iDreamPost

IND vs ENG: మనం ఎందుకు భయపడాలి? టీమిండియాపై గంగూలీ షాకింగ్ కామెంట్స్!

  • Published Feb 03, 2024 | 6:19 PMUpdated Feb 03, 2024 | 6:19 PM

భారత క్రికెట్​ జట్టును ఉద్దేశించి బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ షాకింగ్ కామెంట్స్ చేశాడు. వాళ్లు ఉండగా మనం ఎందుకు భయపడాలని ప్రశ్నించాడు.

భారత క్రికెట్​ జట్టును ఉద్దేశించి బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ షాకింగ్ కామెంట్స్ చేశాడు. వాళ్లు ఉండగా మనం ఎందుకు భయపడాలని ప్రశ్నించాడు.

  • Published Feb 03, 2024 | 6:19 PMUpdated Feb 03, 2024 | 6:19 PM
IND vs ENG: మనం ఎందుకు భయపడాలి? టీమిండియాపై గంగూలీ షాకింగ్ కామెంట్స్!

ఒకప్పుడు టీమిండియా అంటే అందరికీ బ్యాటర్లే గుర్తుకొచ్చేవారు. గవాస్కర్ నుంచి సచిన్ వరకు ఎందరో దిగ్గజ బ్యాట్స్​మెన్​ను క్రికెట్​కు అందించింది భారత్. ఇప్పుడు కూడా మన జట్టు ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలే క్రికెట్​ను ఏలుతున్నారు. అయితే బ్యాటింగే కాదు.. ఇప్పుడు బౌలింగ్ కూడా భారత్ బలంగా మారింది. స్పిన్​ బౌలింగ్​లో ఫస్ట్ నుంచి మన టీమ్ తోపే. కానీ ఇప్పుడు పేస్ బౌలింగ్ కూడా ప్రధాన అస్త్రంగా మారింది. జస్​ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమితో పాటు మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్ రూపంలో ఫెంటాస్టిక్ పేస్ అటాక్ మన దగ్గర ఉంది. అందుకే ఫార్మాట్​తో సంబంధం లేకుండా అన్నింటా రోహిత్ సేన డామినేషన్ నడుస్తోంది. ప్రస్తుతం ఇంగ్లండ్​తో జరుగుతున్న టెస్ట్ సిరీస్​లోనూ బుమ్రా నిప్పులు చెరిగే బంతులతో విధ్వంసం సృష్టిస్తున్నాడు. ఈ తరుణంలో బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ షాకింగ్ కామెంట్స్ చేశాడు. భారత్ ఎందుకు భయపడాలని అన్నాడు.

బుమ్రా, షమి, సిరాజ్ రూపంలో అద్భుతమైన పేస్ బౌలర్లు జట్టులో ఉన్నప్పుడు టీమిండియా ఎందుకు భయడాలన్నాడు గంగూలీ. టెస్టుల్లో ఇంకా టర్నింగ్ ట్రాక్స్​ తయారు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించాడు. మంచి పేసర్లు టీమ్​లో ఉన్నప్పుడు పేస్ పిచ్​లు రూపొందించొచ్చు కదా అని క్వశ్చన్ చేశాడు. ‘బుమ్రా, షమి, సిరాజ్, ముకేష్ బౌలింగ్ చూశాక భారత్​లో టర్నింగ్ ట్రాక్స్​ ఎందుకు ప్రిపేర్ చేస్తున్నారని ఆశ్చర్యపోతున్నా. మంచి వికెట్ల మీద ఆడినప్పుడు ప్రతి మ్యాచ్​కు టీమ్ మరింత స్ట్రాంగ్​గా మారుతుంది. అశ్విన్, జడేజా, కుల్దీప్, అక్షర్​లు కలిస్తే ఏ వికెట్ మీదనైనా 20 వికెట్లు తీయగలరు. ఆ సత్తా వాళ్లకు ఉంది’ అని గంగూలీ చెప్పుకొచ్చాడు. స్పిన్ పిచ్​ల వల్ల గత 6 నుంచి 7 ఏళ్లుగా మన జట్టు బ్యాటింగ్ క్వాలిటీ దారుణంగా దెబ్బతింటోందని పేర్కొన్నాడు. పేస్​కు సహకరించే వికెట్లను తయారుచేసినా భారత్ 5 రోజుల్లోపే మ్యాచులను ఫినిష్ చేస్తుందని దాదా స్పష్టం చేశాడు.

ఇక, ఉపఖండంలో భారత్​తో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్​లు కూడా స్పిన్ ట్రాక్స్​నే సిద్ధం చేస్తుంటాయి. టర్నింగ్ ట్రాక్స్​తో ప్రత్యర్థి జట్లను బెంబేలెత్తిస్తుంటాయి. అయితే ఒకప్పుడు ఉపఖండ జట్లలో క్వాలిటీ స్పిన్నర్లతో పాటు టాప్ క్లాస్ బ్యాటర్స్ ఉండేవారు. కాబట్టి విదేశీ జట్లు మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్లను తక్కువ స్కోర్లకే ఆలౌట్ చేసేవారు. ఆ తర్వాత మన బ్యాటర్లు అవతలి జట్టులోని స్పిన్నర్లను చితకబాదేవారు. కానీ ఇప్పుడు స్పిన్ బౌలింగ్​లో బాగా ఆడే బ్యాటర్లు తగ్గిపోయారు. మంచి టెక్నిక్​ కలిగిన బ్యాట్స్​మెన్ ఈ తరంలో తక్కువ. భారత జట్టులో కూడా రోహిత్, కోహ్లీతో పాటు అయ్యర్ స్పిన్​ను బాగా ఆడగలడు. మిగతా వాళ్లు పేస్​ను బాగా ఎదుర్కొన్నా స్పిన్నర్లకు దొరికిపోతున్నారు. ఇంగ్లండ్​ సిరీస్​లోనూ ఇది ప్రూవ్ అయింది. ఈ నేపథ్యంలో గంగూలీ టర్నింగ్ ట్రాక్స్ ఎందుకు? పేస్ వికెట్లు తయారు చేయలేమా? అని ప్రశ్నించాడు. స్పిన్ ట్రాక్స్ వల్ల బ్యాటింగ్ క్వాలిటీ తగ్గిపోయిందన్నాడు. మరి.. టీమిండియాపై గంగూలీ చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి