iDreamPost

IND vs ENG: వీడియో: సూపర్‌ రనౌట్‌! ధృవ్‌ రూపంలో టీమిండియాలోకి మరో ధోని?

  • Published Feb 19, 2024 | 7:57 AMUpdated Feb 19, 2024 | 7:57 AM

ఇంగ్లండ్​తో జరిగిన మూడో టెస్టులో టీమిండియా అదరగొట్టింది. ఆల్​రౌంట్ పెర్ఫార్మెన్స్​తో పర్యాటక జట్టుపై వన్​సైడ్​ విక్టరీ కొట్టింది.

ఇంగ్లండ్​తో జరిగిన మూడో టెస్టులో టీమిండియా అదరగొట్టింది. ఆల్​రౌంట్ పెర్ఫార్మెన్స్​తో పర్యాటక జట్టుపై వన్​సైడ్​ విక్టరీ కొట్టింది.

  • Published Feb 19, 2024 | 7:57 AMUpdated Feb 19, 2024 | 7:57 AM
IND vs ENG: వీడియో: సూపర్‌ రనౌట్‌! ధృవ్‌ రూపంలో టీమిండియాలోకి మరో ధోని?

ఏ టీమ్​ ఎదురొచ్చినా, ఏ దేశంలోనైనా బజ్​బాల్​ అంటూ బ్యాట్​తో, బాల్​తో చెలరేగిపోయే ఇంగ్లండ్​ పప్పులు ఇండియాలో ఉడకడం లేదు. అటాకింగ్ గేమ్​తో ప్రత్యర్థులను భయపెట్టే ఇంగ్లీష్ టీమ్​.. రోహిత్ సేన దెబ్బకు బిక్కచచ్చిపోయింది. మన కుర్రాళ్లు సిక్సర్ల మోత మోగించిన పిచ్ మీద.. ఎంతో అనుభవం ఉన్న ఇంగ్లండ్ క్రికెటర్లు బ్యాట్లు ఎత్తేశారు. దీంతో ఆ టీమ్​కు ఘోర పరాభవం మిగిలింది. భారత్ నిర్దేశించిన 556 పరుగుల టార్గెట్​ను ఛేజ్ చేసేందుకు బరిలోకి దిగిన పర్యాటక జట్టు కేవలం 39.4 ఓవర్లలో 122 పరుగులకే ఆలౌట్ అయింది. పరుగుల పరంగా టీమిండియాకు టెస్టుల్లో ఇదే అతి పెద్ద విజయం. అయితే ఈ మ్యాచ్​లో మరో హైలైట్ అంటే కొత్త కుర్రాడు ధృవ్ జురెల్ కీపింగ్ అనే చెప్పాలి. వికెట్ల వెనుక మెరుపు వేగంతో కదులుతూ లెజెండ్ ఎంఎస్ ధోనీని అతడు గుర్తుచేశాడు.

కెరీర్​లో తొలి టెస్టు ఆడుతున్న జురెల్ అద్భుతమైన కీపింగ్​తో ధోనీని తలపించాడు. వికెట్ల వెనుక పాదరసంలా కదులుతూ ఇంగ్లండ్ బ్యాటర్లకు దడ పుట్టించాడు. తొలి ఇన్నింగ్స్​లో టామ్ హార్ట్​లీని స్టంపౌట్ చేసిన ధృవ్.. రెండో ఇన్నింగ్స్​లో వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. రాజ్​కోట్ పిచ్​పై బాల్ ఎక్కువ టర్న్ కాకపోయినా.. వికెట్ మీద అంత పేస్ లేకపోయినా ఒక్కోసారి బంతి అనూహ్యంగా బౌన్స్ అవడం లేదా తక్కువ ఎత్తులో నుంచి దూసుకురావడం జరిగింది. ఇది పేసర్లతో పాటు ఎక్కువగా జడేజా వంటి స్పిన్నర్ల బౌలింగ్​లో చోటుచేసుకుంది. దీంతో జురెల్ మరింత కాన్​సంట్రేషన్​తో కీపింగ్ చేశాడు. ఈ క్రమంలో సెకండ్ ఇన్నింగ్స్​లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ (4)ను అద్భుతంగా రనౌట్ చేశాడు. మహ్మద్ సిరాజ్ వేసిన త్రోను వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి అందుకున్నాడు ధృవ్.

సిరాజ్ వేసిన త్రోను పరిగెత్తుకుంటూ వచ్చి అందుకొని.. మోకాళ్లపై కూర్చొని బాడీని బ్యాలెన్స్ చేయకుండానే వికెట్లను గిరాటేశాడు జురెల్. చాలా అనుభవం ఉన్న కీపర్లకు కూడా సాధ్యం కానిది అతడు అలవోకగా చేసేశాడు. క్రీజులోకి వచ్చేలోపు రనౌట్ చేసేయడంతో డకెట్ బిత్తరపోయాడు. ఆ తర్వాత జడేజా బౌలింగ్​లో బెన్ ఫోక్స్ (15) బ్యాట్​కు ఎడ్జ్ తగిలి వచ్చిన లో క్యాచ్​ను అంతే క్విక్ హ్యాండ్స్​తో అందుకున్నాడు ధృవ్. బాల్​ వేగాన్ని, ఎడ్జ్​ను సరిగ్గా అంచనా వేసి పట్టుకున్నాడు. క్లిష్టమైన రనౌట్​తో పాటు అంతే డిఫికల్ట్ క్యాచ్​ను అందుకున్న జురెల్.. వికెట్ల వెనుక చాలా పరుగులు కాపాడాడు.

బుమ్రా, సిరాజ్ స్టంప్స్​కు దూరంగా వేసిన కొన్ని బాల్స్ బౌండరీలకు వెళ్లేవి. కానీ అతడు డైవ్ చేసి వాటిని ఆపాడు. తద్వారా ఎక్స్​ట్రా రన్స్ లీక్ కాకుండా చూసుకున్నాడు. దీంతో రిషబ్ పంత్ వచ్చే వరకు భారత్​కు ఢోకా లేదని.. జురెల్ రూపంలో మరో సూపర్ కీపర్, బ్యాటర్ దొరికాడని అందరూ మెచ్చుకుంటున్నారు. కేఎస్ భరత్​ను ఇక పక్కన పెడతారని.. జురెల్ ఇంత బాగా ఆడుతున్నప్పుడు అతడికి చోటు దొరకడం కష్టమేనని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ధోని వారసుడు జట్టులోకి వచ్చాడని.. ఇక, నో టెన్షన్ అని చెబుతున్నారు. ఇక, ఈ మ్యాచ్​లో తొలి ఇన్నింగ్స్​లో మాత్రమే బ్యాటింగ్ ఛాన్స్ దక్కించుకున్న జురెల్ 46 పరుగులు చేశాడు. అశ్విన్​తో కలసి మంచి పార్ట్​నర్​షిప్ నెలకొల్పాడు. మరి.. జురెల్ కీపింగ్​పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: Rohit Sharma: ఆ డేర్‌ చేసిన తొలి కెప్టెన్‌ రోహిత్‌ శర్మ! ఇంగ్లండ్‌ అహంపై కొట్టాడు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి