iDreamPost

IND vs ENG: భారత్​ను రెచ్చగొడుతున్న ఇంగ్లండ్ మాజీ క్రికెటర్.. అంత ఈజీ కాదంటూ..!

  • Published Jan 21, 2024 | 7:09 PMUpdated Jan 21, 2024 | 7:09 PM

టీమిండియాను ఓ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ రెచ్చగొట్టాడు. తమ జట్టుపై గెలవడం అంత ఈజీ కాదంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

టీమిండియాను ఓ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ రెచ్చగొట్టాడు. తమ జట్టుపై గెలవడం అంత ఈజీ కాదంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

  • Published Jan 21, 2024 | 7:09 PMUpdated Jan 21, 2024 | 7:09 PM
IND vs ENG: భారత్​ను రెచ్చగొడుతున్న ఇంగ్లండ్ మాజీ క్రికెటర్.. అంత ఈజీ కాదంటూ..!

స్వదేశంలో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్​లో ఇంగ్లండ్​ను ఢీకొట్టేందుకు భారత జట్టు సిద్ధమవుతోంది. జనవరి 25వ తేదీ నుంచి హైదరాబాద్​లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం వేదికగా మొదటి టెస్ట్ స్టార్ట్ కానుంది. మూడో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్​షిప్ ఫైనల్​కు చేరుకునేందుకు ఇది అత్యంత ఇంపార్టెంట్ సిరీస్. అందుకే దీన్ని భారత్, ఇంగ్లండ్​లు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. విజయం కోసం తమ సర్వశక్తులూ ఒడ్డేందుకు సిద్దమవుతున్నాయి. డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్​లో ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న రోహిత్ సేన టాప్ ప్లేస్​పై గురి పెట్టింది. సిరీస్ జరుగుతున్నది సొంత గడ్డ మీదే అయినప్పటికీ ఇంగ్లండ్​ను తక్కువ అంచనా వేయడం లేదు భారత్. దీనికి కారణం ఆ టీమ్ బలంగా ఉండటమే. అయితే అటు ఇంగ్లండ్ మాజీలు మాత్రం టీమిండియాను వరుసగా టార్గెట్ చేస్తున్నారు. వరుస విమర్శలతో భారత క్రికెటర్లను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ నాసిర్ హుస్సేన్ కూడా ఈ లిస్టులో చేరాడు.

టీమిండియాకు తమ మీద గెలవడం అంత ఈజీ కాదని నాసిర్ హుస్సేన్ అన్నాడు. బజ్​బాల్​ ఫార్ములాను అధిగమించి నెగ్గడం చాలా కష్టమని చెప్పాడు. ‘ఈ సిరీస్ కోసం భారత్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోందని తెలుసు. ఇప్పుడు అందరూ భారత క్రికెట్ గురించి అలాగే బజ్​బాల్ గురించి కూడా చర్చించుకుంటున్నారు. అయితే ఈ రెండూ అతి త్వరలో ఢీకొననున్నాయి. బజ్​బాల్​ ఫార్ములాను తమ జట్టు ఎలా తిప్పికొడుతుందో చూడాలని చాలా మంది టీమిండియా అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఈ సిరీస్​లో భారతే ఫేవరెట్. కానీ ఇంగ్లండ్​ను తక్కువ అంచనా వేయొద్దు. బజ్​బాల్​ ఛాలెంజ్​ను ఎదుర్కొని నిలబడటం అంత ఈజీ కాదు. కెప్టెన్ బెన్ స్టోక్స్, కోచ్ బ్రెండన్ మెకల్లమ్ రికార్డు అద్భుతంగా ఉంది’ అని చెప్పుకొచ్చాడు నాసిర్ హుస్సేన్. ఈ సిరీస్ ఇంగ్లండ్​కు కూడా అతిపెద్ద సవాల్​గా నిలవనుందని తెలిపాడు.

బజ్​బాజ్ ఫార్ములా ఇంగ్లండ్​లో బాగా వర్కవుట్ అయిందని.. దీన్ని ఇతర చోట్ల కూడా విజయవంతం చేయాలని స్టోక్స్, మెకల్లమ్ భావిస్తున్నారని హుస్సేన్ పేర్కొన్నాడు. అయితే ఆస్ట్రేలియా, భారత్​లో ఈ ఫార్ములా సక్సెస్ అవడం చాలా కష్టమన్నాడు. టీమిండియా కూడా ఇంగ్లండ్ విసిరే ఛాలెంజ్​ను ఎదుర్కోవాలని ఉత్కంఠగా ఉందన్నాడు. ఏదేమైనా ఈ సిరీస్ అద్భుతంగా జరగడం తథ్యమని.. క్రికెట్​లోనే గ్రేట్ సిరీస్​గా ఇది నిలిచిపోనుందని నాసిర్ హుస్సేన్ జోస్యం చెప్పాడు. భారత్​లోని టర్నింగ్ ట్రాక్స్ మీద రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ లాంటి బెస్ట్ స్పిన్నర్లను ఎదుర్కోవడం చాలా కష్టమన్నాడు. టీమిండియాకు అత్యుత్తమ స్పిన్నర్లతో పాటు మంచి పేసర్లు కూడా అందుబాటులో ఉన్నారని హుస్సేన్ వివరించాడు. ఇంగ్లండ్ టీమ్​లో జాక్ లీచ్, టాప్ హార్ట్​లీ, షోయబ్ బషీర్, రెహానె అహ్మద్ వంటి స్పిన్నర్లు ఉన్నారని.. కానీ వీళ్లకు ఏమాత్రం ఎక్స్​పీరియెన్స్ లేదన్నాడు. మరి.. భారత జట్టుపై నాసిర్ హుస్సేన్ చేసిన వ్యాఖ్యల మీద మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి