Nidhan
టీమిండియా యంగ్ క్రికెటర్ ఇషాన్ కిషన్‌కు మరో షాకింగ్ న్యూస్. ఇప్పటికే వరుసగా ఎదురుదెబ్బలు తింటున్న ఇషాన్‌కు ఇది బిగ్ షాక్ అనే చెప్పాలి.
టీమిండియా యంగ్ క్రికెటర్ ఇషాన్ కిషన్‌కు మరో షాకింగ్ న్యూస్. ఇప్పటికే వరుసగా ఎదురుదెబ్బలు తింటున్న ఇషాన్‌కు ఇది బిగ్ షాక్ అనే చెప్పాలి.
Nidhan
ఇషాన్ కిషన్.. ఈ మధ్య కాలంలో టీమిండియా తరఫున బాగా రాణిస్తున్న యంగ్ క్రికెటర్లలో ఒకడు. వికెట్ కీపింగ్‌తో పాటు అద్భుతమైన బ్యాటింగ్ స్కిల్స్‌తో మంచి ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. టీ20ల్లో రెగ్యులర్ ప్లేయర్‌గా మారిన ఇషాన్.. వన్డేలు, టెస్టుల్లోనూ తనకు అవకాశం దొరికిన ప్రతిసారి బాగా పెర్ఫార్మ్ చేస్తున్నాడు. అయితే ప్రస్తుతం అతడి కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. మానసిక ఒత్తిడి నుంచి రెస్ట్ కావాలంటూ టీమ్‌కు దూరమయ్యాడు ఇషాన్. ఈ సమస్య వల్ల సౌతాఫ్రికా సిరీస్ మధ్యలో నుంచి వెళ్లిపోయాడు. అయితే అతడు రెస్ట్ కోరితే.. బీసీసీఐ మాత్రం పూర్తిగా పక్కనపెట్టేసింది. ఆఫ్ఘానిస్థాన్‌తో టీ20 సిరీస్‌తో పాటు ఇంగ్లండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌కు అతడ్ని పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో ఏం చేయాలో ఇషాన్‌కు పాలుపోవట్లేదు. ఈ తరుణంలో ఈ యంగ్ బ్యాటర్‌కు మరో షాకింగ్ న్యూస్. కేఎల్ రాహుల్ నుంచి వికెట్ కీపింగ్ బాధ్యతల్ని కేఎస్ భరత్‌కు అప్పగించనున్నారని తెలిసింది.
యాక్సిడెంట్ వల్ల రిషబ్ పంత్ టీమ్‌కు దూరమవడంతో అతడి ప్లేసులో ఇషాన్ కిషన్‌ను ఆడిస్తూ వచ్చింది భారత్. ఆ తర్వాత వికెట్ కీపింగ్ బాధ్యతల్ని కేఎల్ రాహుల్‌కు అప్పగించింది. తెలుగు తేజం కేఎస్ భరత్ కూడా ఒక సిరీస్‌లో కీపర్‌గా ఉన్నాడు. అయితే అతడు రాణించకపోవడంతో రాహుల్, ఇషాన్‌ను ఆ రోల్ కోసం సెలక్ట్ చేస్తూ వచ్చింది బీసీసీఐ. కానీ ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు మాత్రం ఇషాన్‌ను ఎంపిక చేయలేదు. అతడి ప్లేసులో కేఎస్ భరత్‌తో పాటు మరో తెలుగు కుర్రాడు, వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ధ్రువ్ జురెల్‌ను జట్టులోకి తీసుకుంది. అయితే ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం.. కేఎల్ రాహుల్‌ను స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ఆడిస్తారట. కీపింగ్ రెస్పాన్సిబిలిటీని భరత్‌కు అప్పగించాలని టీమ్ మేనేజ్మెంట్ డిసైడ్ అయిందట. వెన్ను నొప్పితో బాధపడుతున్న రాహుల్ ఇటీవలే సర్జరీ చేయించుకోవడంతో అతడి మీద ప్రెజర్ పడొద్దనే కీపింగ్‌కు దూరంగా ఉంచుతున్నారట.
ఇక, భరత్‌ను వికెట్ కీపర్‌గా తీసుకుంటారనేది ఇషాన్‌కు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఇంగ్లండ్‌తో మిగిలిన మూడు టెస్టులకు ప్రకటించే టీమ్‌లో అయినా కిషన్‌కు ఛాన్స్ ఇస్తారా? లేదా దూరం పెడతారా అనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఇదంతా తన సొంత తప్పుల వల్లే జరిగిందని సోషల్ మీడియాలో నెటిజన్స్ చెబుతున్నారు. మానసిక ఒత్తిడితో బాధపడుతున్నానని చెప్పి పార్టీలు చేసుకోవడం, ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ప్రోగ్రామ్‌కు బీసీసీఐకి చెప్పకుండా వెళ్లడం వల్లే అతడి కెరీర్ ప్రశ్నార్తకంగా మారిందని కామెంట్స్ చేస్తున్నారు. చేసిన తప్పును ఒప్పుకొని, బుద్ధిగా ఉంటే తిరిగి కెరీర్‌ను గాడిలో పెట్టుకోవచ్చని నెటిజన్స్ సూచిస్తున్నారు. అయితే ఇషాన్ ప్లేస్‌లోకి టీమ్‌లోకి వచ్చిన కేఎస్ భరత్ రాణిస్తే కిషన్ స్థానం గోవిందా అని మరికొందరు చెబుతున్నారు. మరి.. ఇషాన్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: ఆఫ్ఘాన్‌తో రెండో టీ20తో బరిలోకి కింగ్ కోహ్లీ! ముందున్న సవాళ్లు ఇవే!
🚨 According to the Indian Express, KS Bharat will keep wickets, and KL Rahul will focus on batting for India in the upcoming England Test series. pic.twitter.com/j3Y5JVXD40
— CricketGully (@thecricketgully) January 14, 2024