌పై బీసీసీఐ అంతా నమ్మకం ఎందుకు పెట్టుకుందో ఇప్పుడు చూద్దాం..

  • Published Jan 08, 2024 | 5:13 PMUpdated Jan 09, 2024 | 2:07 PM
Rohit Sharma: టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌కు కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ? బోర్డు  నమ్మడానికి 3 కారణాలు!

వన్డే వరల్డ్‌ కప్‌ 2023 ముగిసిన తర్వాత తెరలేసిన పెద్ద చర్చకు ఎట్టకేలకు తెరపడింది. ఈ ఏడాది జరగబోయే టీ20 వరల్డ్ కప్‌ 2024లో టీమిండియాకు సారథ్యం వహించేది ఎవరు? ఈ ప్రశ్న మొత్తం భారత క్రికెట్‌ను జట్టు పీక్కునేలా చేసింది. రోహిత్‌ శర్మ, హార్ధిక్‌ పాండ్యా.. లేక వేరే వాళ్లా? ఇలా చాలా ఊహాగానాలు వచ్చాయి. వాటన్నంటికి పుల్‌స్టాప్‌ పెడుతూ.. బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టీ20 వరల్డ్‌ కప్‌ ప్రిపరేషన్స్‌లో భాగంగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌కు రోహిత్‌ శర్మను కెప్టెన్‌గా ప్రకటించింది బీసీసీఐ. గతంలో కూడా రోహిత్‌ శర్మనే టీ20 జట్టుకు రెగ్యులర్‌ కెప్టెన్‌గా ఉన్నా.. టీ20 వరల్డ్‌ కప్‌ 2023 తర్వాత.. టీ20లకు రోహిత్‌ దూరంగా ఉండటంతో కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యా, సూర్యకుమార్‌లు వ్యవహరించారు.

అయితే.. టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో అసలు రోహిత్‌ ఆడతాడా? లేదా? అనే అనుమానాలు కూడా తలెత్తాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ తీసుకున్న నిర్ణయంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఒక్క ఆఫ్ఘాన్‌తో సిరీస్‌కే కాదు.. ఇక టీ20 వరల్డ్‌ కప్‌ 2024కు కూడా రోహిత్‌ శర్మనే కెప్టెన్‌ అని బీసీసీఐ చెప్పకనే చెప్పింది. అయితే.. యంగస్టర్ల క్రికెట్‌గా పేరొందిన టీ20 ఫార్మాట్‌కు కూడా రోహిత్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసి.. బీసీసీఐ అతనిపై చాలా నమ్మకం చూపించింది. మరి రోహిత్‌పై బీసీసీఐ అంత నమ్మకం పెట్టుకోవడానికి ఓ మూడు కారణాలు మాత్రం గట్టిగా వినిపిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ ట్రాక్‌ రికార్డ్‌
విరాట్‌ కోహ్లీ తర్వాత రోహిత్‌ శర్మ టీమిండియాకు రెగ్యులర్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినా.. అంతకు ముందుకు కూడా పలు మ్యాచ్‌ల్లో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. మొత్తంగా 2017 నుంచి ఇప్పటి వరకు రోహిత్‌ శర్మ మొత్తం 51 టీ20 మ్యాచ్‌ల్లో టీమిండియా కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ 51 మ్యాచ్‌ల్లో ఇండియా 39 మ్యాచ్‌ల్లో గెలిచి, కేవలం 12 మ్యాచ్‌ల్లో మాత్రమే ఓటమి పాలైంది. టీ20 కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ విన్నింగ్స్‌ పర్సంటేజ్‌.. 76.47. ఇది చాలా మంచి రికార్డు. టీ20ల్లో విరాట్‌ కోహ్లీ, ఎంఎస్‌ ధోని కంటే ఇది ఎక్కువ. టీ20 కెప్టెన్‌గా ధోని విన్నింగ్‌ పర్సంటేజ్‌ 56.94, కోహ్లీది 60 శాతం. ఇలా ఓవరాల్‌గా చూసుకున్న టీ20 కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ ట్రాక్‌ రికార్డ్‌ ఎంతో మెరుగ్గా ఉంది.

2. వరల్డ్‌ కప్‌లో టీమ్‌ను నడిపించిన తీరు
ఫార్మాట్‌ ఏదైనా టీమ్‌ కెప్టెన్‌కు ఉండాల్సిన ముఖ్య లక్షణం.. తన టీమ్‌పై తనకు పూర్తి విశ్వాసం ఉండటం. అది రోహిత్‌ శర్మ హండ్రెడ్‌ పర్సంట్‌ ఉంది. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో అది స్పష్టంగా తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకమైన వన్డే వరల్డ్‌ కప్‌లో జట్టును అద్భుతంగా నడిపించాడు. జట్టులోని అందరు ఆటగాళ్లను కలుపుకుంటూ పోతూ.. డీఆర్‌ఎస్‌ తీసుకునే విషయంలో బౌలర్‌, వికెట్‌ కీపర్‌ నిర్ణయాలను గౌరవిస్తూ.. మంచి రిజల్ట్స్‌ రాబట్టాడు. అలాగే మరో సీనియర్‌ స్టార్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లీతో కూడా మాట్లాడుతూ.. అతని సూచనలను తీసుకుంటూ టీమ్‌ను ముందుకు నడిపించాడు. ఓటమి ఎరుగని జట్టుగా ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా.. ఫైనల్లో ఓటమి పాలై కప్పు చేజార్చుకుంది. అయినా కూడా రోహిత్‌ కెప్టెన్సీపై ప్రశంసల వర్షం కురిసింది.

3. అగ్రెసివ్‌ బ్యాటింగ్‌
ఇక కెప్టెన్సీలో రోహిత్‌ శర్మకు ఫుల్‌ మార్క్స్‌ పడతాయి. ఆ విషయం పక్కనపెడితే.. రోహిత్‌ బ్యాటింగ్‌ స్టైల్‌ టీ20 క్రికెట్‌కు సరిగ్గా సరిపోతుంది. టెస్టులు, వన్డేల్లో రోహిత్‌ ఎలాంటి అగ్రెసివ్‌ ఇంటెంట్‌తో బ్యాటింగ్‌ చేస్తున్నాడో గత కొంతకాలంగా చూస్తూనే ఉన్నాం. పవర్‌ ప్లేలో వేగంగా ఆడటం వల్ల తర్వాత వచ్చే బ్యాటర్లపై ప్రెజర్‌ పడటం లేదు. వరల్డ్‌ కప్‌ ఆసాంతం రోహిత్‌ శర్మ అదే చేశాడు. అలాంటి అగ్రెసివ్‌ బ్యాటింగ్‌ టీ20ల్లో ఇంకా సూపర్‌ హిట్‌ అవుతుంది. కేవలం కెప్టెన్‌గానే కాక, ఒక ఓపెనర్‌గా రోహిత్‌ శర్మ బెస్ట్‌ ప్లేయర్‌. అతన్ని మించిన అగ్రెసివ్‌ ఓపెనర్‌ ప్రస్తుత టీ20 టీమ్‌లో లేడనే చెప్పాలి. మరి రోహిత్‌ శర్మను టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌కు కెప్టెన్‌గా కొనసాగించేందుకు కనిపిస్తున్న ఈ కారణాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి