iDreamPost
android-app
ios-app

IND vs ENG: టీమిండియాకు గుడ్ న్యూస్.. మూడో టెస్టు కోసం సరైనోడు దిగుతున్నాడు!

  • Published Feb 04, 2024 | 12:52 PM Updated Updated Feb 05, 2024 | 4:04 PM

టీమిండియాకు గుడ్ న్యూస్. మూడో టెస్టుకు ముందు అభిమానులకు ఓ శుభవార్త. ఈ మ్యాచ్ కోసం సరైనోడు దిగుతున్నాడు.

టీమిండియాకు గుడ్ న్యూస్. మూడో టెస్టుకు ముందు అభిమానులకు ఓ శుభవార్త. ఈ మ్యాచ్ కోసం సరైనోడు దిగుతున్నాడు.

  • Published Feb 04, 2024 | 12:52 PMUpdated Feb 05, 2024 | 4:04 PM
IND vs ENG: టీమిండియాకు గుడ్ న్యూస్.. మూడో టెస్టు కోసం సరైనోడు దిగుతున్నాడు!

ఇంగ్లండ్​తో 5 టెస్టుల సిరీస్​లో భాగంగా సెలక్షన్ కమిటీ ఇప్పటికే తొలి రెండు మ్యాచులకు గానూ భారత జట్టును ప్రకటించింది. అయితే రెండో టెస్టులో ఇవాళ మూడో రోజు ఆట జరుగుతోంది. వైజాగ్ టెస్టు ముగిసిన సుమారు 9 రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మూడో టెస్టు స్టార్ట్ కానుంది. ఈ నేపథ్యంలో మిగిలిన మూడు మ్యాచులకు గానూ సెలక్టర్లు భారత టీమ్​ను ప్రకటించాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల జట్టు ప్రకటన నిర్ణయాన్ని సెలక్టర్లు హోల్డ్​లో పెట్టారని క్రికెట్ వర్గాల సమాచారం. మొదటి రెండు టెస్టులకు వ్యక్తిగత కారణాలతో దూరమైన సీనియర్ క్రికెటర్ విరాట్ కోహ్లీ.. మిగిలిన మ్యాచులకు అందుబాటులో ఉంటాడో లేదో తెలియదు. ఈ తరుణంలో టీమిండియాకు అదిరిపోయే న్యూస్. ఈ మ్యాచ్​తో కమ్​బ్యాక్ ఇచ్చేందుకు ఓ స్టార్ బ్యాటర్ రెడీ అవుతున్నాడు.

భారత స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఉప్పల్ వేదికగా జరిగిన ఫస్ట్ టెస్ట్​లో అతడు కుడి కాలి కండరాల నొప్పితో ఇబ్బంది పడ్డాడు. దీంతో రెండో టెస్టు నుంచి అతడికి రెస్ట్ ఇచ్చింది బీసీసీఐ. స్టార్ బ్యాటర్​ను బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్​సీసీ)కి పంపింది. ప్రస్తుతం ఎన్​సీఏలో డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న రాహుల్ పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 15 నుంచి ఇంగ్లండ్​తో జరిగే మూడో టెస్టులో అతడు బరిలోకి దిగే ఛాన్స్ ఉందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. రాహుల్​తో పాటు మూడో టెస్టులో రవీంద్ర జడేజా ఆడటం కూడా ఖాయమని టాక్. అయితే సిరీస్​లోని తర్వాతి టెస్టులకు విరాట్ కోహ్లీ అందుబాటులో ఉంటాడా? లేదా? అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉందని సమాచారం. సిరీస్​లోని మిగిలిన మ్యాచుల్లో ఆడటంపై కోహ్లీ స్పష్టత ఇచ్చాకే టీమ్ సెలక్షన్ ఉండనుందని క్రికెట్ వర్గాలు అంటున్నాయి.

విరాట్-అనుష్క దంపతులు రెండో బిడ్డ కోసం ఎదురు చూస్తున్నారని మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ వెల్లడించాడు. దీంతో కింగ్ ఇంట్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా అని ఆందోళనకు గురైన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఏబీడీ శుభవార్త చెప్పడంతో కోహ్లీ రీఎంట్రీ ఖాయమని విరాట్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే మిగిలిన అన్ని టెస్టులకు విరాట్ అందుబాటులో ఉంటాడా? లేదా నాలుగు, ఐదు టెస్టులు మాత్రమే ఆడతాడా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. రన్ మెషీన్ స్పష్టత ఇవ్వడం మీదే జట్టు ఎంపిక విషయంలో సెలక్టర్లు ముందుకు వెళ్తారని తెలుస్తోంది. అయితే మూడో టెస్టులో రాహుల్ రీఎంట్రీ ఇస్తాడనే న్యూస్ విని నెటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అతడు మంచి ఫామ్​లో ఉన్నాడని.. ఇంగ్లండ్​ బెండు తీసేందుకు సరైనోడు దిగుతున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. రాహుల్ కమ్​బ్యాక్ కోసం మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి.